.
ఇప్పుడే ఒక వార్త కనిపించింది సోషల్ మీడియాలో… ఇంకా ధ్రువీకరించుకోవాల్సింది… కానీ ఒకింత విస్మయానికి గురిచేసింది…
సరే, ఏపీలో ఏదైనా సాధ్యమే… అసలు వార్త ఏమిటంటే… ఇదుగో…
Ads
పార్వతీపురం, మన్యం జిల్లా… పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐ.పి.ఏస్ ఆఫీసర్ కలకలం…
ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలానికి పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్… పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఆయన వెన్నంటే ఉండి ఐ.పి.ఏస్ ఆఫీసర్ లా కలియ తిరిగిన వ్యక్తి…
పర్యటన అనంతరం కింది స్థాయి సిబ్బందితో ఫోటోలుకు ఫోజులు ఇచ్చిన వ్యక్తి… పర్యటన తర్వాత ఫోటోలు బయటకు రావడంతో ఎంక్వైరీ చేసిన మన్యం జిల్లా పోలీసులు…
నకిలీ ఐ.పి.ఏస్ ఆఫీసర్ అని తేలడంతో నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్న విజయనగరం రూరల్ పోలీసులు… నకిలీ ఐ.పి.ఏస్ ఆఫీసర్ గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్య ప్రకాష్ అనే వ్యక్తిగా గుర్తింపు…
ఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు… విచారణ చేపట్టిన పోలీసులు…..
.
.
ఇదీ వార్త… ఆ పర్యటన మొత్తంలో తను ఎవరు అని సందేహించిన పోలీసులు, అధికారులే లేకుండా పోయారా..? పోలీసులకు తమ బాస్ ఎవరో తెలియదా..? ఉన్నతాధికారులకూ తెలియదా…?
ఐపీఎస్ ఐనా సరే, ఏదో ఆ పరిసర ఏరియాల్లో బాసిజం వెలగబెడుతూ ఉండాలి కదా… పోనీ, ఒక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పాపులర్ స్టార్ తిరుగుతూ ఉంటే… పోలీసు యంత్రాంగం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..?
పైగా రోజులు అసలే బాగాలేవు, ఏదో తేడా కొడుతోంది, పవన్ కల్యాణ్ బహుపరాక్…!!
పోనీ, తన వెంట ఉండే జనసేన, తెలుగుదేశం కూటమి కార్యకర్తలు, నాయకులకైనా సందేహం రావాలి కదా… తనెవరో స్వేచ్ఛగా ఫోటోలు కూడా దిగుతుంటే ఏ ఒక్కరికీ తేడా కొట్టలేదా..?
ఆ ఏరియాలో ఏఎస్పీగానో, మరే పోస్టులోనో పనిచేస్తుంటే తరచూ వార్తలు కనిపిస్తుంటాయి కదా… పోలీసులతో భేటీలు, సందర్శనలు జరుగుతూ ఉంటాయిగా… కానీ ఎవరో వచ్చి ఐపీఎస్ ఆఫీసర్‌లాగా ఫోజులు కొడుతూ, బందోబస్తులో పోలీసులతో సహా హడావుడి చేస్తుంటే నిజానికి ఆ టూర్ కవర్ చేస్తున్న జర్నలిస్టులకైనా డౌట్ రావాలి… కనుక్కోవాలి…
ఇవేవీ లేవు… అసలే మన్యం ఏరియా… తెలుసు కదా… ఐనా అంత అజాగ్రత్తగా ఏపీ ప్రభుత్వ యంత్రాంగం ఎలా వ్యవహరించింది..? బాసూ… జాగ్రత్త…!!
Share this Article