ఎస్… ఒక కోణంలో చూస్తే కరెక్ట్… ఒక జిల్లాకు పాలనాధికారి తను… తన జిల్లా ప్రజలకు ఏ రీతిలో మంచి జరిగితే, సాయం దొరికితే దాన్ని పట్టుకుని, ఉపశమనం కలిగించాలి… ఈ కోణంలో కలెక్టర్ చక్రధర్‌బాబు ఒక ఆక్సిజన్ ప్లాంటు కోసం సోనూసూద్ సాయం కోరడం, తను వోకే అనడం సమర్థనీయమే… కానీ సీఎస్ఆర్ కింద సాయం అడగమేమిటో అర్థం కాలేదు… సోనూసూద్ తను వ్యక్తిగతంగానే సాయం చేస్తున్నాడు అందరికీ… ఇందులో ‘‘కంపెనీ సోషల్ రెస్పాన్సిబులిటీ… సీఎస్ఆర్’’ ఏముందో అసలే అర్థం కాలేదు… ఈయన అడగడం, ఆయన వెంటనే కోటిన్నర విలువ జేసే ఓ ఆక్సిజన్ ప్లాంటును ఆత్మకూరులో ఏర్పాటు చేస్తాననడం, ఫ్రాన్స్ నుంచి పరికరాలు తెప్పిస్తానని చెప్పడం వరకూ వోకే… కానీ..?
తన ప్రజల కరోనా కష్టాలు చూస్తుంటే అసలు ఒక జిల్లా పాలనాధికారికి వెంటనే ఒక హీరో సాయం కోరాలనే థాట్ రావడమే విచిత్రం… ఏం..? ఈమాత్రం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదా..? అసలు ప్రభుత్వం కదా అల్టిమేట్… జగన్ కూడా కరోనా కోణంలో ఏదంటే అది ఉదారంగా చేస్తున్నాడు… అనుమతులు ఇచ్చేస్తున్నాడు… రీసెంటుగా కరోనా వల్ల అనాథలుగా మారే పిల్లలకు 10 లక్షల డిపాజిట్లు అన్నాడు… బ్లాక్ ఫంగస్ వ్యాధిని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాడు… కరోనా తాలూకు ప్రతి చికిత్సను కూడా ఆ పథకంలో చేర్చాడు… తనకు చేతనైనవన్నీ చేస్తున్నాడు… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కూడా చాలా పాజిటివ్ మనిషి… చురుకైన అధికారి…
Ads
టీటీడీ ఈవో, మాజీ ఆరోగ్యశాఖ కార్యదర్శి జవహర్‌రెడ్డిని కరోనా నోడల్ ఆఫీసర్‌ను చేశారు, తనూ సమర్థుడే… అలాంటప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కదా ఈ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై ఆలోచన చోటుచేసుకోవాల్సింది… మా ప్రభుత్వం దండుగ, కనీసం ఆ హీరోనైనా సాయం అడుగుదాం అనే ఓ రాంగ్ మెసేజ్ జనంలోకి వెళ్లినట్టయింది కదా ఈ కలెక్టర్ చర్యతో..!! (సాక్షి వార్త ప్రకారం…))…… కలెక్టర్ సంకల్పం మంచిదే కావచ్చు, కానీ జనంలోకి ఎలా వెళ్తుందనేదీ ముఖ్యమే కదా… ఏదో తేడా కొడుతోంది… జగన్ టీం తన స్పిరిట్‌ను అందిపుచ్చుకోవడం లేదేమో అనిపిస్తోంది… ఈ మహావిపత్తువేళ తన సొంత పార్టీ ప్రత్యర్థి రఘురామరాజు, ఇతర పార్టీల ప్రత్యర్థులపై వేట సరే… ఆ చర్చలోకి వెళ్లడం లేదు ఇక్కడ… కాస్త రెండు రోజులకోసారైనా కలెక్టర్లతో సమీక్ష జరిపి, జనాన్ని ఒడ్డున పడేసే చర్యల మీద కాన్సంట్రేట్ చేయవయ్యా మా ప్రియమైన అన్నయ్యా…!!
ఆంధ్రజ్యోతి వార్త కూడా సేమ్ ఇలాగే ఉండగా… ఈనాడులో వచ్చిన స్టోరీ మాత్రం భిన్నంగా ఉంది… నెల్లూరు, జెండా వీథిలో సోనూసూద్ మిత్రుడు సమీర్‌ఖాన్ ఉంటాడట… ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకి, సమయానికి హాస్పిటల్ బెడ్స్ దొరక్క, ఆక్సిజన్ దొరక్క మరణించారనీ, ఆ సమీర్ ఖాన్ కోరిక మేరకు సోనూసూద్ ఓ ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటుకు వోకే చెప్పాడనీ ఆ వార్త చెబుతోంది… ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చారని మాత్రమే వార్తలోని ఒక అంశం… ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం జిల్లా కలెక్టర్ తప్పేమీ లేదు… మరి అధికార పత్రిక, గెజిట్ సాక్షి అలా ఎలా రాసిందబ్బా..? ఇంతకీ నిజం ఏమిటి..?! జిల్లా అధికారులు ఏమీ క్లారిటీ ఇవ్వడం లేదు..!!
Share this Article