ఫహాద్ ఫాజిల్… మలయాళ హీరో… అదేనండీ తెలుగులో పుష్ప ఫస్ట్ పార్టు చివరలో వచ్చి దడదడలాడించాడు కదా, అదుగో ఆ విలన్… తనేమీ పిచ్చోడు కాదు… సినిమా ఇండస్ట్రీలో ఒక మాట నోటి వెంట వస్తే దాని పరిణామాలు ఏమిటో తెలియనివాడూ కాదు… లౌక్యం కూడా తెలిసినవాడే… భార్య కూడా ఇండస్ట్రీలోనే ఉంది, హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్… పేరు నజిరియా… తండ్రి ఫాజిల్ కూడా చాన్నాళ్లు ఇండస్ట్రీలో డైరెక్టర్, యాక్టర్, రైటర్… బ్రదర్ ఫరాన్ కూడా యాక్టరే…
ఫాజిల్ అమెరికా వెళ్లి మరీ ఫిలాసఫీలో మాస్టర్స్ చేశాడు… అలాంటిది తను అనాలోచితంగా పుష్ప సినిమాతో నాకొచ్చిందేమీ లేదు అని వ్యాఖ్యానించలేదు… పెద్దగా పాపులారిటీ ఏమీ రాలేదనీ, ఆ విషయం పుష్ప డైరెక్టర్ సుకుమార్‌కు కూడా చెప్పాననీ అంటున్నాడు… తనకు మలయాళ సినిమాయే ప్రధానమనీ, పాన్ ఇండియా వాంఛలేమీ లేవన్నాడు… ఈ వ్యాఖ్యల్లో అబద్ధం ఉంది, ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి…
ఎందుకంటే..? పైన చెప్పుకున్న తన బ్యాక్ గ్రౌండ్… మలయాళ సినిమాయే ప్రధానం కావచ్చుగాక, కానీ పాన్ ఇండియా గుర్తింపును కోరుకోని నటులెవరు ఉంటారు..? పుష్ప సినిమాతో రికగ్నిషన్ రాకపోవడం ఏమిటి..? పాన్ ఇండియా పాపులారిటీ వచ్చింది కదా… ఆ దెబ్బకు పుష్ప-2 లో కూడా చేరాడు కదా… అసలు పుష్ప రెండో పార్టులో తన పాత్ర ఇంకాస్త ప్రయారిటీతో ఉంటుందట… పుష్ప తరువాత మలయాళమే గాకుండా తమిళం, తెలుగు సినిమాల్లో కూడా మంచి రెమ్యునరేషన్‌తో ఇంకా ప్రయారిటీ రోల్స్ రావడానికి కూడా చాన్స్ ఏర్పడింది… మరెందుకు ఈ వ్యాఖ్యలు చేసినట్టు..?
Ads
బహుశా రెమ్యునరేషన్ ఇష్యూ అయి ఉంటుంది… పుష్ప కోసం సైన్ చేసినప్పుడే సుకుమార్ రెండు పార్టులకూ ఫిక్స్ చేసి ఉంటాడు… అది ఇంత సూపర్ హిట్ అవుతుందని అంచనా వేయలేక ఫాజిల్ ఇస్తానన్నకాడికి వోకే చెప్పి ఉంటాడు… తీరా చూస్తే అదేమో బంపర్ హిట్… సెకండ్ పార్టులోనూ చేయకతప్పదు… నో, నో, అంటే కుదరదు… మరీ మొండికేస్తే సెకండ్ పార్టులో ఆ పాత్రను మొత్తం లేపేసి, ఇంకెవరినైనా పెట్టుకుంటారు… సో, ‘మూసుకుని’ వర్క్ చేస్తున్నట్టుంది…
తన అసంతృప్తిని ఈరకంగా ఎక్స్‌ప్రెస్ చేశాడు, అంతే… బన్నీతో స్నేహం ఉంది, బన్నీకి మలయాళంలో మంచి మార్కెట్ కూడా ఉంది… సో, పుష్ప పెద్దలతో గోక్కోలేడు… సర్లేవయ్యా, ముందు షూటింగ్ అయిపోనీ, ఎంతోకొంత నిన్ను సాటిస్ఫై చేస్తాంలే అని సుకుమారుడు చెప్పకపోడు అని ఆశ… ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే… ఫాజిల్ ఏదో అనగానే, హబ్బ, మనసులో ఉన్నమాట స్ట్రెయిట్‌గా చెబుతాడు, నిజాయితీగా బయటపడతాడు వంటి విశేషణాలు అవసరం లేదని..!! అంత దృశ్యం కూడా లేదని..!!
Share this Article