Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇంకా టైముంది..! కుంభమేళా యాత్రికులకు కొన్ని సూచనలు..!!

February 8, 2025 by M S R

.

శ్రీ కేశిరాజు 9573891255 ……. గురువు వృషభంలో మరియు సూర్యుడు మకరంలో ఉన్నప్పుడు వచ్చే మహాకుంభ మేళా ఇపుడు జరుగుతున్నది . శని శుక్రులు కుంభంలో మిత్రులై బలంగా ఉన్న సమయం జీవనదులైన గంగకి ఎంతో పవిత్రమైనదిగా ప్రజలు నమ్ముతారు .

మహాకుంభ మేళాకి వెళ్లాలనుకునేవారికి కొన్ని సూచనలు .. నేను చాలా ప్రశాంతంగా వెళ్లి వచ్చాను .. ఆ అనుభవంతో షేర్ చేసుకుందామని తాపత్రయం ..

Ads

1 కోటి మంది వచ్చే మాట నిజమే గాని చాలా మంది స్నానం చేస్కొని తిరుగు ప్రయాణం అయ్యేవాళ్లే. మీరు అనుకున్నంత , TV లో చూసినంత తొక్కిడి చాలా తక్కువ ఘాట్స్ లోనే ఉంటుంది . ఇంకా మాట్లాడితే ఒక్క సంగం ఘాట్ దగ్గరే ఎక్కువ రష్ ఉంది .

2 . మొత్తం 41 ఘాట్స్ ఉన్నాయి .. ఎక్కడినుంచైనా బోట్ లో త్రివేణి సంగమం దగ్గరకి వచ్చేయచ్చు .. మాక్సిమం అరగంట ప్రయాణం పడవలో.. రాను పోను గంట, స్నానానికి పూజలకు ఒక అరగంట సుమారు టైం పడుతుంది..

3_ బోట్ కి మనిషికి 400 దాకా ఛార్జ్ చేస్తారు . ఇది రష్ ని బట్టి మారుతుంది . అరైల్ ఘాట్ కానీ బోట్ క్లబ్ కానీ కొంచం ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు . కానీ టికెట్స్ ఈజీగానే దొరుకుతాయి . ఏమీ కంగారు పడక్కరలేదు . వందలాది పడవలు ఉన్నాయి . అరైల్ లో 800 ఛార్జ్ చేసారు మాకు. చాలా బాగా సంగమం దగ్గరకి తీసుకెళ్లి, తీసుకుని వచ్చాడు . ఎవరినీ తొందర పెట్టలేదు . Leisure గా స్నానం గంగ పూజ చేసుకుని వచ్చాము..

4. ఊర్లో చాలా దూరం నుంచి కార్స్ మోటార్ సైకిల్స్ allow చేయడం లేదు . కాబట్టి 5 నుంచి 15 Kilometres నడవడానికి ప్రిపేర్ అవండి . కానీ అసలు అలసట తెలియదు . తీర్థాలలో నడచినట్లే .

5. చాలా చోట్ల ఉచిత టీ , టిఫిన్స్ ఇస్తున్నారు వివిధ కంపెనీల వాళ్ళు . చాలా కంపెనీస్ స్టాల్స్ పెట్టి ప్రొడక్ట్స్ అమ్ముతుంటాయి కాబట్టి తిండి గురించి వర్రీ అవక్కరలేదు.

6. స్నానానంతరం అలాహాబాద్ ఊరిలోకి రావాలంటే మెయిన్ రోడ్ దాకా నడిచి OLA కానీ Rapido కానీ two wheelers దొరుకుతాయి . రెంట్స్ నార్మల్ గానే ఉన్నాయి . కొంచెం ట్రాఫిక్ ఎక్కువ కాబట్టి two wheelers ప్రిఫర్ చేయండి .

7. చలి కొంచెం ఉంది .. అంత భయంకరంగా ఏమీ లేదు .స్వేట్టెర్ వేసుకుంటే చాలు .. రాను రాను తగ్గే చలి . ఈపాటికి ఇంకా తగ్గిపోయి ఉంటుంది . Jerkin గాని sweater గాని వేసుకోండి చాలు .

8 . Accommodation ముందుగానే అరెంజ్ చేసుకోండి . డార్మిటరీ బెడ్స్ అయితే కొంచం ఎక్కువ కాస్ట్ అయినా చాలా దొరుకుతున్నాయి . సివిల్ లైన్స్ ఏరియాలో చాలా ఉన్నాయి . లేదా Adventure piligrimage అనుకుంటే మీ ఇష్టం . పెద్ద వాళ్ళు చిన్న పిల్లలు ఉంటే రిస్క్ తీసుకోకండి .

9 . ముఖ్యంగా డేరింగ్ గా వెళ్లిపోయే వాళ్ళు రిటర్న్ జర్నీకి కంగారుపడకండి . నాగపూర్ దాకా VOLVO అండ్ BENZ స్లీపర్స్ ఉన్నాయి . వీలయితే సికింద్రాబాద్ కి వన్దే భారత్ లేదా తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కి తత్కాల్ చేసుకుని ఎక్కేయండి .

10 కొంచెం ప్లానింగ్ తో మీ ట్రిప్ సుఖమయం చేసుకొనండి . ముఖ్యంగా సెక్టార్ త్రీలో మహాకుంభ డిజిటల్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ ని వీలయితే చూడండి .

11 . కొంచెం టైం, ఓపిక ఉంటే నాగసాధులు ఉండే సెక్టార్ దాకా , టెంట్ సిటీ చూసి రండి . మంచి experience .

12. మరీ ముఖ్యంగా టీవీ చానెల్స్ అన్నీ సంగం ఘాట్ లోనే మీడియా పాయింట్ దగ్గరే కెమెరాలు పెట్టుకుని ఉన్నారు . వాళ్ళకి అక్కడ accommodation ఇచ్చారు కాబట్టి అక్కడే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు . మిగతా ఘాట్స్ లో అంత రష్ లేదు .

చివరగా ముఖ్యమైన విషయం – ఒకవేళ మీరు ట్రైన్ లో వెళుతున్నట్లయితే ఫుల్ రష్ గా ఉంటాయని ప్రిపేర్ అయి వెళ్ళండి . UP BIHAR వెళ్లే ట్రైన్స్ అన్నీ అలాగే ఉంటాయి . TC లు ఏమి హెల్ప్ చేయరు …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions