గుర్తుందా..? చంద్రయాన్-2 విఫలమైన సందర్భం… ప్రధాని ఎదుట ఇస్రో చైర్మన్ శివన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు… ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సక్సెస్ చేయలేకపోయామనే ఆవేదన అది… ప్రధాని తనను కౌగిలించుకుని దేశమంతా మీ వెంటే ఉందంటూ ఊరడించడం అందరూ టీవీల్లో చూసేసిన సీనే… తనకు వ్యక్తిగతంగా వచ్చే ఫాయిదా గురించి కాదు, దేశ ప్రతిష్ట, సాంకేతికత, ఖగోళ పరిశోధనల కోణంలో తన బాధ…
దాన్ని దేశప్రజలు, ప్రత్యేకించి విద్యావంతులైన యువత సరిగ్గా అర్థం చేసుకుంది… శివన్‌కు మద్దతుగా నెట్ హోరెత్తిపోయింది… ప్రయోగాలు సాగుతూనే ఉంటాయి… సక్సెస్ అందుకునేదాకా… కానీ సంకల్పం గట్టిగా అర్థం చేసుకుంది… తను విమానాల్లో వెళ్తున్నప్పుడు, మీటింగుల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అభినందనల్లో ముంచెత్తింది దేశం… ఇప్పుడు చంద్రయాన్-3 సక్సెస్, ఆదిత్య సక్సెస్… ఇస్రో ఖ్యాతి ఖగోళంలో తళుకులీనింది…
ప్రస్తుత చైర్మన్ సోమనాథ్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది… అర్హుడే… అయితే అవి ఒక్క సోమనాథ్ మీద కురిసే జల్లులు కావు… మన సైంటిస్టులందరికీ వర్తించే పొగడ్తలే… మొన్న ఏదో విమానంలో సోమనాథ్ కనిపించగానే సదరు విమానయాన సంస్థ ప్రత్యేక అభినందనలతో ఆదరంగా హత్తుకుంది… ఆ వార్తలూ చదివాం… అయితే…
Ads
ఎప్పుడైతే రాజకీయాలు ప్రవేశించాయో… యాంటీ మోడీ సెక్షన్లు ఈ విజయాలు బీజేపీకి, మోడీకి ఉపయోగపడుతున్నాయని భావించబడ్డాయో కథ దారి మళ్లింది… ఒకడు ఇస్రో సైంటిస్టులకు జీతాల్లేవని కూస్తాడు… అనేక అంశాలపై అవగాహన ఉందని చెప్పబడే ఆయన మెదడు ఎందుకు పనిచేయలేదు..? ఎందుకంటే… యాంటీ మోడీ నేచర్ ఆలోచించనివ్వదు సరిగా… మోడీని నిజంగా తిట్టాల్సిన చోట గొంతెత్తాలి, తనేమీ అతీతుడు కాదు… కానీ దేశ జెండా సగర్వంగా రెపరెపలాడే సందర్భాల్ని, మనవాళ్ల విజయాల్ని కూడా కించపరచాలా..?
ఇస్రో అనేక విడిభాగాలను అనేక సంస్థల నుంచి సమకూర్చుకుంటుంది… ఔట్ సోర్సింగ్‌కు ఇస్తుంది… లాంచింగ్ పాడ్ నిర్మాణం చేసిన సంస్థలో కొన్ని నెలలుగా జీతాల్లేవట… ఇంకేం… దానికీ చంద్రయాన్-3కూ ముడిపెట్టేశారు… తనకు ‘సప్లయ్స్’ చేసే ప్రతి ఔట్ సోర్సింగ్ సంస్థ బాగోగాలు కూడా ఇస్రో బాధ్యతేనా..? మరి అక్కడి వర్కర్స్, స్టాఫ్ జీతాల సంగతి ఇన్ని నెలలుగా ఎందుకు పట్టలేదు..? చంద్రయాన్ విజయం వేళనే ఎందుకు గుర్తొచ్చినట్టు..?
ఈ నేపథ్యంలో ఒక వార్త భలే ఆకర్షించింది… చంద్రయాన్ విజయం తరువాత విలేకరుల సమావేశంలో ఓ విలేకరి మంచి ప్రశ్న వేశాడు… దానికి దీటైన సమాధానం కూడా వచ్చింది… మీకు జీతాలు తక్కువట కదానేది ప్రశ్న… ఐనా ఎలా ఇంత ఉత్సాహంగా పనిచేస్తున్నారు అనే ప్రశ్న… ఓ శర్మ గారు ‘సాయంత్రం వేళ మంచి మసాలా దోశ, స్ట్రాంగ్ కాఫీ ఇస్తారు, పనిచేయాలనే ఉత్సాహం ఎందుకు రాదు..? ’ అని బదులిచ్చాడు కాస్త సరదాగా… ఈ సమాధానానికి ఎన్ని బాష్యాలైనా చెప్పుకోవచ్చు…
నాగేశ్వర్ వంటి శుష్క మేధావులకు ఓ వ్యంగ్య సమాధానంగా కూడాా భావించొచ్చు… నిజమే, ఒక ఐటీ ఉద్యోగి విదేశాల్లో పనిచేస్తే వచ్చే సంపాదనతో పోలిస్తే మన దేశంలో దక్కేది ఎంత..? ఇవీ అంతే… నాసా జీతాలతో ఇస్రో జీతాలను పోల్చలేం కదా… రెండు రోజులుగా ఇస్రో సైంటిస్టులు, ఇతర స్టాఫ్ జీతాల మీద బోలెడు వార్తలు జాతీయ మీడియాలో కనిపించాయి… బాగా కన్నీళ్లు కురిపించాయి… మరి ఈ శోకాలు ఇన్నినెలలుగా ఎందుకు లేవు..? చంద్రయాన్ సందర్భమే కరెక్టు ఎలా అవుతుంది..? ఐనా వేరే ప్రభుత్వ రంగసంస్థల ఉద్యోగులకన్నా ఇస్రో జీతాలు తక్కువేమీ లేవు కదా…
ఐటీ, మార్కెటింగ్ ఉద్యోగాలను వదిలేస్తే… కోట్ల మంది ఉద్యోగులకు దక్కే సగటు జీతాలు ఎంత..? ఇస్రో జీతాల మీదే ఏమిటీ ఆందోళన… ఐనా ఇస్రో ఇప్పుడు ఓ పర్‌ఫెక్ట్ వాణిజ్య సంస్థ కూడా… దేశవిదేశాలకు చెందిన ఉపగ్రహాలను చౌకగా ప్రయోగిస్తూ మంచి సంపాదన సాధిస్తోంది… ఐనా సరే, చంద్రయాన్, శుక్రయాన్, ఆదిత్య, గగనయాన్ వంటి ప్రాజెక్టులకు ప్రత్యేకంగా నిధుల్ని ఇస్తూనే ఉంది కేంద్రం… పైగా బడ్జెట్ కేటాయింపుల మేరకు ఇవ్వడం లేదని మరో విమర్శ… అసలు ఇండియా వంటి పేద దేశాలకు ఈ వ్యయభరిత ప్రయోగాలు అవసరమా అనే సందేహాలు, ప్రశ్నలు సరేసరి… వాటికి సమాధానాలు ఇవ్వడంకన్నా ఓ నవ్వుతో కూడిన నిట్టూర్పు విడవడం బెటర్… వాళ్లూ నాగేశ్వర్‌లే కదా…!!
Share this Article