Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అనుకోని అనుకూలతలు – లేకపోతే మధ్యప్రాచ్యం మండిపోయేది!

October 2, 2026 by M S R

.

ఫ్లయ్ దుబయ్ విమానఘటన ఉగ్ర కుట్రే అనే వాదనలు బలపడుతున్నాయి… పైలట్‌ను ఖతం చేసి, ఫ్లయిట్‌ను తన ఆధీనంలోకి తీసుకుని, ఆ కోపైలట్ ఏం చేయాలనుకున్నాడు? వెనుక ఎవరున్నారు? అవి మొసాద్ తవ్వుతుంది, అంత తేలికగా వదిలేసే ఘటన కాదు ఇది, అదీ వదలదు…

అంతమంది ప్రయాణికుల ప్రాణాలు రక్షింపబడటానికి అనుకోకుండా అనేక కారణాలు దోహదపడ్డాయి… పలు మీడియా సంస్థలు ఇష్టారాజ్యంగా కథనాలు రాస్తుండటంతో ప్రపంచానికి సరైన సమాచారమూ చేరడం లేదు… కాస్త వివరంగా చెప్పుకోవాలంటే…

Ads

fly dubai

1) అంతటి ప్రాణాపాయంలోనూ పైలట్ స్మిత్ మచ్చర్ ఆ షాక్‌లోనూ ధైర్యంగా, తెలివిగా కాక్‌పిట్ డోర్ తెరవడం పెద్ద ప్లస్ పాయింట్…

2) ప్లంబర్‌గా పనిచేసే ఒక ప్రయాణికుడు Yaniv Huyan కు గతంలో తాను చూసిన MayDay టీవీ సీరియళ్లలో Air Crash సీన్లు గుర్తొచ్చి, వెంటనే విమానం లివర్స్ పైకి లాగడంతో… మరింత కిందకు విమానం పడిపోకుండా పైకి లేచింది… అదొక ప్లస్…

3) మరో ప్రయాణికుడు కోపైలట్‌ను బయటికి లాక్కొచ్చి, పూర్తిగా తన అదుపులోకి తీసుకున్నాడు… ఉన్మాదిగా కనిపిస్తున్న కోపైలట్‌ను చూసి, వాడి చేతిలో గొడ్డలిని చూసి భయపడలేదు… ఇదొక ప్లస్…

4) రిజర్వ్ పైలట్లు వెంటనే కాక్‌పిట్ స్వాధీనం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్ది, క్షేమంగా ల్యాండ్ చేశారు సౌదీలో… రిజర్వ్ పైలట్లు ఉండటం ప్రయాణికుల అదృష్టం… మరో ప్లస్…

5) ప్రయాణికుల్లో ఓ డెంటల్ డాక్టర్ ఉన్నాడు… వెంటనే పైలట్‌కు తగిన తక్షణ వైద్యచికిత్స ఇచ్చాడు… దాంతో పైలట్ ప్రాణాలు నిలిచాయి… తను ఇప్పటికీ హాస్పిటల్‌లో ఉన్నాడు, పర్లేదన్నారు వైద్యులు…

6) అంత వేగంగా వేల అడుగులకు విమానం పడిపోవడం తాకిడికి దాని రడ్డర్ (తోకభాగంలో ఉండే కీలక భాగం కొంత ఊడింది కానీ ముక్కలు కాలేదు… విమానం దిశను మార్చేది అదే… ఇదీ అన్నింటికన్నా పెద్ద ప్లస్ పాయింట్…

