.
అర్ధరాత్రి బిగ్‌బాస్ హౌజులో గంగవ్వకు హార్ట్ ఎటాక్ వచ్చింది… అర్జెంటుగా మెడికల్ టీం హౌజులోకి వెళ్లింది… కంటెస్టెంట్లు అందరూ షాక్‌కు గురయ్యారు… తను చేసిన వ్యాఖ్యలతోనే గంగవ్వ మనస్తాపం చెంది గుండెపోటుకు గురైందేమోనని విష్ణుప్రియ మరింత షాక్‌కు గురైంది… అని మొదట్లో వార్తలు…
తరువాత కాసేపటికి… నో, నో… ఆమె ప్రాంక్ చేసింది అని కొందరు… అబ్బే, బిగ్‌బాసోడే టాస్క్ ఇచ్చి చేయమన్నాడు అని మరికొందరు… అబ్బబ్బ, గంగవ్వ యాక్టింగ్ ఇరగదీసిందని ఇంకొందరు రకరకాలుగా రాసుకొచ్చారు… కొందరు అర్జెంటుగా వీడియోలు చేసేసి యూట్యూబులో పెట్టేశారు… అసలే గంగవ్వకు పాపులారిటీ ఎక్కువ…
Ads
పైగా గతంలో అనారోగ్యం కారణంతోనే అర్థంతరంగా బయటికొచ్చింది… ఇప్పటికీ ఏజ్ ఎక్కువ… గేమ్స్, టాస్కులు, పరుగులు గట్రా ఆమె వల్ల కావు… సో, నిజంగానే గుండెపోటు వచ్చిందేమో అనే వార్తలకు ప్రయారిటీ వచ్చింది… ఆందోళన కూడా వ్యక్తమైంది.,. నిజంగా బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కా..? లేక ఆమే ప్రాంక్ చేసిందా తెలియదు మొదట్లో ఎవరికీ…
కొందరు యూట్యూబర్లు లైవ్ ప్రసారం నుంచి ఆ బిట్ గ్రాబ్ చేసి వీడియోలు చేశారు… తరువాత బిగ్‌బాసే ఈ ప్రోమో రిలీజ్ చేశాడు… ఇదీ…
అది క్లియర్ కట్‌గా అవినాష్, టేస్టీ తేజ, గంగవ్వ కలిసి చేసిన ఘోస్ట్ ప్రాంక్ అట… అంటే గుండెపోటు కాదు… ఒక దెయ్యం పట్టిన లేడీ ఎలా చేస్తుందో అలా ప్రాంక్ సీన్ క్రియేట్ చేయడం… అదీ ప్లాన్… ఆమెకు ఎలా నటించాలో కూడా టేస్టీ తేజ నేర్పించాడు, ఫీలింగ్స్ ఎలా పెట్టి ఎలా భయపెట్టాలోె…
వాళ్లకు ముందే తెలుసు కాబట్టి… గంగవ్వ యాక్షన్ స్టార్ట్ చేయగానే అవినాష్, టేస్టీ తేజ మాత్రమే దగ్గరుండి ఆమెకు సపర్యలు చేస్తూ, రిలీఫ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు నటించారు… అది గుండెపోటో… మరేమిటో తెలియక గౌతమ్ (ప్రస్తుతం మెగా చీఫ్ కదా)… ఆమె చేతులు రాస్తూ కనిపించాడు… లేడీ కంటెస్టెంట్లు ఠారెత్తిపోయారు నిజంగానే… సహజం…
ఒక లేడీ కంటెస్టెంట్ బిగ్‌బాస్ కెమెరాను ఉద్దేశించి అర్జెంట్ ప్లీజ్ అని చెబుతోంది… తరువాత నిజంగానే ఇది ప్రాంకేమో అనే డౌటనుమానం కంటెస్టెంట్లకూ వచ్చింది… పృథ్వి, నిఖిల్‌కు బాగా అర్థమైనట్టుంది, ఇంత జరుగుతూ ఉంటే గుర్రుపెట్టి నిద్రపోయారు… గంగవ్వను ఒక రూపాయి యాక్షన్ చేయమంటూ ఆమె పదిరూపాయల యాక్షన్ చేయబోయింది… అందుకే కొందరికి డౌట్ వచ్చేసినట్టుంది…
కాకపోతే ఊళ్లల్లో ఎవరికైనా శిగమొస్తే, అంటే పూనకం వస్తే… దెయ్యమో, దేవుడో మనిషి మీదికొస్తే ఎలా చేస్తారో అలా చేయడానికి బాగానే ప్రయత్నించింది… కాకపోతే రాత్రివేళ ఇలా మిగతా కంటెస్టెంట్లను ఠారెత్తించే టాస్క్ బిగ్‌బాస్ వాడు ఇచ్చినా… వాళ్లే కూడబలుక్కుని ప్రాంక్ చేసినా తప్పే… అది హౌజులో అనవసరం భయాందోళనల్ని క్రియేట్ చేస్తుంది… చూడాలిక, ఈ యాక్షన్ గంగవ్వకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో..!!
ఎలాగూ గంగవ్వ గురించే కదా చెప్పుకుంటున్నాం… మరో వార్త ఆమెకు సంబంధించి… ఇదుగో… ‘యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వపై కేసు నమోదు చేసిన అటవీశాఖ అధికారులు… మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్‌లో చిలుకని ఉపయోగించడంపై గంగవ్వ, యూట్యూబర్ రాజుపై కేసు… యూట్యూబ్ వ్యాపార ప్రయోజనాల కోసం చిలుకను హింసించారంటూ ఫిర్యాదు చేసిన జంతు సంరక్షణ కార్యకర్త ఆదులాపురం గౌతమ్…’
Share this Article