.
యుజువేంద్ర చాహల్… ప్రస్తుతం పంజాబ్ టీమ్‌కు ఆడుతున్న ఈ హర్యానీ క్రికెటర్ నిన్నటి ఐపీఎల్ మ్యాచులో ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీశాడు… అందులో ఓ హ్యాట్రిక్… చాలా అరుదైన ఫీట్… ఇది తనకు రెండోసారి… అది సాధించింది తనొక్కడే…
వికెట్లు సాధించే ప్రతిభ ఉన్నా సరే, రికార్డు ఉన్నా సరే ఇండియన్ టీమ్‌కు సంబంధించి తన కెరీర్ పడుతూ లేస్తూ నడుస్తున్నట్టుంది… ఈ వివరాలు చూస్తుంటే సడెన్‌గా గుర్తొచ్చింది… తన మీదే కదా రెండేళ్లుగా మీడియా అనేకానేక వార్తలు, గాసిప్స్ రాసింది…
Ads
భార్యతో విడాకుల గొడవ, కేసులు ఎట్సెట్రా తనను డిస్టర్బ్ చేయకుండా, తన ఆట తీరును ప్రభావితం చేయకుండా కన్సిస్టెన్సీ మెయింటెయిన్ చేయడం విశేషమే… ఐతే అసలు భార్యతో ఏమిటా గొడవ..? 60 కోట్లు ఇచ్చి ఆమెను వదిలించుకున్నాడంటూ కొన్ని వార్తలు కనిపించాయి…
ఆమె పేరు ధనశ్రీ వర్మ… వృత్తిరీత్యా డాన్స్ కొరియోగ్రాఫర్, ట్రెయినర్, డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్… సోషల్ మీడియాలో ఆమె డాన్స్ బిట్ చూసి అప్రోచయ్యాడు చాహల్… కరోనాకు ముందు… మెల్లిగా పరిచయం పెరిగి, ప్రణయం దాకా వచ్చింది… 2020 ఆగస్టులో నిశ్చితార్థం, డిసెంబరులో వివాహం కూడా జరిగిపోయాయి…
కొన్నాళ్లకే కీచులాటలు… దూరం పెరుగుతోంది… మామూలుగా సెలబ్రిటీలు తమ బయోలో స్పౌజ్ పేరు, ఫోటో కట్ చేస్తే ఇక బాండ్ ఖతం అయిపోయినట్టేనని ఇండికేషన్ కదా… ఇక్కడా అదే జరిగింది… దాదాపు ఒకటీన్నర రెండేళ్లుగా విడివిడిగానే ఉంటున్నారు… కేసులు దేనికి అనుకుని పరస్పర సమ్మతితో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు…
ఆ దశలోనే బోలెడు వార్తలు… నిజానికి 60 కోట్లు భరణం అనేది కాదు ముఖ్యం… పరస్పర సమ్మతితో ఇద్దరూ కలిసి అప్లయ్ చేసినా సరే… ఫ్యామిలీ కోర్టు మొదట కౌన్సిలింగ్ సెషన్ ఆదేశించింది… జరిగింది, తరువాత మరింత గట్టిగా తమకు విడాకులు కావాలని కోరారు వాళ్లు,.. అదేమిటయ్యా అంటే..? మాకు శృతి కలవడం లేదు అన్నారు… ఆల్రెడీ 18 నెలల నుంచీ మేం విడిగానే ఉంటున్నాం అని చెప్పారు…
కానీ కూలింగ్ పీరియడ్ ఉంటుంది కదా… ఆరు నెలలో ఏడాదో… చాహల్ హైకోర్టుకు వెళ్లాడు… నేను ప్రొఫెషనల్ క్రికెటర్‌ను, ఐపీఎల్ ఆడాల్సి ఉంది, కమిటెడ్ అగ్రిమెంట్లున్నాయి అన్నాడు… హైకోర్టు ఫ్యామిలీ కోర్టుకు కూలింగ్ సెషన్ నుంచి మినహాయింపు ఇవ్వమని చెప్పింది… దాంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది… భరణం 4.75 కోట్లు…
ఈ సీజన్‌కే 18 కోట్లు తీసుకుంటున్న చాహల్‌కు ఆ డబ్బు పెద్ద సమస్య కాదు… కాకపోతే మీడియా వార్తలు ఏకంగా 100 కోట్ల దాకా భరణం అని రాసిపారేశాయి… గత మార్చిలోనే విడాకులు అయిపోయాయి… ఇక ప్రస్తుతం మెదడుపై ఈ సమస్యల ఒత్తిడి అంతా దూరమైపోయి, ప్రశాంతంగా తన ఆట మీద కాన్సంట్రేట్ చేశాడు… ఇదీ జరిగింది…
Share this Article