.
Ravi Vanarasi …… అద్భుత విజయం… డీఆర్‌డీఓ ఫైటర్ జెట్ ఎస్కేప్ సిస్టమ్ హై-స్పీడ్ టెస్ట్!
నిన్న, భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) సాధించిన ఒక చారిత్రక ఘట్టం… మన దేశ రక్షణ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే అద్భుతమైన విజయం!
కీలకమైన హై-స్పీడ్ రాకెట్-స్లెడ్ పరీక్ష విజయవంతం!
DRDO, మన పోరాట విమానాలకు (Fighter Aircraft) అత్యంత కీలకమైన “ఎయిర్‌క్రూ ఎస్కేప్ సిస్టమ్” సమర్థతను పరీక్షించడానికి ఒక హై-స్పీడ్ రాకెట్-స్లెడ్ టెస్ట్‌ను ఖచ్చితమైన నియంత్రిత వేగం 800 km/h వద్ద విజయవంతంగా నిర్వహించింది.
Ads
ఈ పరీక్షను ఛండీగఢ్‌లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (TBRL) ఆధ్వర్యంలో ఉన్న రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ (RTRS) ఆవరణలో నిర్వహించారు… ఇది మన దేశంలో అత్యంత ఆధునికమైన, ప్రత్యేకమైన పరీక్షా కేంద్రాలలో ఒకటి…
వివరాలు, ప్రాముఖ్యత!
ఈ పరీక్షలోని ముఖ్య ఉద్దేశాలు మూడు సామర్థ్య అంశాల నిర్దారణ, ధ్రువీకరణ…
1. కెనోపీ సెవరెన్స్ (Canopy Severance):
అత్యవసర పరిస్థితుల్లో పైలట్‌ను బయటకు పంపడానికి ముందు, విమానం పైకప్పు (కెనోపీ) సురక్షితంగా, వేగంగా విడిపోయే విధానాన్ని పరీక్షించడం… దిగువ వీడియోలో ప్రారంభంలో కనిపించే పేలుడు, విడిపోవడం ఇదే ప్రక్రియ…
2. ఎజెక్షన్ సీక్వెన్సింగ్ (Ejection Sequencing):
కెనోపీ విడిపోయిన తర్వాత, పైలట్ సీటు (మానవరహిత డమ్మీ) బయటకు దూకే (ejection) ప్రక్రియ, దాని వేగం, మార్గం, కాలక్రమం అన్నింటినీ కచ్చితంగా పరిశీలించడం. ప్రతి మిల్లీసెకను ఇక్కడ కీలకం…
3. సంపూర్ణ ఎయిర్‌క్రూ రికవరీ (Complete Aircrew Recovery):
ఎజెక్షన్ తర్వాత, పైలట్ సురక్షితంగా కిందకు దిగడానికి పారాచూట్ తెరుచుకోవడం, అది సరిగ్గా పని చేయడం. వీడియోలో ఆకాశం నుండి పారాచూట్ ద్వారా డమ్మీ దిగడం దీనికి సాక్ష్యం…
800 కిలోమీటర్ల వేగంతో విమానం ప్రయాణిస్తున్నప్పుడు లేదా ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా, ఈ ఎస్కేప్ సిస్టమ్ ఎంత వేగంగా, ఎంత సమర్థవంతంగా, ఎంత సురక్షితంగా పైలట్‌ను కాపాడగలదో ఈ పరీక్ష నిరూపించింది…
RTRS – పరీక్షా కేంద్రం గురించి!
రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ (RTRS) అనేది విమానయాన వ్యవస్థలు, క్షిపణి వ్యవస్థలు, ఇతర రక్షణ పరికరాలను వాస్తవ అధిక వేగం, అధిక ఒత్తిడి పరిస్థితులలో పరీక్షించడానికి ఏర్పాటైన ఓ అధునాతన సౌకర్యం… ఈ పరీక్ష విజయవంతం కావడంలో TBRL శాస్త్రవేత్తల మరియు ఇంజనీర్ల అకుంఠిత కృషి, నైపుణ్యం ఎంతో ఉంది…
ఈ విజయవంతమైన పరీక్ష ద్వారా, మన దేశీయ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎస్కేప్ సిస్టమ్‌లు అత్యధిక అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని, మన విలువైన పైలట్ల భద్రత విషయంలో DRDO ఎటువంటి రాజీ పడటం లేదని స్పష్టమవుతోంది… ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’ మన శాస్త్ర సాంకేతిక సామర్థ్యాలకు ఒక గొప్ప నిదర్శనం…
మన దేశ రక్షణను పటిష్టం చేస్తున్న DRDO బృందానికి, ఈ మహత్తర విజయాన్ని సాధించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు! జై హింద్!
#DRDO #IndianDefence #FighterJet #EjectionSystem #TBRL #RTRS #MakeInIndia #AtmaNirbharBharat #Science #Technology #IndianAirForce #రక్షణరంగం #డీఆర్‌డీఓ
Share this Article