Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తమిళ పొన్నియిన్ పొగరు, బలుపు… కన్నడ కంతారా అల్టిమేట్, ఆల్టర్నేట్…

October 2, 2022 by M S R

తండ్రిలాంటి కృష్ణంరాజు మరణానంతర విధులతో ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నా సరే…. తన సంస్మరణ సభలో టన్నుల కొద్దీ మాంసాహారంతో సంతర్పణ చేస్తున్నా సరే… ప్రభాస్ తన వృత్తిజీవితాన్ని, అవసరాన్ని నెగ్లెక్ట్ చేయలేదు… కంతారా సినిమాను భలే తీశారు బ్రదర్ అని పొగిడాడు… ప్రత్యేకించి క్లైమాక్స్ అదిరిపోయింది అన్నాడు…

తనకు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఏవో గ్యాప్స్ వచ్చాయట… సాలార్ తీస్తున్నారుగా… పైగా ప్రభాస్, ప్రశాంత్ కలయికతో ఏపీ, తెలంగాణ, కర్నాటకల్లో ఎక్కువ వసూళ్లకు ప్లాన్ చేసిన సినిమా అది… సో, కన్నడ ప్రేక్షకుల్లో నెగెటివిటీ రాకుండా ఉండటానికి, వాళ్లను ప్లీజ్ చేయడానికి కంతారా సినిమాను మోస్తూ, ఇంత బిజీలోనూ ఓ ట్వీట్ కొట్టాడు… తప్పదు మరి… అసలే ఆదిపురుష్ ఫస్ట్ పోస్టర్‌కు పెద్దగా రెస్పాన్స్ లేదు… సైఫ్ రావణుడు అంటే జనం నవ్వుతున్నారు…

Ads

అయితే నిజంగా కంతారా బాగుందా..? నిజంగానే చాలా బాగుందట… బెంగుళూరు తెలుగు మిత్రుల ఫీడ్ బ్యాక్… సినిమా ఎంత వసూళ్లు చేస్తుందనేది ముఖ్యం కాదు గానీ… ఒక గుర్తుండిపోయే సినిమా అంటున్నారు… ఎంత హాశ్చర్యం… ఒకప్పుడు తన చుట్టూ గీత గీసుకుని బతికిన కన్నడ సినిమా… ఇప్పుడు కేజీఎఫ్ దెబ్బకు అన్ని బంధనాలు తెంచుకునీ పాన్ ఇండియా పతాకాన్ని ఎగరేస్తోంది… మాకేం తక్కువ అని ప్రశ్నిస్తోంది… కన్నడ సినిమా ఒకప్పుడు నాసిరకం… కానీ ఇప్పుడు దేనికీ తక్కువ కాదు, పిసరంత ఎక్కువే కూడా…

Adipurush Prabhas Loves This Latest Kannada Movie.

చెత్తా రాష్ట్ర ప్రభుత్వ, కన్నడ పెద్దల విధానాల ఫలితంగా చాలా ఏళ్లు కన్నడ సినిమా బయటి ప్రపంచానికి దూరమైంది… ఇప్పుడిప్పుడే పరిచయం అవుతోంది… కేజీఎఫ్ కావచ్చు, రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి తీసిన హృద్యమైన సినిమా చార్లి కావచ్చు… కన్నడ సినిమా కొత్త వెలుగుల్ని ఆవాహన చేసుకుంటోంది… అందులో ఒకటి ఈ కంతారా…

పొన్నియిన్ సెల్వన్ సినిమా చెత్త అని ఎవరూ అనడం లేదు… కాకపోతే అది థ్రిల్లింగ్ ఎంటర్‌టెయినర్ కాదు అనేదే సకల జనాభిప్రాయం, కానీ తమిళ తంబీలు ఒప్పుకోరు… ఠాట్, మా చరిత్రే అల్టిమేట్ అంటారు… ఆ పాత్రల పేర్లు పలకలేం, వినలేం, బుర్రకు ఎక్కవు… ఆ కథ కూడా మనకు కనెక్ట్ కాదు… ఐనా కొందరు విచిత్ర, వికార తత్వులు పొన్నియిన్ సెల్వన్ ఆహా ఓహో అంటారు, అది వేరే దరిద్రం… తెలుగులో ఆ సినిమా డిజాస్టర్ అయ్యేసరికి తమిళ స్వాభిమానులకు పొడుచుకొచ్చింది…

మా ప్రైడ్ సినిమాను తిరస్కరిస్తారా..? రేప్పొద్దున మీ సినిమాల్ని ఫ్లాప్ చేస్తాం అని రివ్యూయర్లు సహా నెటిజనం పిచ్చి ప్రేలాపనలకు దిగారు… నాన్సెన్స్… తమిళ సినిమాలను తెలుగు ప్రేక్షకుడు గుడ్డిగా, ఎడ్డిగా ఆరాధించాడు తప్ప, ఎప్పుడూ తెలుగు సినిమాను తమిళ ప్రేక్షకుడు ప్రేమించలేదు.., ప్రేమించలేడు.,. పైగా ఈ పిచ్చి సంధిప్రేలాపనలు…! (తెలుగు ప్రేక్షకుడికి ఓ లెక్కాపత్రం ఉండదు కదా… ఐనా సినిమా అనేది ఓ దందా… రివ్యూయర్లు ప్రాణత్యాగాలు చేసినా సినిమాను కాపాడలేరు, ఎత్తలేరు… ఎందుకంటే, ప్రేక్షకుడు ఒకసారి బాగుందని మౌత్ టాక్ స్టార్ట్ చేస్తే ఆ రన్ ఎవరూ ఆపలేరు…)

kantara

నిజానికి పొన్నియిన్ సెల్వన్‌ను మించిన జనాదరణను కంతారా సినిమా సొంతం చేసుకుంటోంది… తక్కువ బడ్జెట్, కానీ జనాన్ని కనెక్టయ్యే కథ, కథనం… భారీ తారాగణం మెరుపులు దానికి అక్కర్లేదు… అది జనం సినిమా… జనప్రయోజనాల సినిమా… జనం సంస్కృతికి సంబంధించిన సినిమా… కంతారా అంటే ఓ అర్థం అడవి… ఆ అడవిలో రాజ్యం ఉండదా.,.? అంతా అరాచకమేనా..? అప్పుడు జనం ఏం చేయాలి..? అదీ కంటెంట్…

