== మెషిన్ vs మనిషి == ఇప్పుడంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ యుగం నడుస్తుంది కదా! అయితే ఈ మెషిన్లను మనుషులను వేరు చేసేది ఇంగిత జ్ఞానమే.
అర్థం కాలేదా? శంకర్ తీసిన రోబో సినిమాలో కాళ్ళు, చేతులు, తెలివితేటలు ఇలా ఒక మనిషికున్నవన్ని నాకున్నాయి అని రోబో రజినీకాంత్ అంటే అసలైనది ఇంకొకటి లేదని కమెడియన్లు రోబోను ఏడిపిస్తారు. కమెడియన్ల ఉద్దేశం వేరే అయినప్పటికీ సినిమాలో మనిషికున్న ఏమోషన్స్ రోబోకి లేవని అంటే ఆ తర్వాత వాటిని కూడా జత చేస్తాడు సైంటిస్టు రజనీకాంత్. సినిమా కదా ఏదైనా చూపించవచ్చు కాని వాస్తవ ప్రపంచంలో ఇది ఇంకా పూర్తి కార్యరూపం దాల్చలేదు. భవిష్యత్తులో నిజంగానే రోబోలకు హ్యూమన్ ఏమోషన్స్ నేర్పించవచ్చేమో!
పూర్తి స్థాయి హ్యూమన్ ఏమోషన్స్ ప్రోగ్రామింగ్ చేయబడిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేయవచ్చేమో కాని అప్పటికి ఈ మెషిన్లకు మనుషులకు తేడా ఇంగిత జ్ఞానమే అని నా బలమైన అభిప్రాయం.
Ads
ఉదాహరణకు గత మూడు రోజుల్లో నా పేరు మీద రెండు ఫేక్ ఐడిలు క్రియేట్ చేసారు సైబర్ నేరగాళ్లు. మిత్రులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం, యాక్సెప్ట్ చేయగానే మెసెంజర్ లో డబ్బులు అడగడం ఇది వాళ్ల పని. ఈ తెలివితక్కువ దద్దమ్మ జుకెర్ బర్గ్ గాడు ఫేస్బుక్లో ఫేక్ ఐడిలు క్రియేట్ చేయకుండా నిలువరించే సిస్టం ఏది పెట్టలేదు. పెట్టకపోతే పోయాడు కానీ, అరె బాబు, నా పేరు మీద ఎవడో ఫేక్ ఐడి క్రియేట్ చేసాడు అని నేను స్వయంగా రిపోర్టు చేసినా, మిత్రులు ఇది ఫేక్ ఐడి అని రిపోర్టు కొట్టినా కూడా వాడి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఇది కమ్యూనిటీ స్టాండర్డ్స్ కి వ్యతిరేకంగా లేదు, అందుకే ఐడినీ తొలగించడం లేదని సమాధానం ఇస్తున్నాడు. ..
ఒరేయ్ జుకెర్ బర్గ్, టెక్నికల్ స్టాండర్డ్, నీ ఆల్గారితం ప్రకారం ఐడి కరెక్ట్ కావచ్చు కానీ ఇది ఆల్రెడీ ఫేస్బుక్లో ఒక ప్రొఫైల్ కలిగిన వ్యక్తి యొక్క ఫేక్ ఐడి అని గుర్తించే ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా? మా ప్రొఫైల్ కి రక్షణ లేకపోతే అసలు నీ ఫేస్బుక్ ప్లాట్ఫంలో ఉండటం యెందుకు? ఎంత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడినా కొంచెం మనిషి బుర్ర కూడా ఉపయోగించి ఏది ఏమిటి అని చూడరా బాబు. లేదంటే నీ ఫేస్బుక్ దుకాణం ప్రభావం కోల్పోవడం ఖాయం……. By Nagaraju Munnuru
Share this Article