.
ఫోన్ ట్యాపింగు కేసులో హరీష్ రావు విచారణకు సంబంధించి కొన్ని నిజాలు, కొన్ని ట్విస్టులు చెప్పుకోవాలి… బీఆర్ఎస్ క్యాంపు, ప్రత్యేకించి హరీష్ రావు జనం చెవుల్లో పూలు పెడుతూ… ఏవో అబద్ధాల్ని నిజాలని నమ్మించే ప్రయత్నం చేస్తారు కాబట్టి…
ఇది లొట్టపీసు కేసు, సహకరిస్తాం అంటూనే వందల మందిని సమీకరించడం, విచారణ జరిగే చోట నినాదాలు, సోషల్ ప్రచారాలు, 2 గంటలైపోయింది, ఇంకెంతసేపు అనే ప్రశ్నలు… ప్రభుత్వం కక్షసాధింపు అనే ప్రచారాలు దేనికి..? పైగా జనసందోహాన్ని అదుపు చేస్తే బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీస్ జులుం అనే ఆరోపణలు…
Ads
- హరీష్ రావును సిట్ విచారణకెు పిలవగానే… ‘రేవంత్ రెడ్డి బావమరిది స్కాం మేం బయటపెట్టగానే సిట్ పిలిచింది… ఇదంతా బొగ్గు కుంభకోణం నుంచి డైవర్షన్…’ అని మరో విఫల సమర్థన… అసలు ఆ కంట్రాక్టులే ఇంకా ఎవరికీ ఇవ్వకముందే కుంభకోణం జరిగిందట… హిల్ట్ పాలసీ ఉత్తర్వులు రాగానే లక్ష కోట్ల కుంభకోణం అని ఆరోపించినట్టే ఇది కూడా…
సరే, ఈ కేసు గురించి వద్దాం.,.. బీఆర్ఎస్ ఏమంటోంది..? సుప్రీంకోర్టు కేసు కొట్టేసినా రేవంత్ రెడ్డి కక్షసాధింపుగా, సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించి హరీష్ రావును విచారిస్తోంది అని కదా…, కానీ అది అబద్ధం… బీఆర్ఎస్ మార్క్ ఫేక్ ప్రాపగాండా… సుప్రీంకోర్టు ఆదేశాలు కేసు వేరు, ఇప్పుడు హరీష్ రావును విచారించే కేసు వేరు… అవును, రెండు వేర్వేరు కేసులు…
కమిషనర్ సజ్జనార్ కూడా ఓ ప్రకటనలో క్లారిటీ ఇచ్చాడు… ఐనా అది గాకుండా బీఆర్ఎస్ వ్యాఖ్యలనే మీడియా హైలైట్ చేసింది… అసలు నిజం ఏమిటంటే..?
- వేర్వేరు కేసులు…: సుప్రీంకోర్టు కొట్టివేసింది కేవలం సిద్దిపేట వ్యాపారి చక్రధర్ గౌడ్ దాఖలు చేసిన వ్యక్తిగత ఫిర్యాదుకు (FIR) సంబంధించిన కేసును మాత్రమే… ప్రస్తుతం సిట్ విచారిస్తున్నది మార్చి 2024లో ప్రభుత్వం స్వయంగా నమోదు చేసిన ప్రధాన ఫోన్ ట్యాపింగ్ కేసు (Crime No. 243/2024)….
- సాక్షిగా విచారణ…: ఈ కేసులో హరీష్ రావుకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిసి ఉండవచ్చని, అందుకే ఆయనను విచారణకు పిలిచినట్లు పోలీసులు పేర్కొంటున్నారు…
- దర్యాప్తు కొనసాగింపు…: ప్రధాన కేసులో అభియోగాలు మోపబడిన ప్రతాప్ రెడ్డి వంటి మాజీ పోలీసు అధికారులతో హరీష్ రావుకు ఉన్న సంబంధాలపై స్పష్టత కోసం ఆయనను దాదాపు ఏడు గంటల పాటు విచారించారు….
ఈ కేసు చాలా సీరియస్… అరాచకంగా సాగిన ఫోన్ ట్యాపింగ్, హార్డ్ డిస్కుల ధ్వంసం, ట్యాపింగ్‌కు ప్రత్యేక ఆఫీసులు- వ్యవస్థలు, చివరకు మావోయిస్టులు, ఉగ్రవాదుల సమాచారం కూడా ధ్వంసం చేయబడింది… ఈ కేసులో విచారణ కొనసాగుతోంది… హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఒక ప్రకటనలో క్లారిటీ ఇచ్చిందీ అదే… (జర్నలిస్టులు, నాయకులు, మేధావులు, బయటి నుంచి వచ్చే పొలిటిషియన్స్ ఫోన్లు కూడా… ఇలా ఎవరి ఫోన్లనూ వదల్లేదు అప్పట్లో….?)
- అంతేకాదు, సాక్షాత్తూ కవితే చెప్పింది కదా, మా ఫోన్లు, చివరకు నా భర్త, అంటే కేసీయార్ ఇంటల్లుడి ఫోన్‌నూ హ్యాక్ చేశారని..! అంతేకాదు… విశ్వసనీయ సమాచారం ఏమిటంటే..? నిన్న హరీష్ రావుకు సిట్ పోలీసులు ఇచ్చిన ప్రశ్నల షాక్…
నేను పోలీసులను ప్రశ్నలడిగాను, వాళ్లే బిత్తరపోయారు, అడిగిందే అడిగారు, ఇదొక రాజకీయ కక్షసాధింపు అని బయట మీడియాకు చెప్పుకున్నాడు కదా… ఓ దశలో మీ ఫోన్ కూడా హ్యాకయింది లేదా ట్యాపయింది కదా అనడిగితే, మీరు క్రియేట్ చేస్తున్నారా అని దబాయించబోయాడట హరీష్ రావు… తన ఫోన్ హ్యాకయిన ఆధారాలే కాదు, తన కుటుంబసభ్యులు, ముఖ్య అనుచరుల ఫోన్ల ట్యాపింగ్ ఆధారాలు కూడా చూపించారట పోలీసులు… హరీష్ రావు సైలెంట్…
నిజమే… 2018 ఎన్నికల తరువాత హరీష్ రావును చాన్నాళ్లు దూరం పెట్టాడు కేసీయార్ తెలుసు కదా… తన పొలిటికల్ మూవ్స్ మీద కేసీయార్‌కు అనుమానాలు… ఐనా కేసీయార్ ఫోన్ ట్యాపింగ్ ధాటికి వీళ్లూ వాళ్లూ అనే తేడా లేదు… తెలంగాణ సమాజం మొత్తం ఫోన్ ట్యాపింగ్ బాధితమే…
మహేందర్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు, శివధర్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు అంటాడు హరీష్ రావు… ఎవరిని విచారిస్తే నిజాలు బయటికొస్తాయో, ఎవరిని ప్రశ్నించాలో సిట్ నిర్ణయించుకుంటుంది… టరమ్స్ నిర్దేశించాల్సింది ఆరోపణలు ఎదుర్కునేవారు కాదు కదా..!!
సో, అసలు నిజాలు వేరు... బయట బీఆర్ఎస్ క్యాంపు చేసుకునే ప్రచారం వేరు... గాయగత్తరతో నిజాల్ని కప్పిపెట్టడం అన్నివేళలా సాధ్యం కాదని అది గ్రహించదు... విచిత్రంగా మీడియా కూడా ఆ ట్రాపులో పడి, వాళ్లు చెప్పినవే రాస్తుండటం..! అసలు నిజాల జోలికి పోెకపోవడం..!!
Share this Article