ఒక తెలుగు సినిమా పాట… ఓ పాత అగ్ర హీరో… బెల్ బాటమ్ పాంటు, బ్లేజర్, షూస్, టోపీ ధరించి ఎగురుతున్నాడు… వాటిని స్టెప్పులు అంటారు… పక్కనే జయప్రదో, శ్రీదేవో ఫాఫం, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఎగురుతోంది… సగం సగం బట్టలు… మంచుకొండల్లో హీరోకు కార్గిల్ దుస్తులు… హీరోయిన్ వంపుసొంపులు కనిపించాలి కాబట్టి అరకొర దుస్తులు…
అంతేనా..? ఒకే పాటలో నాలుగైదుసార్లు హీరో గారి కాస్ట్యూమ్స్ ఛేంజ్… అదేమంటే ఫ్యాన్స్ రకరకాల డ్రెస్సుల్ని ఇష్టపడతారుట… హీరోయిన్ కాస్ట్యూమ్స్ కూడా మారతాయి… కానీ ఆ కరువు డ్రెస్సులు యథాతథం… నిజానికి ఈ పైత్యానికి సౌత్ సినిమాలు, నార్త్ సినిమాలు అనే తేడా లేదు… హీరో అంటే కళ్లద్దాలు, టోపీ, బెల్టు, షూట్, బూట్లు… ఒక పాటలో ఎన్నిసార్లు డ్రెస్సులు మారిస్తే అంత సూపర్ డైరెక్షన్… మరీ ఇప్పుడు పాత సినిమాలు చూస్తుంటే నవ్వొచ్చే పాటలు- బట్టల తంతు ఇది…
ఇదంతా ఉపోద్ఘాతం దేనికీ అంటే..? మీకు మూడు చిన్న చిన్న వీడియోలు చూపిస్తాను… భయపడకండి, చాలా చిన్న బిట్లు… మీకొక సరదా పరీక్ష… ఆ మూడు వీడియోలు చూశాక మీరు గమనించింది ఏమిటి..? మీకు నవ్వొచ్చిన అంశం ఏమిటి..? ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటి..? జస్ట్, రిలాక్స్… తెల్లారిలేస్తే ఈ భీకర నెగెటివ్ వార్తల నడుమ ఓ పెద్ద రిలీఫ్… సరేనా..? ఇవిగో వీడియోలు… జస్ట్, ఒక్కొక్కటి అరనిమిషం మాత్రమే…
Ads
చూశారు కదా… ఏమనిపించింది..? ఎహె, వీటిల్లో ఏముంది..? మూడు డ్యూయెట్లు… ట్యూన్లు కూడా వేర్వేరు… సాహిత్యం వేర్వేరు… హీరోయిన్లు వేర్వేరు… సినిమాలు వేర్వేరు… వాటి షూటింగుల కాలం వేర్వేరు… ఆ లొకేషన్లు వేర్వేరు… కాకపోతే మూడింటిలోనూ హీరో ధర్మేంద్ర… అంతేకదా… ఓసోస్, ఇందులో పెద్ద విశేషం ఏముంది అంటారా..?
వెయిట్, వెయిట్… మళ్లీ ఒకసారి చూడండి… అసలు ఇండియన్ సినిమా సాంగ్ అంటేనే హీరో బట్టల మార్పిడి పథకం… రకరకాల డిజైన్లతో ప్యాంట్లు, షర్టులు మారుతూ ఉండాలి… కలర్స్ మారాలి… సినిమా సూత్రం అయితే అంతే కదా… కానీ ఇందులో అదే హీరో… ఒకే షర్ట్… ఒకే ప్యాంటు… నమ్మడం లేదా..? మీరే చూడండి…
నిజంగా ఈ మూడు గమనించి కనిపెట్టి ఒక్కచోటకు చేర్చిన వాడిని మెచ్చుకోవాలి… అసలు ఒక పాటలోనే బోలెడు డ్రెస్సులు మార్చే కల్చర్‌లో మూడు వేర్వేరు సినిమాలు, మూడు వేర్వేరు సాంగ్స్, మూడు వేర్వేరు లొకేషన్స్, ముగ్గురు వేర్వేరు హీరోయిన్లు… ఐనా సరే, ఒక ప్యాంటు, ఒకే బెల్టు, ఒకే షర్ట్… ప్చ్, మూడు సినిమాలకు ఒకడే కాస్ట్యూమ్ డిజైనర్‌ను పెట్టుకుని ఉంటారేమో… ఈ డ్రెస్సు భలే కుదిరింది కదాని ఇక ప్రతి పాటకూ అదే తొడిగినట్టున్నాడు… అబ్బే, మరీ అంత కాజువల్ కారణం అయి ఉంటుందా అని విసుక్కోకండి… పోనీ, మీరు చెప్పండి… ఏం జరిగి ఉంటుందో…!!
Share this Article