అందరు ప్రయాణికుల్లో ఎవరి రాతో గట్టిగా రాయబడి ఉన్నట్టుంది… అందుకే ఒకదాని వెనుక మరొకటి అనుకోని అనుకూలతలు దక్కి, అందరినీ కాపాడాయి…

flydubai

సందేహాలు- సమాధానాలు

1) కోపైలట్ దగ్గర గొడ్డలి ఎక్కడిది..? అది మామూలు గొడ్డలి కాదు, క్రాష్ యాక్స్… ( crash axe ). అంటే విమానం ఏదైనా ప్రమాదానికి గురయినపుడు కాక్ పిట్ అద్దాలని పగులకొట్టి పైలట్ బయటికి రావడానికి ఉపయోగించే చిన్నపాటి గొడ్డలి! కమర్షియల్ ఫ్లైట్ లో 19 సీట్ల కంటే ఎక్కువ ఉంటే తప్పనిసరిగా crash axe ని ఉంచాలని స్టాండర్డ్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ రూల్ అమలులో ఉంది!

2) రిజర్వ్ పైలట్లు ఎందుకున్నారు..? ఫ్లయ్ దుబయ్ విమానం టెల్ అవివ్ చేరుకోగానే కెప్టెన్, కో పైలట్లు విశ్రాంతి తీసుకుంటే, రిజర్వ్ పైలట్స్ రిటర్న్ జర్నీలో విమానాన్ని దుబాయ్‌కి నడుపుతారు! సో, రిజర్వ్ పైలట్లు ఉండటం కాకతాళీయం కాదు, అఫీషియలే…

3) ఎవరు విచారించాలి..? సదరు నిందితుడు రాడికల్ ఇస్లామిస్ట్ అని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించాడు… ఆల్రెడీ మొసాద్ మార్క్ దర్యాప్తు స్టార్టయింది… సౌదీ అరేబియా అధికారులు ప్రాథమికంగా అదుపులోకి తీసుకుని విచారించారు… తదుపరి ఉమ్మడి అంతర్జాతీయ దర్యాప్తు కోసం యూఏఈ (దుబాయ్) అధికారులకు అప్పగించాల్సి ఉంది…

ఇజ్రాయిల్, సౌదీల మధ్య ఎక్కువ దౌత్య సంబంధాలు లేవు… FlyDubai కంపెనీ దుబాయ్‌ది… సో, దర్యాప్తు మొత్తం దుబాయ్ కేంద్రంగా జరుగుతుంది… ఇజ్రాయిల్, యూఏఈ మధ్య ‘అబ్రహం ఒప్పందాల’ ద్వారా బలమైన దౌత్య సంబంధాలు ఉన్నాయి కాబట్టి, ఇజ్రాయిల్ అధికారులు దుబాయ్ విచారణలో పాల్గొని… అసలు కథను రాబట్టే అవకాశం ఉంది…



… చివరకు అలాంటి పాకిస్థాన్ కూడా ఈమెకు సలాం కొట్టింది…



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అనుకోని అనుకూలతలు – లేకపోతే మధ్యప్రాచ్యం మండిపోయేది!
  • కేటీయార్ స్టార్ హోటళ్లు ! రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అక్షరసత్యాలే !!
  • తమన్నా VVAAN – మౌత్‌టాక్ కోసం బొట్లు, ప్రసాదాల ప్రమోషన్ !!
  • చాపచుట్టేసిన శ్రీలంక- మూడు రనౌట్లు – ఆరు డకౌట్లు..!!
  • సిరిసిల్లలో నిలబడి, నిలదీసి… ఈ ‘అనుముల రుద్రారెడ్డి’ అసాధ్యుడే!
  • పిచ్‌తో ఆడకండి… ఆటలోని అసలు మజాయే మాయం!
  • టాకీస్ నుంచి బయటపడ్డాక కనిపించినదే అసలు ‘ప్యారడైజ్’ !!
  • ఇది భూతల స్వర్గమేమీ కాదు! పేదరికం- కాయకష్టం- కన్నీళ్లు అన్నీ !!
  • సుఖాంతమే… కానీ అసలు కథ మాత్రం ఇప్పుడే మొదలైంది…!!
  • What a Memorable Match… ఇండియా రికార్డు చేజింగ్ విక్టరీ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions