Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘తాజా నిమ్మ సోడా’ గిరిజ ఓక్..! రాత్రికి రాత్రే సోషల్ మీడియా సంచలనం..!!

November 12, 2025 by M S R

.

మోనాలిసా… పేరు గుర్తుంది కదా… కుంభమేళాలో పూసలమ్ముకునే నీలికళ్ల అమ్మాయి… ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు… అంతే… హఠాత్తుగా స్టార్ అయిపోయింది… సోషల్ మీడియా ఆమె వార్తలు, ఫోటోలు, వీడియోలు, ఇంటర్వ్యూలతో మోతమోగిపోయింది… ఇప్పుడు సినిమాలు చేస్తోంది… అంతే, కొన్నిసార్లు ఒక ఫోటో, ఒక వీడియో క్లిప్, ఒక చిన్న పోస్టు మనుషులను అమాంతం పైకి లేపుతాయి…

ఆమధ్య గుర్తుంది కదా… ఏదో క్రికెట్ మ్యాచు చూస్తూ తన ఎమోషన్ వ్యక్తీకరించడానికి అరచేతులతో ఏవో సైగలు చేసింది ఒకావిడ… అంతే, ఆమె ఎవరు అని వెతికారు… ఆమె సోషల్ మీడియా ఖాతాను లక్షల మంది హఠాత్తుగా ఫాలో అయ్యారు…

Ads

ఇప్పుడు మరొక నటి గురించి చెప్పుకుందాం… ఆమె పేరు గిరిజ ఓక్… గిరిజ ఓక్ (Girija Oak Godbole)… మరాఠీ నటి… 37 ఏళ్లు… ఒక చిన్న ఇంటర్వ్యూ తాలుకు వీడియో క్లిప్… దాంతో హఠాత్తుగా రాత్రికిరాత్రి ట్రెండింగ్ స్టార్ అయిపోయింది… ఆమె విశేషాలు, పాత ఇంటర్వ్యూలు, ఫోటోలు, వీడియోలు తెగవెతికేస్తున్నారు… పోస్టులు, షార్ట్స్, రీల్స్… ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండింగులో ఉంది…

 ట్రెండింగ్‌కు కారణం: ఆ ఇంటర్వ్యూ క్లిప్!

గిరిజ ఓక్ ట్రెండింగ్‌లోకి రావడానికి ప్రధాన కారణం ఆమె ఇటీవల ఒక వెబ్ సిరీస్ గురించి ఇచ్చిన ఇంటర్వ్యూ…

  • సందర్భం…: గిరిజ, బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్యతో కలిసి ‘థెరపీ షెరపీ’ (Therapy Sherapy) అనే రాబోయే వెబ్ సిరీస్‌లో నటించింది…
  • ముఖ్య విషయం..: ఈ సిరీస్‌లో ఒక ఇంటిమేట్ సీన్ గురించి ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడింది… షూటింగ్ సమయంలో గుల్షన్ దేవయ్య చూపించిన Sensitivity, ప్రొఫెషనలిజం గురించి గిరిజ ఎంతగానో ప్రశంసించింది…

 

  • వైరల్ వ్యాఖ్య…: “ఆ సీన్ షూటింగ్ సమయంలో, గుల్షన్ కనీసం 16 లేదా 17 సార్లు నన్ను ‘మీకు ఓకేనా? (Are you okay?)’ అని అడిగాడు” అని గిరిజ చెప్పింది… సీన్ సౌకర్యవంతంగా ఉండటం కోసం తన వానిటీ వ్యాన్ నుంచి రకరకాల దిండ్లు తెచ్చి ఇచ్చాడని కూడా తెలిపింది… సహ నటుడి నుంచి ఇంతటి గౌరవం, భద్రత లభించడం చాలా అరుదు అని ఆమె చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల హృదయాలను తాకాయి… (గుల్షన్ తెలుసు కదా, కాంతారా-1 సినిమాలో రాకుమారుడు…)

girija

జనం వెతుకుతున్న ఆమె లుక్ & ఇంటర్వ్యూ వివరాలు…

  • వైరల్ ఫోటో…: ఇంటర్వ్యూలో గిరిజ స్కై బ్లూ చీర, స్లీవ్‌లెస్ వైట్ బ్లౌజ్ ధరించి, సింపుల్‌గా, చాలా సొగసుగా కనిపించింది… ఈ లుక్‌లో ఆమె అందం, సున్నితమైన చిరునవ్వుకు ఫిదా అయిన నెటిజన్లు ఆమె ఫోటోలను, ఇంటర్వ్యూ క్లిప్‌లను విపరీతంగా షేర్ చేశారు…
  • రీల్స్, షార్ట్స్…: ఈ క్లిప్స్‌ను లక్షల వ్యూస్‌తో సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ రూపంలో పోస్ట్ చేస్తున్నారు… చాలా మంది “ఈ అందమైన మహిళ ఎవరు?” అని అడగడం మొదలుపెట్టారు, ఇది ఆమెను ట్రెండింగ్‌లోకి తెచ్చింది…

ఇంతకీ ఎవరీమె..? 

  • పేరు…: గిరిజ ఓక్ గోడ్బోలే (Girija Oak Godbole)…
  • వయస్సు…: 37 సంవత్సరాలు (పుట్టిన తేదీ: డిసెంబర్ 27, 1987, నాగ్పూర్, మహారాష్ట్ర)…
  • నేపథ్యం…: ఆమె మరాఠీ ప్రముఖ నటుడు గిరీష్ ఓక్ కుమార్తె… (తను పద్మశ్రీ, ఫార్మసిస్ట్)…
  • కెరీర్…: ప్రధానంగా మరాఠీ చిత్రాలు, టీవీ సీరియల్స్‌…
  • హిందీలో గుర్తింపు…:
    • తారే జమీన్ పర్ (2007): ఈ హిట్ సినిమాలో ఆమె చిన్న పాత్రలో (రసోయిలో పనిచేసే యువతి) కనిపించింది…
    • షోర్ ఇన్ ది సిటీ (2010): ఈ సినిమాలో సందీప్ కిషన్‌తో కలిసి కీలక పాత్ర పోషించింది…
    • జవాన్ (2023): షారుఖ్ ఖాన్ నటించిన ఈ బ్లాక్‌బస్టర్ చిత్రంలో కూడా ఆమె ఒక పాత్రలో నటించింది…
  • వ్యక్తిగత జీవితం…: ఆమె 2011లో ఫిల్మ్ మేకర్ సుహ్రుద్ గోడ్బోలేను వివాహం చేసుకుంది… ఒక కొడుకు…

girija

ప్రస్తుతం సోషల్ మీడియాలో పరిస్థితి ఇలా ఉంది…

  • ఆమె పాత ఇంటర్వ్యూల క్లిప్పింగ్‌లు, లుక్స్, నటనకు సంబంధించిన వీడియోలు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి… నెటిజన్లు ముఖ్యంగా ఆమె నీలి రంగు చీర, ఇతర ఎలిగెంట్ లుక్స్ ఫోటోల కోసం గూగుల్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా వెతుకుతున్నారు…
  • ప్రశంసల వర్షం: ఆమె సహజమైన అందం, మృదువైన మాట తీరు, ప్రొఫెషనల్ నటుడిని ప్రశంసించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతూ పోస్టులు పెడుతున్నారు… “న్యాచురల్ బ్యూటీ,” “ఎంత క్యూట్‌గా ఉంది,” “టాలీవుడ్‌లో ఛాన్స్ ఇవ్వాలి” అంటూ కామెంట్లు చేస్తున్నారు…

మరి తాజా నిమ్మ సోడా కథేమిటీ అంటారా..? 

గిరిజ ఓక్ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ షాపింగ్ వ్యాపార సంస్థ పేరు ‘ఫ్రెష్ లైమ్ సోడా’ (Fresh Lime Soda – FLS)….

  • ఈ పేరు వెనుక కథ…: ముంబైలోని వేడి వాతావరణంలో ఒక హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ వర్క్‌షాప్‌కు హాజరైన తర్వాత, గిరిజ ఇంటికి తిరిగి వెళుతూ ఒక ఫ్రెష్ లైమ్ సోడా తాగింది… ఆ సమయంలోనే, తన సృజనాత్మక లక్ష్యాన్ని (Calling) వినగలిగానని, అందుకే ఆ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నానని ఆమె ఒక ఇంటర్వ్యూలో వివరించింది…

ఈ సంస్థను ఆమె తన భాగస్వామి అక్షరతో కలిసి ప్రారంభించింది… ఈ బ్రాండ్ ప్రధానంగా దుస్తులను (Designing Clothes) డిజైన్ చేస్తుంది… వీటి లక్ష్యం, ప్రజలు తమ దుస్తులలో సౌకర్యవంతంగా (Comfortable) ట్రెండీగా (Chic) కనిపించేలా చేయడం…

సంప్రదాయ భారతీయ అద్దకం, ప్రింటింగ్ పద్ధతులను ఉపయోగించి సహజమైన వస్త్రాలతో (Natural Fabrics) ఈ దుస్తులను తయారు చేస్తారు… దుస్తులను పర్యావరణ అనుకూలమైన ప్యాకేజీలలో పంపిస్తారు… తమ ధర ట్యాగ్‌లు (Price Tags) కూడా పర్యావరణహితం, ఏనుగు పేడతో తయారుచేసే ‘చమత్కారమైన’ ఆలోచన…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘తాజా నిమ్మ సోడా’ గిరిజ ఓక్..! రాత్రికి రాత్రే సోషల్ మీడియా సంచలనం..!!
  • శ్రావ్యమైన ఈ గొంతు… 3800 పసి గుండెల శృ‌తి సరిచేసింది..!
  • అసలే ఆదివిష్ణు.., పైగా జంధ్యాల… ఇంకేం.? నవ్వులే నవ్వులు..!
  • …. అందుకే రేవంత్ రెడ్డి తన వ్యతిరేకులకూ నచ్చుతాడు కొన్నిసార్లు..!!
  • బిడ్డని వదిలేసి వెళ్లిన తల్లి మీద కోపం వస్తుంది మొదట… కానీ..?
  • రేణుకా షహానీ..! నెలవారీ చెల్లింపుతో సహజీవనం ఆఫర్ ఇచ్చాడు..!!
  • విశ్రాంతీ ఒక కళ – సరైన రిలాక్స్ ఆరోగ్యకరం… లేదంటే ఒళ్లు గుల్ల…
  • దాదాపు మాయం తెలుగు మీడియం..! అంకెలు చెబుతున్న సత్యం..!!
  • అనన్య బిర్లా… వారసత్వం కాదు సొంత వ్యాపారం ప్లస్ సంగీత కెరటం…
  • బ్రెయిన్ స్ట్రోక్స్..! రోజురోజుకూ ఈ కేసులు పెరుగుతున్నయ్ బహుపరాక్..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions