ఏమాటకామాట… జబర్దస్త్ తదితర షోలలో ఈటీవీ, మల్లెమాల కంపెనీ కనబరిచే నీచాభిరుచిని కాసేపు వదిలేస్తే… శ్రీదేవి డ్రామా కంపెనీ కాస్త బెటర్… కామెడీ, ఎంటర్‌టెయిన్‌మెంట్ షో అయినా సమాజంలో రకరకాల బాధితులతో స్కిట్లు చేస్తున్నారు… దానికితోడు డాన్సులు, సాంగ్స్ ఎట్సెట్రా… స్థూలంగా షో కాస్త బెటర్… ప్రత్యేకించి వావ్, క్యాష్ ఎట్సెట్రా పిచ్చి షోలకన్నా బెటర్… ఇంద్రజ ప్రజెన్స్, సుధీర్ యాంకరింగ్ ప్లస్ పాయింట్స్ దానికి…
ఇప్పుడు చెప్పుకునేది ఏమిటంటే… గెటప్ సీను గురించి… తను చాలా ఏళ్లుగా ఈటీవీకి పనిచేస్తున్నాడు… సుడిగాలి సుధీర్ టీంలో కామెడీ చేస్తుంటాడు… కొన్ని సినిమాల్లో పాత్రలు చేసినా తన ప్రధాన వ్యాపకం ఈటీవీయే… పైగా టీం లీడర్‌గా గాకుండా టీం మెంబర్‌గానే ఉంటున్నాడు… స్వతహాగా కాస్త మిమిక్రీ తెలుసు, నటన తెలుసు… కానీ తను ప్రధానంగా కమెడియన్ కావడంతో… ఏ వేషం వేసినా సరే ముందుగా తనను చూడగానే నవ్వొస్తుంది…
తెలిసిందే కదా… కమెడియన్ నిజంగానే ఏడ్చినా ప్రేక్షకుడు నవ్వుతాడు… సీను ఈమధ్య వేరే సినిమా పాత్రలతో బిజీ అయిపోయి… సుధీర్, రాంప్రసాద్ ఉన్నా సరే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో పెద్దగా కనిపించడం లేదు… కానీ హఠాత్తుగా కనిపించాడు ఇప్పుడు… ఓ ప్రోమో రిలీజైంది… వచ్చే ఆదివారం షో… ఈసారి కూడా డిఫరెంటుగా నాటక సమాజాల దురవస్థ గురించి ఓ స్కిట్ చేశారు షోలో…
Ads
అందరికీ తెలుసు కదా… ఇవ్వాళారేపు నాటకాన్ని చూసేవాడు ఎవడున్నాడు..? ఒకప్పుడు అది అందరికీ వినోదసాధనం… ఇప్పుడెవరికీ అక్కర్లేదు… నాటక కళాకారుల జీవితాలెన్నో చితికిపోయాయి… బోలెడు డ్రామా కంపెనీలు మూతబడ్డయ్… ఆ కష్టాలు, కన్నీళ్ల మీద స్కిట్… ఇదే గెటప్ సీను ప్రధాన పాత్ర… నిజంగా బాగా చేశాడు… నవరసాల పోషణ ఏమిటో చూపించాడు… సూపర్ సీనూ…
ప్రదీప్ ఒక టైపు, తను స్వతహాగా యాంకర్, స్పాంటేనియస్ కామెడీ చేయగలడు… కానీ రెగ్యులర్ కామెడీ పాత్రలు చేయడు, చేయలేడు.., చేతగాక కాదు… జస్ట్, చేయడు, అంతే… ఆది కమెడియన్… సుధీర్ కమెడియన్ ప్లస్ యాంకర్ ప్లస్ మంచి డాన్సర్… మిగతావాళ్ల గురించి చెప్పుకునే పనిలేదు కానీ గెటప్ సీను వంటి ‘‘నటన తెలిసిన’’ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు… వెలుగులోకి వారి ప్రతిభ ప్రదర్శితం కాదు… కానీ ఈ స్కిట్ గెటప్ సీనును కొత్తగా చూపించింది…
ఒక కమెడియన్ పలురసాల్ని పోషిస్తూ ప్రేక్షకుడిని మెప్పించడం చిన్న విషయమేమీ కాదు… పైగా సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీలకు కమెడియన్లు అంటేనే ఓ చిన్న చూపు… రెగ్యులర్‌గా ఈ కామెడీ షోలే రేటింగ్స్ తెస్తాయి… కానీ వాళ్లంటే ఓ తేలికభావన… ఈ స్థితిలోనూ ఏడెనిమిదేళ్లుగా అదే ఈటీవీని, అదే మల్లెమాలను పట్టుకుని కథ నడిపిస్తున్నారు సుధీర్, రాంప్రసాద్, గెటప్ సీను తదితరులు… అఫ్‌కోర్స్, ఆ సద్భావం డబ్బులిచ్చే కంపెనీకి ఉంటదని అనుకోలేం… గతిలేక ఉంటున్నారులే అనుకునే బాపతు… ఎనీవే… సీనుకు అభినందనలు…
Share this Article