Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ పెళ్లి ఖర్చుపై పిచ్చి లెక్కలు… ఫూలిష్ పోస్టులు… నవ్వులాటలు…

July 15, 2024 by M S R

కొందరుంటారు సోషల్ మీడియాలో… తమకు తామే మేధావులం, మాకన్నీ తెలుసు అనుకుని, జనం నవ్వుతారు అనే సోయి లేకుండా పోస్టులు పెట్టేస్తారు… ఇదీ అలాంటిదే… (అనేక వార్తలు… నగల మీద, ప్రివెడ్డింగ్ ఖర్చుల మీద, పెళ్లి ఏర్పాట్ల మీద, ప్రత్యేక ఫ్లయిట్ల మీద, వంటకాల మీద, హాజరైన సెలబ్రిటీల మీద… చివరకు ఆషాఢంలో పెళ్లి ఏమిటనే చర్చ దాకా…)

ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లికి 5000 కోట్లు ఖర్చు పెట్టాడు అనే అంశం మీద రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి… తన సంపద, తన ఇష్టం అని సమర్థించేవాళ్లు కొందరు… తన సంపదలో 0.5 శాతం కూడా పెట్టలేదు అని కొందరు… (అసలు అదేం లెక్క..?) నో, నో, ఈ ఖర్చు తన సంపద ప్రదర్శనకు, తన అట్టహాసానికి, తన దర్పానికీ, తన ఆడంబరానికీ ప్రతీక… అసలు ఇలాంటి పెళ్లిళ్లకు పర్మిషనే ఇవ్వకూడదు అని మరికొందరు…

సాక్షాత్తూ దేశ ప్రధానే హాజరైన పెళ్లి రిసెప్షన్… ప్రపంచ స్థాయి అతిరథ సెలబ్రిటీలు హాజరైన పెళ్లి… ఐనా పెళ్లి ఖర్చుల మీద ఆంక్షలు లేవు కదా మన చట్టాల్లో… కానీ ఒక్కటి మాత్రం నిజం… ఇదే ఖర్చుతో ముఖేష్ అంబానీ నిజమైన దాతృత్వాన్ని గనుక ప్రదర్శించి ఉన్నట్టయితే, ఏదైనా ప్రజోపయోగ చారిటీ పని చేసి ఉంటే… తరతరాలూ ఆ కుటుంబాన్ని గుర్తుంచుకునేవి లక్షల కుటుంబాలు… ఈ దర్పం కాదు, ఆ పుణ్యం అంబానీకి మంచి పేరు తెచ్చి పెట్టి ఉండేది… (కాకపోతే రకరకాలుగా సంపద సొసైటీలోకి డిస్ట్రిబ్యూటైందనేదీ వాస్తవమే) …

Ads

సరే, చారిటీలో తనకు మంచి పేరు ఎలాగూ లేదు, ఉంటుందని ఆశించలేం… తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ బాధ్యతే సరిగ్గా నిర్వర్తించడు అనే విమర్శలు ఉండనే ఉన్నాయి… ప్రపంచ కుబేరుడికి అదే స్థాయి దాతృత్వ గుణం ఉండాలనేముంది..? దాన్ని వదిలేస్తే… ఒకరు ఇలా రాసుకొచ్చారు ఎక్స్ వేదికలో…

ambani

పైపైన చదివితే, అవును, దేశ జనాభా 140 కోట్లు… అందరికీ తలా ఒక కోటి ఇస్తే ఇంకా 4860 కోట్లు మిగిలే ఉంటాయనేది నిజమే కదా అనిపిస్తుంది కొందరికి… కానీ శుద్ధ తప్పు… 140 కోట్లు ఇచ్చేస్తే జనాభా మొత్తానికి తలా కోటి సంపద వస్తుందనేది నిజమైతే, కేంద్ర ప్రభుత్వానికి అది చిటికెలో పని… అంతెందుకు..? ఏ పేరున్న గుడి కూడా ఆ మొత్తాన్ని ఇవ్వగలదు…

ఆ లెక్క తప్పు… 140 కోట్లను ఒక కోటితో గుణించాలి… ఇదే ప్రశ్న కోరా వేదికలో ఓసారి వచ్చినప్పుడు ఓ మిత్రుడు ఇంగ్లిషులో ఇలా వివరించాడు… నేను లెక్కల్లో పూర్ కాబట్టి దాన్ని అర్థమయ్యేలా చెప్పలేను… ఆ ఆన్సర్ ఓసారి చదవండి… (130 కోట్లకు లెక్క ఇది…)


This will be a huge huge number…

Just multiply 130* one crore* one crore…

1 crore = 1,00,00,000

1 crore^2 = 1,00,00,000*1,00,00,000

That is 1 followed by 14 zeros.

1 crore^2 = one hundred trillion.

Now multiply that with 130.

You will get Rs. thirteen quadrillion…

World’s total wealth as of 2019 is 360 trillion $…

If you convert that amount into Rs, then you will get Rs. twenty-five quadrillion two hundred trillion…

So there you go, you will need roughly half of entire world’s wealth to distribute 1 crore to each person in India…


రఫ్‌గా ఆయన జవాబు ఏమిటంటే..? దేశంలో ప్రతి ఒక్కరికీ కోటి రూపాయలు ఇవ్వాలంటే ప్రపంచ మొత్తం సంపదలో సగభాగం కావాలి అని..! ఈ నంబర్‌ను తెలుగులో ఏమంటారో కూడా తెలియదు… తెలుగు సంఖ్యల్లో క్షోణి, మహాక్షోణి అనే పదాలున్నట్టు గుర్తు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions