ఒక్క వారం కూడా పూర్తి కాలేదు… పుణ్యస్త్రీ గొడవ దాకా వచ్చేసింది… నిజానికి విష్ణుప్రియ హౌజులో పెంట పెంట చేస్తుందనే ఓ అభిప్రాయం ఉండేది మొదట్లో… తనేం మాట్లాడుతుందో తనకే తెలియదు, కొన్ని పదాల్ని ఏ సందర్భాల్లో ఏ అర్థంలో వాడాలో అస్సలు తెలియదు…
రెండోరోజో, మూడోరోజో… మాస్కులినిటీ, ఫెమినిటీ పదాల్ని వాడేసింది… నిజానికి వాటిని మగ, ఆడ అనే అర్థంలో వాడుతుంటాం కదా… కొన్నిసార్లు దృఢత్వం, సరళత్వం అని చెప్పడానికి ఆయా పదాల్ని సందర్భాన్ని బట్టి వాడుతుంటారు… అది వోకే… ఆమె ఫెమినిటీ అనే పదాన్ని వాడితే ఎవరో కంటెస్టెంట్ తనలో ఆడతనం ఉందని దెప్పుతుందా అని అనుమానించాడు…
టఫ్‌గా ఉండటం, సాఫ్ట్‌గా ఉండటం అనే అర్థాల్లో ఆ పదాల్ని వాడిందేమో, అందులో విష్ణుప్రియ తప్పేమీ లేదు కదా అనిపించింది… కానీ నిన్న, మొన్న పుణ్యస్త్రీ అనే పదాన్ని వాడేసింది… నిజానికి ఆ పదానికి అర్థమేమిటో ఆమెకు తెలియదు… పుణ్యస్త్రీ అంటే భర్త కలిగిన మహిళ… అంటే ముత్తయిదువ… కానీ విష్ణుప్రియ దాన్ని కేరక్టర్ కలిగిన మహిళ అనే అర్థంలో వాడేసింది… ఆ సందర్భం ఏమిటంటే..?
Ads
బహుశా ఈ పెంట స్టార్ట్ చేయాలని బిగ్‌బాస్ టీమే విష్ణుప్రియకు చెప్పి ఉంటారేమో… ఆమె సోనియా దగ్గరకు వెళ్లి… మొదట్లో నిఖిల్‌కూ నీకూ సరిగ్గా లేదు, హఠాత్తుగా మీమధ్య ఇంత ఫ్రెండ్‌షిప్ పెరిగిందేమిటి అనడిగింది… నిజానికి మామూలు ప్రశ్న… కానీ ఆమె అడిగిన తీరు బాగోలేదు, మీమధ్య ఏదో మొదలైంది అన్నట్టుగా ఉందది… తన తెలుగు మాటల ఉచ్చారణే సరిగ్గా ఏడవదు, పైగా ఇలాంటి ప్రశ్నల్ని ఎలా అడగాలో ఇంకేం తెలుస్తుంది..?
ఆ ప్రశ్న అడిగిన తీరు నచ్చక సోనియా చిరాకుతో ఇలాంటి అడల్టరేటెడ్ జోక్స్ నాకు నచ్చవు అనేసింది… అది ఆమె ఇష్టం… అలాంటి చిల్లర ప్రశ్నల్ని రిసీవ్ చేసుకోవాలో వద్దో ఆమె ఇష్టం… అందుకని ప్లీజ్ వద్దు అన్నది… దాన్ని గౌరవించాలి కదా విష్ణుప్రియ… ఇక్కడ అడల్టరేటెడ్ జోక్ అంటే కల్తీ అని… అంటే కాస్త కాలుష్యం, పొల్యూషన్ వాసన గొట్టే ప్రశ్న అని..! విష్ణుప్రియకు అర్థమైతే కదా… అడల్టరీ జోక్స్ అని సోనియా వ్యాఖ్యానించినట్టుగా తీసుకుంది… అడల్టరీ అంటే వ్యభిచారం… అంటే కేరక్టర్‌లెస్ అని అంటుందేమో అనుకుని విష్ణుప్రియ వెంటనే నువ్వొకదానివే పుణ్యస్త్రీ అనుకుంటే ఎలా అన్నట్టుగా ఏదేదో మాటలు వదిలింది…
1) సోనియా ఏం చెప్పిందో తను అర్థం చేసుకోలేదు… 2) ఒకసారి అలాంటి ప్రశ్నలతో తనను గోకొద్దు అని చెప్పినప్పుడు వదిలేయాలి, పదే పదే నేనిందుకు అడిగాను, ఇలా అడిగాను, ఈ అర్థంలో అడిగాను అని పదే పదే గుచ్చింది సోనియాను… 3) పుణ్యస్త్రీ అంటే కేరక్టర్ కలిగిన స్త్రీ అనే అర్థంలో ఆ పదాన్ని వాడి… హౌజులోకి ‘కేరక్టర్’ అనే పిచ్చి, వెకిలి చర్చను తీసుకొచ్చింది…
సోనియా తత్వానికి అలాంటి ధోరణి పడదు, కనిపిస్తూనే ఉంది… విష్ణుప్రియ పదే పదే గుచ్చుతూ ఉంటే ఆమె ఇక ఉండబట్టలేక ఏడ్చేసింది… ఐనాసరే, విష్ణుప్రియ ఇంకా ఏవేవో మాటలు అంటూనే ఉంది… ఒక కంటెస్టెంట్ ఫీలింగ్స్‌ను గాయపరిచాను అనే సోయి కూడా లేదామెకు… పైగా తనను సమర్థించుకునే ప్రయత్నం… వీసమెత్తు హుందాతనం, తెలివి కనిపించని ఈమె హౌజులోకి ఇంకా ఎంత బురదను తీసుకొస్తుందో..!!
నాగార్జున ఏదో తమలపాకుతో సుతారంగా కొట్టినట్టుగా విష్ణుప్రియను ఏదో మండలించానులే అనిపించేసి వదిలేశాడు… ఈ క్లాస్ సరిపోదు ఆమెకు… కానీ బిగ్ బాస్ కు ఇలాంటి దిక్కుమాలిన వివాదాలు, పంచాయతీలే కదా కావల్సింది… అందుకే ఈ పెంట ప్రవాహం…
చెప్పనే లేదు కదా… బేబక్క ఔట్… ఎక్సపెక్టు చేసిందే… ఆమె ఈ హౌస్ కు అస్సలు సూట్ కాదు… అలా మొహంలో మొహం పెట్టి చూడకు, ఇబ్బందిగా ఉంటుంది అని సోనియా అన్నదట, ఈమెకు అది చాలా తప్పుగా అనిపించిందట… తిక్క కేస్… వంటలక్క పోయింది కదా, ఇప్పుడు ఎవర్ చెఫ్..?
Share this Article