Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పిల్లలకు దయ్యపు కథలు చెప్పేవాళ్లు చదవాల్సిన ట్రూ స్టోరీ..!!

June 14, 2024 by M S R

(Srinivas Sarla) ….. ఇది కథ కాదు. 2016 లో మా మేనత్త కూతురి నుండి నాకొక ఫోన్ వచ్చింది . ఫోన్ లిఫ్ట్ చేసి హలొ అన్నాను, అటు నుండి ఏడుపు, ఏమైంది సునితక్క ఎందుకు ఏడుస్తున్నావ్ అన్నాను, బిడ్డకు జ్వరం వచ్చింది, ఫీట్స్ వస్తున్నాయ్ రా అని కంగారు పడుతూ చెప్పింది

వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఎడ్యుకేటెడ్ కాదు, తన కడుపులో పాప ఉండగానే భర్త కాలం చేసాడు.. కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం మళ్ళీ పెళ్లి చేసుకోకుండా వాళ్ళ అమ్మ వాళ్ళింట్లోనే ఉంటూ పొలం పనులకు వెళ్లి బిడ్డను చదివించుకునేది.. పాప 5th క్లాస్ అయ్యాక 6th క్లాస్ గురుకుల పాఠశాలలో సీటు వచ్చింది..

ఫోన్ లో ఆమె మాటలు విన్నాక వెంటనే కరీంనగర్ హాస్పిటల్ తీసుకు రమ్మన్నాను.. రెండు గంటల్లో వాళ్ళు కరీంనగర్ వచ్చి కాల్ చేశారు అప్పటికే నేను హాస్పిటల్లో మాట్లాడి పెట్టాను.. పాప చాలా నీరసంగా విపరీతమైన జ్వరంతో బాధ పడుతుంది హాస్పిటల్ వచ్చాక రెండు సార్లు ఫీట్స్ వచ్చాయి

Ads

డాక్టర్లు అన్ని పరీక్షలు చేశారు MRI తో సహా అన్ని రిపోర్టులు నార్మల్.. పాపను ఐసియులో అడ్మిట్ చేసి observation పెట్టారు. మూడు రోజుల్లో గంటకి ఒకసారి ఫీట్స్ వచ్చాయి. మూడు రోజుల తరువాత పాప కళ్ళు ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళింది..

డాక్టర్ పిలిచి పాపను హైదరాబాద్ తీసుకెళ్లడం బెటర్ అన్నారు.. కానీ ఎలా..? వాళ్ళ దగ్గర ఆ మూడు రోజుల బిల్లు కట్టడానికే డబ్బులు లేవు, ఆలస్యం చేస్తే పాప బతకడం కష్టం అన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నా నిర్ణయం మీద డిపెండ్ అయి ఉన్నారు..

ఏదైతే అధయింది, పాపను ఎలా అయినా బతికించాలి అని వెంటనే మా సునితక్క వాళ్ళ అన్నాదమ్ముళ్లతో మాట్లాడాను, మీరు ఏం చేస్తారో ఎవరి కాళ్ళు పట్టుకుంటారో తెలీదు, మీకు ఉన్నది ఒక్క కోడలు, బతికించడం మీ చేతుల్లోనే ఉంది, ఎలా అయినా డబ్బులు అరెంజ్ చేయమని చెప్పాను..

మా సొంత బావకి ఫోన్ చేసి పరిస్థితి చెప్పిన. ఆయన వెంటనే 60 వేల వరకు సర్దాడు. మా సునితక్క వాళ్ళ తమ్ముళ్లు కూలి పనులు చేసుకుని బతికే వాళ్ళు. వాళ్లు ఎవరికి ఫోన్ చేసిన రూపాయి దొరకలేదు .

ఇక వాళ్ళ భార్యలు ముందుకు వచ్చి మెడలో ఉన్న పుస్తెలు కుదవ బెట్టి ఇస్తాం, పాపను హాస్పిటల్ తీసుకుని వెళ్ళు అన్నా అన్నారు.. చాలా బాదేసింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ లో అంకుర చిల్డ్రన్స్ హాస్పిటల్ తీసుకు వెళ్ళాను .

నాతో పాప అమ్మ, వాళ్ళ చిన్న మేనత్త కొడుకు వచ్చారు. అంకుర హాస్పిటల్ లో 12 రోజులు ఉన్నాం. ఎన్ని టెస్టులు చేసినా అసలు ఫిట్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కాక డాక్టర్లు తల పట్టుకున్నారు.

అంకుర హాస్పిటల్ వెళ్ళాక నాలుగవ రోజు పాపకి స్పృహ వచ్చింది కానీ ఫీట్స్ మాత్రం ఆగలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు.. లాస్ట్ కి ఒక డాక్టర్ వచ్చి బంజారా హిల్స్ లో ఉన్న సిటీ న్యూరో సెంటర్ కి సెకండ్ ఒపీనియన్ కోసం రిఫర్ చేశారు..

డాక్టర్ అన్ని పరీక్షలు చేసాడు. అన్ని రిపోర్ట్స్ నార్మల్. ఆయన పాపతో మాట్లాడాలి. మీ అందరూ బయటే ఉండమని చెప్పి, పాపను ఆయన క్యాబిన్ లోకి తీసుకువెళ్లి అరగంట తరువాత నన్ను లోపలికి రమ్మన్నాడు .

నేను వెళ్లి సార్ పాపకి ఏమైంది అన్నాను. ఆయన ఏమి మాట్లాడకుండా పాప నానమ్మ ఎవరు, ఇక్కడికి వచ్చిందా అని అడిగాడు, లేదు సార్ అన్నాను, మంచిది వస్తే మాత్రం నా చేతుల్లో సచ్చేది అన్నాడు, ఎందుకు సార్ ఏమైంది అని అడిగితే అప్పుడు చెప్పాడు పాపకి ఏం జరిగిందీ అని..

జరిగిన విషయం ఏంటంటే పాప ఆడుకోవడానికి రోజూ బయటకు వెళ్తే వాళ్ళ నానమ్మ పాపను దగ్గరకు తీసుకుని, నువ్ ఆడుకోవడానికి బయటకు వెళ్తే నిను కామన భూతం ఎత్తుకపోతాది, బయట భూతాలు ఉన్నయ్ అని రోజూ దెయ్యం కతలు చెప్పేదట .

దానికి తోడు పాప హాస్టల్ లో ఉన్న స్నేహితురాలు రోజూ దెయ్యాల గురించి మాట్లాడుతుంటే నిజంగానే దెయ్యాలు ఉన్నట్టు భ్రమలోకి వెళ్ళిపోయింది పాప. వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఒక ముసలామెకు మంత్రాలు వస్తాయి అని పాప ముందే అందరూ మాట్లాడుకోవడం విని ఆ ముసలామెనే దెయ్యంలా ఉహించుకుంది. ఆ ముసలామెనే రోజు ఆమె మీదకు వచ్చినట్టు ఉహించుకునేది .

అలా ఉహించుకున్న ప్రతిసారి ఫిట్స్ లాగా వచ్చి స్పృహ కోల్పోయేది.. ఆమెకు ఒంట్లో ఏ సమస్య లేదు. ఉన్న సమస్య అల్లా ఆమె మనసులో పాతుకు పోయిన భయం. ఆ భయమే ఆమె ప్రాణం మీదకు తెచ్చింది అని డాక్టర్ పాపకు జరిగింది మొత్తం వివరించాడు..

మరి సొల్యూషన్ ఏంటి సార్ అన్నాను. సొల్యూషన్ ఏమి లేదు. పాపను డిశ్చార్జ్ చేసుకుని, ఇంటికి తీసుకెళ్లి, పా లోని భయాన్ని తీసేస్తే చాలన్నాడు. నేను సరే అని పాసను హాస్పిటల్ నుండి బయటకు తీసుకువచ్చి, తిరిగి పాపను ఒక హోటల్ కి తీసుకెళ్లాను. అక్కడ పాప నేను ఇద్దరమే ఉన్నాం. పాప సైలెంట్ గా కిందకు చూస్తూ కూర్చుంది. నేను మెల్లగా పాపతో మాట కలిపి, ఏమైంది మమ్మీ, డల్ గా ఉన్నావ్ అని అడిగా. పాప నుండి సమాధానం లేదు

మళ్ళీ అడిగా, నో రెస్పాన్స్. భుజం మీద చేయి వేసి, ఏమైందిరా ఆకలిగా ఉందా, ఏమైనా తింటావా అని అడిగా.. లేదు అన్నట్టు తల ఊపింది, పోనీ ఏమైనా తాగుతావా అని అడిగా, పాప సైలెంట్ .., మళ్ళీ అడిగా, నువ్వేం కావాలి అన్నా తెస్తా, ఏం తాగుతావ్ మమ్మీ అని అడిగా. పాప సైలెంట్.