సల్మాన్ ఖాన్లు, చిరంజీవులు కలలో కూడా కలవరించే టాప్, ట్రాష్ కలెక్షన్ల కథ కాదు… అదొక పిచ్చి ఆలోచన ధోరణి… రజినీకాంతులు, కమల్‌హాసన్లలాగా డబ్బులు ఏరుకునే బజారు కథ కూడా కాదు… ఈ సినిమాకు ఓ కాన్సెప్ట్ ఉంది… జనానికి ఓ మెసేజ్ ఉంది,.. అందుకే రివ్యూలన్నీ పాజిటివ్‌గా ఉన్నయ్… తెలుగులో ఎందుకు రిలీజ్ చేయలేదో తెలియదు…

అప్పుడెప్పుడో ఎవడో రాజు ధారాదత్తం చేసిన భూమి… దానికి మన చెత్తా బ్యూరోక్రటిక్ పుల్లలు, అడ్డంకులు… ఈ స్థితిలో రూల్స్ అమలు చేయాలనుకునే ఓ ఫారెస్ట్ ఆఫీసర్… న్యాయం అనే కోణంలో ఆలోచించే ఓ లోకల్ హీరో… ఉత్తర గ్రామీణ కర్నాటక అలవాట్లు, సంప్రదాయాలు, పండుగలు, సంస్కృతి ప్లస్ ఆ కన్నడిగుల ఆత్మాభిమానం… ఓ కన్నడ పతాకాన్ని ప్రపంచ సినిమా తెరపై ఎగరేయడానికి ఇంకేం కావాలి..? సోకాల్డ్, తెలుగు స్టార్ హీరో ఎదవల్లారా… కలగనండిరా… ఒక సీతారామయ్య, ఒక వీర బ్రహ్మేంద్ర స్వామి మీకు ఎలాగూ చేతకావు… ఆ దిక్కుమాలిన ఫైట్లు, పాటలు, బిల్డప్, ఫోజులు ఎవరి కోసం… ఇన్నేళ్లు తెలుగు జనం మీద పడి బతికినా సరే, ఇంకా వందల కోట్ల మీద కక్కుర్తి… థూ…

Ads

దర్శకుడే హీరో… నిజంగానే సినిమాలో లీడ్ రోల్… క్లైమాక్సులో ఏడిపిస్తాడు… ఒక కంబాలా ఆటను ఈ సినిమా ప్రొజెక్ట్ చేసినట్టు తెలుగు సినిమా ఎప్పుడైనా తెలుగు ఆటల్ని పాపులర్ చేసిందా…? ఒక తమిళ సినిమా జల్లికట్టులా, ఒక మలయాళ సినిమా వల్లంకలిలా ప్రొజెక్ట్ చేసిందా..? దరిద్రపు రొమాంటిక్ కామెడీ అవసరాల కోసం కబడ్డీని బదనాం చేసింది గానీ…! ఎస్, కన్నడ సినిమా హఠాత్తుగా మెచ్యూరిటీని కనబరుస్తోంది… కేజీఎఫ్ వసూళ్లు అక్కడి సినిమావాళ్ల కళ్లు బైర్లు కమ్మేలా చేశాయి… వాళ్లలో క్రియేటర్లను తట్టిలేపాయి… మంచిదేగా… మరీ ప్రాంతీయ దురభిమానం పర్వర్షన్‌ స్థాయిలో ఉండే తమిళంకన్నా చాలా చాలా నయమే కదా…!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • మరీ అంత పెదకాపు ఏమీ కాదు… ఈ విరాటకర్ణుడు జస్ట్, ఓ చినకాపు మాత్రమే…
  • బట్టలిప్పుకుని బజారులో బరిబాతల డాన్స్ ఆడుతున్న చానెళ్లు…!!
  • బిగుసుకున్న ఇందిర చేతివేళ్ళు… సిరులు ఒలికించిన పంట చేలు…
  • పితృపక్షం అంటే ఏమిటి..? పితృదేవతలకు మనం ఏం చేయాలి..?
  • నారాతో నేను… ఒక విస్తృత దేవతా వస్త్రాల కథ…
  • ఆశలు ఉన్నచోట ఆశాభంగాలు… అలాగే లక్ష్యాలు కూడా..!!
  • 1.26 కోట్లు ఒక లడ్డూ… ఓ విల్లా ధరలా బాగా ఖరీదైన భక్తి…
  • దంచుడే దంచుడు… తెర నిండా బీభత్సమే… అచ్చమైన బోయపాటి సినిమా…
  • తలుపు తట్టిన చప్పుడు… డెయిలీ పేపర్ కింద పడిన చప్పుడు… నేనింకా బతికే ఉన్నాను…
  • అందంలో… అభినయంలో… జ్యోతికకు ఆమడదూరంలోనే ఆగింది కంగనా…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions