Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సర్కారు సరిగ్గా వ్యవహరిస్తేనే… హైదరాబాద్ ప్రపంచ భవిష్యత్ నగరం…

October 21, 2024 by M S R

.

ప్రపంచ భవిష్యత్ నగరం – హైదరాబాద్

హైదరాబాద్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా ఉంది. గ్లోబల్ సర్వేలను పరిశీలించినపుడు, ఒక సర్వే ప్రకారం హైదరాబాద్ 5వ స్థానంలో ఉండగా, మరో సర్వే ప్రకారం 4వ స్థానంలో ఉంది. (developing cities)… బ్రిటీష్ రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వహించిన సర్వేల్లో కూడా, హైదరాబాద్ టాప్-10 అభివృద్ధి చెందుతున్న నగరాల్లో స్థానం సంపాదించింది.

Ads

ఈ అధ్యయనాలు ప్రపంచవ్యాప్తంగా 230 నగరాలను పరిశీలించి రూపొందించబడ్డాయి. అందరి అభిప్రాయాలు ఒకేలా ఉన్నై – 2018 లో హైదరాబాద్ యొక్క GDP సుమారు 50 బిలియన్లు ఉండగా, 2033-34 నాటికి 200 బిలియన్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేవలం పదేళ్లలో నాలుగు రెట్లు వృద్ధి అంటే మామూలు విషయం కాదు.

వేగంగా పెరుగుతున్న హైదరాబాద్ ఎకానమీ, మౌలిక సదుపాయాలు (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్), జనాభా పెరుగుదల, రాబోయే ప్రాజెక్టుల క్రమం, వీటి ఫలితంగా ప్రపంచ పటంలో హైదరాబాద్ ఒక ప్రముఖ స్థానం సంపాదిస్తోంది. గతంలో అమెరికాలో ఉన్న ఐటీ కంపెనీల్లో సుమారు 50% ఉద్యోగులు ఉండగా, 30% ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉండేవారు. అయితే, కోవిడ్ తర్వాత, అనేక అమెరికన్ మరియు యూరోపియన్ కంపెనీలు తమ కార్యకలాపాలను, ఆఫీసులని పూర్తిగా హైదరాబాద్‌కు తరలించాయి/ ఇంకా తరలిస్తున్నారు .

ఈ విధంగా కేవలం ఐటీ రంగం మాత్రమే కాకుండా, ఫార్మా, మ్యాన్యుఫాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ పరికరాలు, మరియు తాజాగా డిఫెన్స్ కంపెనీల రాక కూడా మొదలైంది. ప్రపంచంలోని టాప్-10 ఫార్మా కంపెనీల్లో 4 కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయి అంటే హైదరాబాద్ ఎంత కీలకమైనదో ఇది తెలుపుతుంది.

హైదరాబాద్ కి తూర్పున – LB నగర్, ఉప్పల్, చౌటుప్పల్,
హైదరాబాద్ కి పడమర – పఠాన్ చెరువు, హైటెక్ సిటీ, కొండాపూర్
హైదరాబాద్ కి దక్షిణాన – తుక్కుగూడ, శంషాబాద్, మహేశ్వరం
హైదరాబాద్ కి ఉత్తరాన – కొంపెల్లి, తూఫ్రాన్, మేడ్చల్

ప్రధానంగా ఎక్కువ కంపనీలు దక్షిణాన ఎయిర్ పోర్ట్ తుక్కుగూడ నుంచి పడమర పఠాన్ చెరువు బెల్ట్ వరకు ప్రస్తుతం ఎక్కువ గా ఉన్నై. తూర్పున ఉప్పల్ లో ఇన్‌ఫోసిస్, ఆదిభట్లలో TCS ఉన్నై కానీ పూర్తి స్థాయిలో కంపనీలు రాలేదు. భవిష్యత్ లో ఉత్తరాన కొంపెల్లి సైడ్ కూడా కంపనీలు వస్తే బాగుంటుంది (కనీసం కొంపెల్లి, మేడ్చల్  వైపు IIM (Indian Institute of Management) తీసుకు వచ్చినా ఆ తర్వాత మిగతా కంపనీలు అన్నీ అటువైపు రావటానికి స్కోప్ ఉంటుంది)

వీటికి తోడు ORR కి, RRR కి మధ్య రింగ్ మెట్రో. RRR కి వెలుపల RRR ఆనుకొని రింగ్ రైలు ప్రాజెక్ట్ రాటానికి స్కోప్ ఉంది. వీటికి తోడు బొంబాయి నుంచి హైదరాబాద్, బెంగళూరు నుంచి హైదరాబాద్ బులెట్ ట్రయిన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.

హైదరాబాద్ నుంచి కంపనీలు అమలాపురానికి వెళ్ళవు, అహ్మదాబాద్ వెళ్ళవు – ప్రపంచ వ్యాప్తంగా ఏ సర్వే తీసుకున్నా వేగం గా అభివృద్ధి చెందే నగరాల్లో హైదరాబాద్ టాప్ 10 లోపే ఉంది; అందుకే హైదరాబాద్ లో ఉండేవాళ్ళు, ఉండాలనుకున్న వాళ్ళు వెంటనే కనీసం ఒక అపార్ట్ మెంట్ తీసుకోండి ప్రపంచ భవిష్యత్ నగరంలో…  (జగన్నాథ్ గౌడ్)


ఈ స్టోరీ కంటెంట్ భావి అవకాశాలపై ఆశాజనకంగా ఉంది గానీ… హైడ్రా బుల్డోజర్ల భయం, మూసీ కూల్చివేతల భయం, వందలాది జీపీ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్ల నిషేధం, ఫార్మా సిటీ అనిశ్చితి, ఫోర్త్ సిటీపైనే దృష్టి… వీటితో హైదరాబాదులో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది… ప్రభుత్వ ముఖ్యుల నుంచి నిర్మాణాత్మకంగా సరైన దిశలో అడుగులు లేవు, స్పష్టత ఇచ్చేవాళ్లు లేరు, నగరానికి నలువైపులా పెద్ద కంపెనీలు వస్తే సహజంగానే నగర విస్తరణ సమంగా, పాజిటివ్ డైరెక్షన్‌లో ఉంటుంది… ఎటొచ్చీ కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణి పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో విశ్వాసం కలిగించేలా లేదు… అంతా బభ్రాజమానం భజగోవిందం…!! (ముచ్చట)


 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions