Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శివాజీని కార్నర్ చేశాడు… నాగార్జునకు కోపమొచ్చింది… ఫలితం గౌతమ్ ఔట్…

December 2, 2023 by M S R

మొత్తానికి శివాజీని ఏ పక్షపాతం కారణంగా మోస్తున్నాడో గానీ, నాగార్జున దాంతో ఈ సీజన్‌ను పూర్తిగా చెడగొట్టేశాడు… శివాజీ చెప్పినట్టు వినని అమర్, శోభ, ప్రియాంకల మీద తన సోషల్ మీడియా విషాన్ని కక్కుతోంది మొదటి నుంచీ… ఈ సీజన్ పూర్తిగా శివాజీకే అంకితం చేసినట్టుంది ది గ్రేట్ బిగ్‌బాస్ టీం… ఈమాత్రం దానికి ఈ ఆట దేనికి..? ఈ నాటకం దేనికి..? మొదటి వారంలోనే శివాజీని విజేతగా ప్రకటించి, ఓ కిరీటం నెత్తిన పెట్టేస్తే సరిపోయేది కదా… ‌

ఈరోజు ఉదాహరణే తీసుకుందాం… మొదటి నుంచీ గౌతమ్‌ను కూడా శివాజీ టార్గెట్ చేశాడు… అందరి మీదా నోరు పారేసుకున్నట్టే తన మీద కూడా పెత్తనం చెలాయించాలని చూశాడు… తన పాలేర్ల వంటి యావర్, ప్రశాంత్‌లాగా ఈ గౌతమ్ ఉండటం లేదేమిటనే అసహనం శివాజీది… ఈరోజు వీకెండ్ షోలో కూడా శివాజీని కార్నర్ చేశాడు గౌతమ్… దాంతో శివాజీకి సర్రుమంది… శివాజీ బాధపడితే నాగార్జున కూడా బాధపడతాడు కదా… నాగార్జున అంటేనే బిగ్‌‌బాస్ కదా… ఇంకేముంది..? గౌతమ్‌ను ఇంటికి పంపించేశారు…

శివాజీని కార్నర్ చేసినందుకు గాను లోపల శివాజీ, బయట నాగార్జున గౌతమ్ మీద దాదాపు అరగంట కయ్యిమన్నారు… నిజానికి గౌతమ్ బయట వోటింగు సైట్లలో మరీ చివరి స్థానంలో ఏమీ లేడు… ఐతేనేం, బయటికి పోవాల్సి వచ్చింది… ఫినాలె టాస్కులో రన్నరప్ కాబట్టి, ఒకవైపు ఫౌల్ గేమర్ అంటూనే అమర్‌కు కెప్టెన్సీ ఇచ్చిన నాగార్జున… ఫినాలేకు అర్జున్ చేరుకున్నాడు కాబట్టి 14 వ వారం వాడాల్సిన ప్రశాంత్ ఎవిక్షన్ పాస్‌ను ఈ వారమే వాడాల్సి ఉంటుందనే ఓ అర్థం లేని లాజిక్, రీజన్ చెప్పాడు… ఫన్నీ…

Ads

దాంతో ఏం జరిగింది..? యావర్‌ను ప్రశాంత్ కాపాడాడు… యావర్ సేఫ్… శోభాశెట్టిని ఎలాగూ బిగ్‌బాస్ బయటికి పంపించడు… దాంతో గౌతమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు… ఫాఫం…. ఒకవైపు ప్రియాంకను ఇండివిడ్యుయల్ గేమ్ ఆడాలి అంటూ పదే పదే మాట్లాడి… శోభ, అమర్, ప్రియాంక గ్యాంగును విడదీసిన నాగార్జున అదే శివాజీ గ్యాంగు మీద మాత్రం ఈగ వాలనివ్వలేదు… శివాజీ కనుసన్నల్లోనే కదా ప్రశాంత్ తన ఎవిక్షన్ పాస్‌ను యావర్ కోసం వాడింది…

ప్రియాంక చెెప్పినందుకు గౌతమ్ తన పాయింట్లను అమర్‌కు ఇస్తే తప్పేముంది మరి..? శివాజీ చెప్పినందుకు ప్రశాంత్ తన ఎవిక్షన్ పాస్‌ను యావర్ కోసం వాడటం కూడా సేమ్ కదా… ! మరి అక్కడ అది తప్పు అయినప్పుడు ఇక్కడ ఇదీ తప్పే కదా నాగార్జునా..? సరే, ఫినాలేకు పోయాడు కాబట్టి అర్జున్ నామినేషన్ల నుంచి విముక్తి పొందాడు… ప్రశాంత్ పర్లేదు, బాగానే ఆడాడు… కానీ శివాజీ ఆటేముంది…? అసలు తనను కదా బయటికి పంపించాల్సింది… లేదా రెండు వారాలుగా ఏమాత్రం ఆడని యావర్ కదా బయటికి వెళ్లాల్సింది… వాళ్లకన్నా గౌతమ్ ఆట తీసికట్టుగా ఉందా..? సో, బిగ్‌బాస్ గేమంటేనే ఓ ఫౌల్, ఓ ఫార్స్, ఓ ఫేక్…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కన్నెపల్లిపై అదే స్క్రిప్టు – అదే ప్రహసనం — కాకపోతే ఫేస్ మారింది!!
  • కథ బాగుంది… వెరయిటీగా ఉంది… ఆలోచనాత్మకంగా ఉంది…
  • ఏ కెరటం ఏ తీరానికి చేరుతుందో – ఈ మోహిని ఇప్పుడేం చేస్తోందంటే?
  • బాలమురళి పాడేది అసలు సంగీతమే కాదు- హైకోర్టులో ఓ కేసు …
  • ఎగిసిన రంగుల కెరటాలు కొన్ని విరిగిపడటం… స్వయంకృతాలే..!
  • 5 కోట్ల బంగారు రామచరితమానస్ – అయోధ్య గుడిలో మాయం !
  • కన్నెపల్లి పంపులపై కేటీయార్ వితండవాదం – ఇవిగో అసలు నిజాలు…
  • మూడు రాచకుటుంబాల వారసత్వం – ఒక్క వీడియోతో కెరీర్ కకావికలం
  • FIFA 2026 – అనూహ్య ఫలితాలు – అంచనాల్లో తేడాలే అసలు మజా!!
  • I will find you – గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ –

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions