(పార్థసారథి పోట్లూరి)…… ఏదో పెద్ద దానికే స్కెచ్ వేస్తున్నారు! మొదటి సారిగా భారత ప్రభుత్వం జార్జ్ సోరోస్ పేరుని బయట పెట్టింది! స్మృతి ఇరానీ తీవ్ర ఆరోపణలు చేసింది జార్జ్ సోరోస్ పేరుని ఉటంకిస్తూ!
స్మృతి ఇరానీ మాటల్లో: “జార్జ్ సోరొస్ అనే వ్యక్తి ఒక ప్రకటన చేశాడు.. తన ప్రధాన టార్గెట్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అని! జార్జ్ సోరోస్ ఒక సిస్టంను సృష్టిస్తాడుట! అది మన దేశంలో మన దేశ ప్రయోజనాలను కాకుండా విదేశీ ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తుంది. మోడీ తల వంచేలా తన సిస్టం పనిచేస్తుందిట!”
National Interest is Paramount!
*******
ఇంతవరకూ సోషల్ మీడియాలో మాత్రమే జాతీయ భావాలు కలిగిన వారు జార్జ్ సోరోస్ కుట్రలు, కుతంత్రాలు బయట పెడుతూ వచ్చారు. వాటిలో చాలా వరకూ నిజాలే అని తేలాయి!
Ads
కానీ…..
మెయిన్ స్ట్రీమ్ మీడియా అది ప్రింట్ మీడియా కావొచ్చు , ఎలెక్ట్రానిక్ మీడియా కావొచ్చు జార్జ్ సోరోస్ పేరు ఉచ్చరించడానికి భయపడుతున్నాయి.
దశాబ్దాలుగా జార్జ్ సోరోస్ మన దేశ వ్యవహారాలలో తల దూర్చి తన తన ఆలోచనలకి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీని వాడుకుంటున్నారని తెలిసినా మీడియా మౌనం పాటించి ఉంది ఎందుకు?
ఇది మనం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం!
ఆఫ్కొర్స్! జార్జ్ సోరోస్ ను ఒక ఫిలాంత్రోపిస్ట్ గా పొగడడానికి వెనుకాడరు!
*******
మోహువ మోయిత్ర బండారం బయటపడి సభ నుండి బహిష్కరణకి గురయి వెళ్ళిపోయింది కానీ ఆ స్థానంలో సాగరిక ఘోష్ ను నామినేట్ చేసింది మమత! రాజ్యసభకి ఇచ్చిన అఫిడవిట్ లో సాగరిక తన భర్త రాజ్ దీప్ సర్దేశాయ్ నెల జీతం 30 లక్షలుగా పేర్కొంది!
CNN-IBN లో పని చేసినప్పుడు రాజ్ దీప్ సర్దేశాయ్, సాగరిక ఘోష్ జీతాలు గొప్పగా ఏమీ లేవు. CNN-IBN ను అంబానీ టేక్ ఓవర్ చేశాక ఇద్దరూ అందులో నుండి బయటకి వచ్చారు. చాలా కాలం ఇద్దరూ ఖాళీగా ఉన్నారు. తరువాత సర్దేశాయ్ ఇండియా టుడేలో చేరాడు.
కానీ ఇండియా టుడే రాజ్ దీప్ కి నెలకి 30 లక్షలు జీతం ఇచ్చేంత టాలెంట్ ఉందా? రాజ్ దీప్ లేకపోతే ఇండియా టుడే మూత పడుతుందా?
సంవత్సరానికి 3 కోట్ల 60 లక్షల జీతం ఇస్తున్నదా ఇండియా టుడే? సాగరిక అఫిడవిట్ లో మూచువల్ ఫండ్స్, షేర్లు, పెద్ద మొత్తంలో ఇన్స్యూరెన్స్, స్థిర, చర ఆస్థులు ఉన్నట్లు పేర్కొంది. ఖచ్చితమైన సంఖ్య తెలియరాలేదు కానీ తాను ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ గా నెలకి లక్షల్లో సంపాదిస్తున్నట్లుగా పేర్కొంది. ఎవరబ్బా లక్షలు ఇచ్చి ఈవిడ చేత రాయించుకునేది? పొలిటికల్, కార్పొరేట్ సెక్టార్స్ నుండి నిధులు అంది ఉండవచ్చు.
By the order of George Soros! మమత బెనర్జీ స్పష్టంగా ఉంది నాది యాంటీ హిందూ స్టాన్స్ అని. జార్జ్ సోరోస్ కి కావాల్సింది అదే! ఆఫ్కొర్స్! కేజ్రీవాల్, కాంగ్రెస్ మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. జార్జ్ సోరోస్ మధ్య వర్తిత్వం చేశాడు.
అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరింది! జార్జ్ సొరొస్ ఆదేశాల మేరకే!
ఇంత హఠాత్తుగా గద్దర్ సినీ అవార్డ్స్ ప్రకటించడం వెనుక ఎవరున్నారు?
లెఫ్ట్, లిబెరల్స్, అర్బన్ నక్సల్స్, సో కాల్డ్ సంఘా సంస్కర్తలకి ఎవరు నిధులు సమకూరుస్తున్నారు?
********
అసలు విషయానికి వద్దాం! రాహుల్ న్యాయ్ జొడో యాత్రకి విరామం ఇచ్చి లండన్ వెళ్ళాడు. మార్చి 1 న లండన్ నుండి తిరిగి రాగానే యాత్ర మొదలు పెడతాడు.
నకిలీ రైతు ఆందోళన ఢిల్లీ మార్చ్ కూడా ఫిబ్రవరి 29 కి వాయిదా పడింది! అంటే రాహుల్ లండన్లో మంతనాలు జరిపి తిరిగి భారత్ కి రాగానే స్కెచ్ ఏమిటో చెప్తాడు దానిని కేజ్రీవాల్ అమలు చేస్తాడు. ఇప్పటికే ED 6 సార్లు నోటీసులు ఇచ్చింది తమ ఎదుట హాజరు కావాలని, కానీ వాటికి స్పందించలేదు కేజ్రీవాల్.
ఈసారి అరెస్టు చేస్తుంది ED. మరో వైపు పంజాబ్ నుండి నకిలీ రైతులను ఢిల్లీ మీదకి ఉసిగొల్పి ఒప్పందం చేసుకుంటాడు. తనని అరెస్ట్ చేయకపోతే రైతులని వెనుకకి పంపుతాను అని. So! ఒక పెద్ద ప్లాన్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి, అదీ మార్చి మొదటి వారంలో! అమిత్ షాకి పరీక్ష! (రచయిత వ్యక్తిగత అభిప్రాయం)
Share this Article