టీవీ9 వాడికైతే మరీనూ… పిల్లొచ్చినా పిత్తొచ్చినా అపురూపమే… సమాచార సంచలనమే… హీరో రాంచరణ్, ఉపాసన దంపతులకు రేపు మార్నింగ్ 6.30 గంటలకు సంతానమట… ఇదొక మెగా ఈవెంట్ అన్నట్టుగా టీవీ9 వాడు ఎగబోసుకుంటూ వార్తల మీద వార్తలు ఇస్తున్నాడు… జనం రెండో ప్లేసులో కూర్చోబెట్టినా ఇంకా బుద్ధి ప్రసవించలేదు…సూపర్ ఎక్స్క్లూజివ్ అట… రెడీగా ఉండాలట… హాస్పిటల్ నుంచే ఉదయం నుంచే ప్రత్యక్ష ప్రసారమట… పాపం శమించుగాక… హాస్పిటల్ లోనికి వెళ్లకండిరా నాయనా… దీనిపై Abdul Rajahussain సార్ రాసిన ఓ పోస్టు చదవండి ముందుగా…
సో… వ్యక్తుల జీవితాలు వారి సొంతం.. సెలబ్రిటీల జీవితాలు కూడా వారి సొంతమే.. అన్న స్పృహ లేనంతకాలం మీడియా హంగామాలు తప్పవేమో?
సరే, చదివేశారు కదా… సెలబ్రిటీ అంటే మీడియాకు తుమ్మినా పిత్తినా అపురూపం అని ముందే అనుకున్నాం కదా… అది మన మీడియా స్థాయి… దాని గురించి చర్చను వదిలేస్తే… ఓ చిన్న డౌట్… ముందుగా ఒక పంచాంగంలో ఈ పేజీ చూడండి…
Ads
రేపు వీళ్లకు బిడ్డో కొడుకో పుడితే… జనం అశుభాలుగా భావించే మూల, అశ్లేష, జ్యేష్ట నక్షత్రాలు మాత్రం కాదు… అఫ్కోర్స్, బిడ్డో కొడుకో వాళ్లకు క్లారిటీ ఉంది… అంత పెద్ద హాస్పిటల్స్లో అది తెలుసుకోలేదా వాళ్లు… దాన్నలా పక్కన పెట్టేస్తే… ఆమధ్య ఓ పంచాంగం సిజేరియన్లకు కూడా ముహూర్తాలు ఫిక్స్ చేసి పబ్లిష్ చేసింది… దాని ప్రకారం ఈ జూన్లో 2, 12, 16, 30 తేదీలు శుభం… 2, 12, 16 తేదీలు ఎలాగూ అయిపోయాయి… ఎలాగూ 6.30 ముహూర్తం అని ఫిక్స్ చేశారు కాబట్టి సిజేరియనే అని లెక్క…
ఇక ఈ నెలలో మిగిలింది 30… కానీ వీళ్లు 20వ తేదీనాడే ప్రసవ ముహూర్తం పెట్టేశారు… కోసేసి బయటికి తీస్తారు… ఇంకా సుమూహూర్తం కోసం ఆగాలంటే పదిరోజులు ఆగాలి… నెలలు నిండినట్టున్నాయి, ఆగలేరు… సో, ఉన్నంతలో మంచి రోజు చూసి ముహూర్తం పెట్టేశారు… అనగా సిజేరియన్… ఏమో… 20 వ తేదీ ఉదయం ఆరున్నరకే గనుక పుడితే… లేదా బిడ్డను బయటికి తీస్తే… కొడుకు పుట్టే పక్షంలో… కొణిదెల చిన బాబు అని టెంపరరీ పేరుతో గనుక జాతకం చూస్తే… పునర్వసు-2 నక్షత్రం, మిథున రాశి… మంచిదేనట… సో, అన్నీ చూపించే ప్రసవ ముహూర్తం ఫిక్స్ చేశారన్నమాట… పిల్లాడి జననకాలాన్ని బట్టి విపరీతంగా పుస్తక పఠనం అంటే ఆసక్తి ఉంటుందట… ఏమో బాబాయ్ 80 వేల పుస్తకాల రికార్డును బద్దలు కొడతాడేమో… పిల్లాడు కాదు, పిల్ల అయితే ఏమిటంటారా..? సేమ్, సేమ్… ఆల్ ది బెస్ట్ మెగా బాబూ ఆర్ చిన బాబూ ఆర్ చినతల్లీ…
Share this Article