మనం చెప్పుకున్నాం కదా… భారీ గ్రాఫిక్స్ పేరిట నిర్మాణమైన సినిమాల బడ్జెట్ లెక్కల వెనుక అబద్ధాలు ఏమిటో… అన్నీ తప్పుడు లెక్కలు… ఎవడి వాటా ఏమిటో తెలియదు… అంత బడ్జెట్ ఎందుకు చూపిస్తారో, దాని వెనుక ఐటీ మర్మాలు ఏమిటో తెలియదు… సరే, ఆ ఓం రౌత్ ఉన్నాడు కదా… అదేనండీ, టీవీల్లో కార్టూన్, యానిమేషన్ సీన్లు తీసుకొచ్చి, యథాతథంగా పేస్ట్ చేసి, 500 కోట్ల ఖర్చు చూపిస్తున్నాడుగా… దేశమంతా బండబూతులు తిట్టింది… సినిమా అలాగే ఉంటే మర్యాద దక్కదు అని కూడా చెప్పింది…
ఆ బూతుల్ని కూడా సంపాదన మార్గానికి వాడేసుకున్నాడు ఓం రౌత్… మరి ఎవరికీ నచ్చడం లేదు కదా, గ్రాఫిక్స్ మార్పిద్దాం, ఇంకా అందంగా చెక్కుదాం, మరో 100 కోట్లు ఇవ్వండి అని నిర్మాతల జేబులు మళ్లీ కట్ చేసేశాడు… ఎవరైనా తనతో పరిచయం ఉంటే, ఒక్కసారి హనుమాన్ పేరిట మనవాళ్లే ఓ సినిమా తీస్తున్నారుగా… ఆదిపురుష్ గ్రాఫిక్స్‌తో పోలిస్తే సూపర్‌గా చేయించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ… ఒకసారి చూపించండి…
ఐనా మనకెందుకులే… ఈ టీజర్ చూసి ఓం రౌత్ ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే మనకు పాపం చుట్టుకుంటుంది… అసలు విషయం చెప్పనేలేదు కదూ…
Ads
హనుమాన్ సినిమాకు బడ్జెట్ కేవలం 15 కోట్లు… ఈ గ్రాఫిక్స్ దందాలు చేసే పెద్ద దర్శకులకు ఇబ్బంది కలుగుతుందని అనుకున్నారో ఏమో… నిర్మాతలకు అసలు లెక్కలు తెలిసిపోతాయని భావించారో ఏమో… వికీపీడియాలో ఆ బడ్జెట్ ఫిగర్స్ తీసేశారు… ఆ ఆదిపురుషే తీసుకొండి… మొత్తం ఖర్చు 600 కోట్లు… అది పరమ అధ్వానంగా ఉంది… కానీ ఈ హనుమాన్ అనే సినిమా బడ్జెట్ ఆదిపురుష్ బడ్జెట్‌లో నాలుగైదు పైసల వంతు… ఐతేనేం, అదరగొట్టేశారు…
అఫ్‌కోర్స్, కొన్నిచోట్ల మరీ వంద మంది బాలయ్యలు ఒక్కటైనవేళ అన్నట్టుగా అతి హీరోయిజాన్ని ఆపాదించారు… హనుమంతుడే కదా, చల్తా అనుకున్నారేమో… సినిమా రిలీజైతే గానీ తెలియదు… టీజర్‌ను బట్టి సినిమాను అంచనా వేయలేం కరెక్టే గానీ సినిమా పోకడను పట్టిస్తుంది కదా… ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర, ఆదిపురుష్ గ్రాఫిక్స్‌కన్నా ఈ గ్రాఫిక్స్ బాగున్నాయి… ఎందుకో తెలుసా..?
అంత భారీ గ్రాఫిక్స్ సినిమాల్లో దర్శకుడు కనిపించడు… క్రియేటివిటీ కనిపించదు… కానీ హనుమాన్‌లో ఆ లోపం లేదు… కొన్ని షాట్లలో దర్శకుడు కనబడ్డాడు… ఎస్, పరికరం ఎంత ఆధునికం అయితేనేం, అది చేతిలో ఉన్న పనివాడికి ఎలా వాడుకోవాలో తెలియాలి… ఇదీ అదే… ఎస్, ఈ సినిమాలో ఎవరూ పేరున్నవాళ్లు లేరు… స్టార్లు లేరు… హీరో తేజ సజ్జ దగ్గర నుంచి హీరోయిన్ అమృతా అయ్యర్ నుంచి… కొరియోగ్రాఫర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, సినిమాటోగ్రాఫర్ల వరకు ఎవరూ పెద్దగా పేరున్నవాళ్లు కారు… వరలక్ష్మి ఒక్కతే కాస్త అందరికీ తెలిసిన యాక్ట్రెస్…
చెప్పనేలేదు కదూ… వీళ్లు పెట్టేది ఆఫ్టరాల్ 15 కోట్లు కదా… ఆల్‌రెడీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమ్మేసి 16 కోట్లు సంపాదించేశారు… ఇంకా శాటిలైట్ హక్కులున్నయ్… పాన్ ఇండియా సినిమా, పైగా హనుమంతుడు… ప్రజెంట్ ట్రెండ్ అదే కదా… సో, మంచి ప్లానింగు… అవికాదు నాకు నచ్చినవి… వందల కోట్లు ఎందుకురా గ్రాఫిక్స్ కోసం అన్నట్టుగా ఈ దర్శకుడు కారు చౌకగా మంచి గ్రాఫిక్స్ తీసి చూపిస్తున్నాడు కదా… నువ్వు తోపువురా భయ్… ఎస్, మీలాంటోళ్లే ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరం..!! కానీ మరీ పిల్లాడికి బరువైన పాత్ర ఇచ్చారు… ఆ బరువైన గద మోస్తాడా..!!
Share this Article