.
తెలంగాణను బలంగా వ్యతిరేకించిన వైఎస్ బతికి ఉన్నా సరే రాష్ట్ర విభజన జరిగేది… 2009లోనే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది…
… ఇదీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తాజా వ్యాఖ్య… విజయవాడలో జరిగిన ఏదో ఆత్మీయ సమావేశంలో చెప్పాడట నిన్న…
Ads
అప్పట్లో ఈ నాయకుడు కాంగ్రెస్ పార్టీ విప్… సో, తెలంగాణ ఏర్పాటుకు అనుకూలం అని ఓ తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా వైఎస్ ఈయన్ని అడిగితే… వ్యతిరేకించి, ఇలా అయితే ఎన్నికల్లో ఓడిపోతామని చెప్పాడట…
హైకమాండ్ నిర్ణయం అది, నేనేమీ చేయలేను, డౌటుంటే ప్రణబ్ ముఖర్జీని అడుగు అన్నాడట వైఎస్… దాంతో ఈయన ప్లస్ ఇంకొందరు తెలంగాణ వ్యతిరేకులు వెళ్లి ప్రణబ్ ముఖర్జీని ఒప్పించి, తెలంగాణకు మేం వ్యతిరేకం కాదు అని మార్పించారట…
ఆయన చెబితే ఇప్పుడు రెండు రాష్ట్రాలు నమ్మాలట… జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్ని ఏ చిన్న సమస్య తలెత్తకుండా సాఫీగా… జస్ట్, వేర్వేరు పరిపాలన యూనిట్లుగా విభజించింది అప్పట్లో బీజేపీ ప్రభుత్వం… కానీ తెలంగాణ విషయంలోనే పెంట పెంట చేసింది ఇదుగో ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి నేతలే…
తెలంగాణ ఏర్పడితే ఉగ్రవాదులు పెట్రేగుతారు… రక్షణ రీత్యా ఈ ప్రాంతం కీలకం… కానీ నక్సలైట్లు బలపడతారు… దేశానికే ప్రమాదం… పైగా తెలంగాణ ఏమీ బాగుపడదు… చీకట్లోకి వెళ్లిపోతుంది… వీళ్లకు తెలివిలేదు, పాలన చేతకాదు, హైదరాబాద్‌ను ఎలా వదులుకుంటాం… వంటి అనేకానేక కుంటిసాకులు చెబుతూ…
చివరి బంతి వరకు చూడండి, అడ్డుకుంటాను తెలంగాణను అని సవాల్ చేసి, అడుగడుగునా విద్వేషాన్ని పెంచి… సమైక్యాంధ్ర ఉద్యమంలో పెట్రోల్ పోస్తూ,.. ఆంధ్రా – తెలంగాణ జనం నడుమ మంటలు పెట్టిందీ ఈయన ప్లస్ తనలాంటి నేతలే… ఎలాగూ హైకమాండ్ తెలంగాణ ఇస్తుందనీ, వైఎస్ బతికి ఉన్నా ఆగేది కాదు అనుకున్నప్పుడు మరి ఎందుకు అడ్డుపడినట్టు..?
ఓ విఫల నేత… నేను రెడ్డిని, రాయలసీమ రెడ్డిని, జగన్‌ను కంట్రోల్ చేయగలిగేది నేనే అని నానారకాల తప్పుడు రిపోర్టులు ఇప్పించుకుని… రోశయ్యను బయటికి నెట్టేసి, కుర్చీ ఎక్కాడు… ఏం సాధించాడు.,.? జీరో…! అసలు తను ఓ ప్రజానాయకుడు అయితే కదా… ఓ సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి… పోనీ, విధేయంగా ఏమైనా ఉన్నాడా..?
చెప్పుల పార్టీ ఒకటి పెట్టి… సర్వభ్రష్టుడయ్యాడు… మొహం చెల్లలేదు, ఇల్లు కదల్లేదు… ఇప్పుడు కేసీయార్ ఫామ్ హౌజు వీడనట్టుగానే తను కూడా అసలు తెర మీదకే రాలేదు… జనంలో ఉన్నాడా, లేడు… అదే నిజాం క్లబ్, అదే ఇల్లు…
బీజేపీకి వేరెవరూ దిక్కు లేనట్టు… ఒక్క సమర్థ నాయకుడిని తయారు చేసుకోలేని అసమర్థతతో ఈయన్ని కూడా తెచ్చుకుంది… ఐనా జనంలోకి వచ్చాడా…? నిల్…! స్థూలంగా ఓ విఫల నాయకుడు… తను విరిగిపడ్డాడా, నిలబడ్డాడా అనవసరం… రెండు తెలుగు రాష్ట్రాల నడుమ విద్వేషపు చిచ్చు రగిల్చిన పాపంలో తనదీ ప్రధాన పాత్రే… స్టిల్, ఈరోజుకూ తెలంగాణలోనే బతుకుతూ, అదే తెలంగాణ వ్యతిరేకత… అది బీజేపీ దౌర్భాగ్యం..!!
Share this Article