గెహనా సిప్పీ… మొదట్లో మోడల్… ముంబై పిల్ల… వయస్సు జస్ట్, 22… చోర్ బజార్ అనే సినిమా కోసం మనవాళ్లే పట్టుకొచ్చారు… నిజం చెప్పాలంటే అందంగా ఉంది… కష్టపడాలే గానీ మంచి కెరీర్ కూడా ఉంది… గాలోడు సినిమా చూస్తే ఆమె ఒక్కతే కాస్త నటించింది అనేట్టుగా ఉంది… సినిమా షకలక శంకర్ సినిమా, సప్తగిరి సినిమా అన్నట్టుగా ఉంది…
నిజానికి గెహనాకు సినిమాల్లో చాన్సులు లేకపోయినా పర్లేదు… జబర్దస్త్ జడ్జిగా లేదా శ్రీదేవి డ్రామా కంపెనీ హోస్టుగా రాణించగలదు… ఆల్‌రెడీ గాలోడు అనే సినిమాలో నటించింది కాబట్టి బేసిక్ అనుభవం వచ్చేసినట్టే… వయస్సు మీద పడిన రష్మితో పోలిస్తే చాలా బెటర్… కొత్తగా వచ్చిన సౌమ్యారావుకన్నా బెటర్…
వయస్సు మీదపడిన ఆంటీకన్నా చాలా బెటర్… అరె, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి మాట్లాడతావేమిటి అంటారా..? గాలోడు సినిమా అలాాగే ఉంది… అవేవో దిక్కుమాలిన స్కిట్లలో బిల్డప్ బాబాయ్ అనే పాత్ర ఉంటుంది తెలుసు కదా… ఈ గాలోడు కూడా అంతే… అరె, పెద్ద పెద్ద స్టార్ల బిల్డప్పు వేషాలనే జనం ఈడ్చి తంతున్నారు… థియేటర్లలో, ఓటీటీల్లో… మరి ఓ టీవీ కమెడియన్ ఆ బిల్డప్పుల జోలికి ఎందుకు పోయినట్టు..? సుధీర్ ఇంకా ఏలోకంలో ఉన్నవ్ నాయనా…;
Ads
జనం టీవీ నటుల్ని వెండి తెర మీద పెద్దగా ఇష్టపడరు… అందులోనూ కమెడియన్లను హీరోలుగా అస్సలు అంగీకరించరు… ఒకవేళ నిలదొక్కుకోవాలి అనుకుంటే కొత్తదనంతో కొట్టాలి… దానికి సాహసం కావాలి… సుధీర్‌కు ఈమాత్రం తెలియదా..? గతంలో త్రీమంకీస్ అని ఓ పనికిమాలిన సినిమా తీశారు… అప్పట్లో కాస్త క్రియేటివ్ పెన్ ఉండే ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, సుధీర్ కలిసి చేశారు… చెత్తన్నర సినిమా…
అంతెందుకు సాఫ్ట్‌వేర్ సుధీర్ అని ఇదే సుధీర్‌తో చేశారు… ఇప్పుడు అదే దర్శకుడు… ఆ సినిమా ఎందుకు గాలిలో కలిసిపోయిందో విశ్లేషణ లేదు… సేమ్, బిల్డప్పులు… ఎవడికి కావాలి సుధీర్ నీ బిల్డప్పులు..? రజినీ, సూర్య, కార్తి, బన్నీ, మోహన్‌లాల్ వంటి వందల సినిమాలు తీసిన స్టార్లే బిల్డప్పులు జోలికి పోవడానికి భయపడిపోతున్నారు… కొత్త లుక్కులు, కొత్త పాత్రల కోసం అన్వేషిస్తున్నారు…
పోనీ, సుధీర్ పాత్ర బాగుందా అంటే అదీ లేదు… ఫ్యామిలీ అంటే గౌరవం లేని హీరో ఏ ప్రేక్షకుడికి నచ్చుతాడు…… ఎడాపెడా సుధీర్‌ను ఓ ఎస్టాబ్లిష్డ్ హీరోగా చూపించడానికి నానా పాట్లూ… కథలో కొత్తదనం లేదు, కథనంలో కొత్తదనం లేదు… చివరకు హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా సరిగ్గా లేదు…
నిజంగా గాలోడు అనే టైటిల్ మాత్రం సరిపోయింది… గాలి పోగేసి, ఓ హీరో పాత్ర సృష్టించి, జనం మీదకు వదిలారు… ఈ బిల్డప్పులు మాకెందుకు సుధీర్..? నువ్వు తెలుగు టీవీకి సూపర్ స్టార్… మల్టీ టాలెంటెడ్… సో వాట్, ఈ దిక్కుమాలిన ప్రయోగానికి థియేటర్ దాకా వచ్చి, జేబుల్ని కత్తిరించుకుని, థియేటర్ల వాళ్లకు నిలువుదోపీడీ ఇవ్వాలా..? అసలు సుధీర్ అంటేనే కామెడీ కదా… అదేది ఈ సినిమాలో..? కామెడీ చేయిస్తే ఈ స్టార్ హీరోయిజానికి చిన్నతనం అనుకున్నాడా దర్శకుడు..? యాణ్నుంచి వస్తర్ర భయ్ మీరంతా..?! కానీ ఏమాటకామాట, గెహనా సిప్పీ బాగుంది…!!
Share this Article