నాకు అనుమానం వచ్చి నవ్వుతూ కామెడీగా. పోనీ రక్తం తాగుతావా అన్నాను. పాప చూపు మారింది నా అనుమానం బలపడింది. నేను మళ్ళీ నవ్వుతూ ఏ రక్తం కావాలిరా, కోడి రక్తమా మేక రక్తమా అని అడిగా. పాప ఉహూ అని తల ఊపింది. మరేం కావాలిరా అని అడిగితే
పాప మెల్లగా సిగ్గు పడుతూ విచిత్రమైన చూపులు చూస్తూ, బాబాయి బాబాయి మరి మల్ల అమ్మకు చెప్పకు, నాకు నాకు మనిషి రక్తం తాగాలని ఉంది అని గొణుగుతూ చెప్పింది. అది విని నా రోమాలు నిక్క బొడిచినయ్. కరెక్ట్ గా చెప్పాలి అంటే నాకు కింద తడిసిపోయింది..

నేను అయినా కూడా భయం చూపించకుండా సరే మమ్మీ, ఇంటికి పోయాక తెచ్చి ఇస్తా, ముందు టిఫిన్ తిను అని చెప్పి, పాపతో ఇక మనసు విప్పి మాట్లాడటం మొదలు పెట్టాను, పాపకు ఏం జరిగిందో పాపకే మొత్తం వివరించి చెప్పిన. నీ సిచ్యువేషన్ ఇది. ఇందువల్ల నువ్ ఇలా అయ్యావ్ అని చెప్పిన. పాప అమాయకంగా మరి బాబాయి నాకేమైనా ఆయుతదా అని అడిగింది.

నేను ఏమీ అవదురా, అమ్మ నీ కోసమే బతుకుతుంది, నువ్ బాగుంటే అమ్మ బాగుంటుంది, దెయ్యాలు భూతాలు ఏమి లేవు అని కొన్ని ఉదాహరణలు చెప్పి పాపలోని భయాన్ని తీసేయడానికి ట్రై చేసాను..

నేను తిరుపతిలో కొన్న దండ నా మెడలో నుండి తీసి పాప మెడలో వేసి, ఇది ఉంటే నీ దగ్గరకు ఏ దయ్యం రాదు ఒకవేళ వచ్చినట్టు నీకు అనిపిస్తే మనసులోనే ఒక మాట అనుకో, ఓ దెయ్యమా నువ్ నా దగ్గరకు రాకు, చల్ దొబ్బేయ్ అని మనసులోనే తరిమేయ్ అని పాపను మెల్లగా ట్యూన్ చేసాను

పాప నేను చెప్పింది చెప్పినట్టు చేస్తా తల ఊపింది. ఆ క్షణం నుండి ఇప్పటి వరకు పాపకు మళ్ళీ ఫిట్స్ రాలే.దు ఎప్పటిలాగే నార్మల్ అయింది.. కానీ ఆ 12 రోజుల్లో 3 లక్షల రూపాయలు ఖతం.. దెయ్యాలు భూతాలు మంత్రాలు అని పిల్లల ముందు మాట్లాడితే ఏమవుతదో ఆ రోజు అర్థం అయింది. చివరికి పాప సేఫ్..

(చంద్రముఖి సినిమాలో జ్యోతిక పాత్ర స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్‌కు గురవుతుంది, ఎప్పుడో మరణించిన ఓ నర్తకిని ఆవాహన చేసుకున్నట్టు ఫీలై, అలాగే వ్యవహరిస్తూ ఉంటుంది… ఈ కథ కూడా అలాగే ఉందా.. కాకపోతే కొంచెం డిఫరెంట్… అంతే…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions