Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చైనా విలవిల… చివరకు ప్రాణావసర మందులకూ ఇండియాయే దిక్కు…

December 30, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి …….. చైనాకి అవసరం అయితే భారత్ జెనెరిక్ ఔషధాలని సప్లై చేస్తుంది – భారత ప్రధాని నరేంద్ర మోడీ ! ఆయన చైనాకి ఇలాంటి ఆఫర్ ఇవ్వడం వెనుక కారణం ఉంది ! ప్రస్తుతం చైనాలో విజృంభిస్తున్న వొమిక్రాన్ BF-7 వల్ల హాస్పిటల్స్ లో బెడ్లు లేక కిందనే పడుకోబెడుతున్నారు కోవిడ్ పేషంట్లని… ప్రతి రోజూ హీనపక్షంగా 10 లక్షల కేసులు నమోదు అవుతున్నాయి చైనాలో ! మార్చి నెల 2023 నాటికి మొత్తం 30 కోట్ల మంది చైనా ప్రజలు కోవిడ్ బారిన పడవచ్చు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఒక అంచనాకి వచ్చి వివరాలు బయటపెట్టింది. ఈ మారణ హోమం ఇప్పట్లో ఆగేలా లేదు. మరో వైపు కోవిడ్ నిబంధనలని పూర్తిగా తీసేసి, ఉండేవాళ్ళు ఉండండి పోయే వాళ్ళు చనిపోండి అన్న చందాన ప్రజలని వదిలేసింది చైనా ప్రభుత్వం !

*********************************************************

చైనా తమకి అవసరం అయిన మందులని తానే తయారుచేసుకుంటుంది. కానీ చాల కొద్ది మొత్తంలో భారత్ తో పాటు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. కానీ కోవిడ్ తీవ్రంగా ఉండడంతో ఇతర రంగాలతో పాటు ఫార్మా రంగం ఉత్పత్తి సామర్ధ్యం తగ్గింది. దాంతో మందుల కొరత ఏర్పడింది. చైనా ప్రజలు ప్రస్తుతం చైనా తయారీ మందులని నమ్మడం లేదు. బ్రాండ్ పేరుతో అమ్ముతున్న మందులు పనిచేయడం లేదని జెనరిక్ మందుల వైపు మళ్ళుతున్నారు. దాంతో జెనెరిక్ మందుల డిమాండ్ పెరిగిపోవడంతో అవి దొరకడం లేదు. సాధారణంగా ఏ దేశంలో అయినా జెనెరిక్ ఔషధాల ఉత్పత్తి ఇతర బ్రాండ్ మందుల కంటే తక్కువగా ఉంటుంది. చైనాలో కూడా ఇదే పరిస్థితి కానీ డిమాండ్ బాగా ఉండడంతో అవి దొరకడం లేదు.

Ads

***************************************************

చైనా ప్రజలు ప్రస్తుతం భారత్ లో తయారయ్యే జెనెరిక్ మందుల వైపు మొగ్గు చూపుతున్నారు. అదీ దొంగతనంగా స్మగ్లింగ్ అవుతున్న భారతీయ జెనెరిక్ మందులని కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు… అయితే భారత్ నుండి స్మగ్లింగ్ అయ్యే మందుల మొత్తం చాలా తక్కువ, అది చట్టబద్ధం కాదు, దొరికితే మరణశిక్ష విధిస్తారు. చైనా ఈ సంవత్సరం రెండు మందులని కోవిడ్ కోసం వాడవచ్చు అంటూ అనుమతులు ఇచ్చింది. అవి ఫైజర్ కి చెందిన ప్యాక్స్లో విడ్ [ Pfizer’s Paxlovid] మరియు అజ్వుడైన్ [ Azvudine] లు. ఈ రెండూ చైనాలోనే తయారవుతున్నాయి. కానీ అతి కొద్ది హాస్పిటల్స్ లోనే లభ్యమవుతున్నాయి. విశేషం ఏమిటంటే అజ్వుడైన్ [ Azvudine] అనే మందు HIV పాజిటివ్ కేసులకి వాడతారు కానీ కోవిడ్ కూడా పనిచేస్తున్నది అని తెలిసింది. హాంకాంగ్ కి చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ చెప్తున్న దాని ప్రకారం యాంటీ కోవిడ్ ఇండియన్ జెనెరిక్ డ్రగ్స్ [anti-Covid Indian generic drugs sold at 1,000 yuan (US$144) per box] ఒక బాక్స్ కి వెయ్యి యువాన్లు అంటే $ 144 డాలర్లు పెట్టి బ్లాక్ లో కొంటున్నారు.

*************************************

చైనాలో గూగుల్ ఉండదు. దాని స్థానంలో ఉండే వీబో [Weibo] లో ఈ వార్త ట్రెండింగ్ లో ఉంది. అలాగే చైనాకి చెందిన సోషల్ మీడియాలో కూడా భారత మందుల లభ్యత గురించి, వాటి పని తీరు గురించి ట్రెండింగ్ లో ఉంది. బ్లాక్ మార్కెట్ లో ఎక్కడ దొరుకుతున్నాయో చెప్పడం లేదు. కానీ కొన్ని ఫోన్ నంబర్లు ఇచ్చి చైనాలో తయారయ్యే కోవిడ్ మందుల కోసం సంప్రదించండి అని చెప్తున్నారు. కానీ తీరా ఫోన్ చేస్తే మీకు ఇండియన్ మందులు కావాలంటే ధర ఇంత అని చెప్పి, నేరుగా మేమే వచ్చి ఇస్తాము, డబ్బులు కాష్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది అనే సమాధానం వస్తున్నది. చైనా అధికారులు వీబో మీద సెన్సార్ విధించారు. ఇలాంటి వార్తలని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు కానీ రోజూ ఎవరో ఒకరు ఇలాంటి వార్తలని ట్రెండ్ చేస్తూనే ఉన్నారు.

********************************************

ప్రస్తుతం చైనాలో ఇల్లీగల్ గా అమ్ముతున్న భారతీయ మందులు ఇవి- Primovir, Paxista, Molnunat and Molnatris. ఇవి బ్లాక్ మార్కెట్ లో దొరుకుతున్నాయి. ప్రజలు ఎగబడి కొంటున్నారు. భారతీయ జెనెరిక్ ఔషధాలకి చైనాలో అనుమతి లేదు. వీటిని అక్కడ అమ్మితే తీవ్రమయిన నేరంగా పరిగణిస్తారు. అమ్మిన వాళ్ళకి జైలు శిక్ష విధిస్తారు. స్మగ్లింగ్ చేసిన వాళ్ళకి ఏకంగా మరణ శిక్ష విధిస్తారు.

*******************************************

రెండు విభిన్నమయిన వార్తలు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వివరించింది. మొదటిది చైనా ప్రభుత్వం ఆరోగ్య శాఖ డాక్టర్ల చేత భారతీయ మందులు కొనవద్దు అవి హానికరం అంటూ ప్రకటనలు ఇప్పిస్తున్నది. రెండవది చైనా నుండి భారత్ ఫార్మా సంస్థలకి కొన్ని మందులు దిగుమతి కోసం కోటేషన్లు కావాలని అడుగుతున్నాయి అధికారికంగా ! అంటే చైనా ప్రభుత్వ పాలసీ ఏమిటో ఎవరికీ తెలియదు అన్నమాట. ఒకవైపు భారతీయ మందులు బ్లాకులో కొని వాడవద్దు అవి హాని చేస్తాయి అని ప్రచారం చేయిస్తూ, మరో వైపు అధికారికంగా భారత ఫార్మా సంస్థలని కొటేషన్లు అడగడం వెనుక అర్ధం ఏమిటి ?

అర్ధం చాలా సింపుల్. ఒకవైపు భారతీయ బ్రాండ్ మందులు కొనవద్దని చెపుతూ మరో వైపు భారత్ నుండి అవే మందులు దిగుమతి చేసుకోవాలనే వ్యూహం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. భారత దేశపు మందులు బాగా పనిచేస్తాయని ప్రజలు ఇప్పటికే విశ్వసించడం మొదలుపెట్టారు తమ దేశపు మందుల కంటే ! ఇది భవిష్యత్తులో చైనా మందులు అమ్ముడుపోయే అవకాశాలని దెబ్బ తీస్తుంది. మరోవైపు భారత్ నుండి మందులు దిగుమతి చేసుకొని వాటి మీద చైనా బ్రాండ్ ముద్రించి అమ్మడానికి ఇదంతా చేస్తున్నది చైనా.

తమ బ్రాండ్ మందులు ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నది చైనా కానీ ఇప్పుడు భారతీయ మందులు చైనా మందులకంటే బాగా పనిచేస్తాయి అనే ముద్ర పడితే ముందు ముందు విదేశాల నుండి ఆర్డర్లు రావు. 2018 లో మన దేశం నుండి మందులు దిగుమతి చేసుకొని వాటి స్థానంలో నకిలీ మందులు ఉంచి, అవి ఆఫ్రికా దేశాలకి సప్లై చేసింది చైనా. ఈ విషయం అప్పట్లో బయటపడ్డా పొరపాటున అలా జరిగింది అంటూ సంజాయిషీ ఇచ్చింది చైనా ప్రభుత్వం ! ఇప్పుడు కూడా భారత్ నుండి దిగుమతి చేసుకొని వాటి మీద తమ బ్రాండ్ లు ప్రింట్ చేసి అమ్మకానికి పెడుతుంది.

************************************************

చైనా దిగుమతి దారుల నుండి ఈబుప్రోఫెన్ మరియు పారాసిట్మాల్ [ibuprofen and paracetamol] మందుల కోసం కొటేషన్లు అడిగినట్లు ఛైర్మన్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎక్స్పొర్ట్ ప్రోమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సాహిల్ ముంజాల్ [Sahil Munjal, chairman of the Pharmaceuticals Export Promotion Council of India (Pharmexcil)] రాయిటర్ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు. జ్వరానికి వాడే అన్ని రకాల మందుల ఉత్పత్తిని పెంచి, వాటిని చైనాకి ఎగుమతి చేయడానికి ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టినట్లు సాహిల్ ముంజాల్ తెలిపారు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హిందుత్వ ప్రసంగాలు… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కేసు…
  • ‘మెగా దాడి’… రచ్చ… ఆఖరికి లెంపలేసుకున్న దిల్ రాజు సోదరుడు..!!
  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions