తప్పో ఒప్పో …. అక్కినేని వారసులకన్నా ఎస్వీ రంగారావు వారసుల స్పందనే బాగున్నట్టనిపించింది… అలాగని నేనేమీ బాలకృష్ణను వెనకేసుకురావడం లేదు… ఎక్కడ ఏం మాట్లాడుతున్నానో, ఎలా మాట్లాడుతున్నానో కూడా తెలియని ఒకరకమైన బ్లడ్డు, బ్రీడు తాలూకు పైత్యం తనది… మొన్ననే చెప్పుకున్నాం కదా, తనకే కాస్త ‘పదునైూర్న బుర్ర’ ఉండి ఉంటే, బాబు బావ గుప్పిట్లో ఎందుకు చిక్కుకునేవాడు..? తన నుంచి అంతకుమించి ఆశించడం వేస్ట్…
సరే… వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో ఏదో కూశాడు… అది జనరల్ ఫ్లో… కావాలని ఎవరినీ కించపరచలేదు నిజానికి… ఎవరో ఓ వ్యక్తి గురించి చెబుతూ ఇలా ఇలా అందరి కబుర్లూ మాటలమధ్యలో వచ్చేస్తాయి అంటూ ఏదో చెబుతూ పోయాడు… నేను ఓ మీటింగులో మాట్లాడుతున్నాను, లైవ్ వెళ్తోంది, నా భాష బాగుండాలి, నేను ఓ చిరస్మురణీయుడి వారసుడిని, ప్రజాజీవితంలో ఉన్నవాడిని అనే సోయి కూడా లేదు… ఇక్కడ తనను ఇగ్నోర్ చేయడమే కరెక్టు…
కానీ, నాగచైతన్య, అఖిల్ తొందరపడ్డారు… నిజానికి తను ఉద్దేశపూర్వకంగా ఎస్వీఆర్, ఏఎన్నార్ గురించి మాట్లాడి ఉంటే తనే సారీ చెప్పేవాడు… తన తత్వం అదే… దేవబ్రాహ్మణుల మీద తన వ్యాఖ్యల పట్ల తనే క్షమాపణ చెప్పడమే తాజా ఉదాహరణ… తనకు విపరీతమైన అహం ఉంది, అది విచక్షణను కప్పేసి ఉంటుంది… కొన్నిసార్లు మాత్రమే ఆ విచక్షణ పనిచేస్తూ ఉంటుంది… తన బ్యాక్‌గ్రౌండ్ పట్ల తనకున్న పొగరు వంటి ఫీల్ అది…
Ads
అక్కడక్కడా అక్కినేని ఫ్యాన్స్ గొడవలు, నిరసనలకు దిగారు… నాగచైతన్య, అఖిల్ కూడా హార్ష్‌గా ఏమీ స్పందించలేదు… హుందాగా ఉంది, కానీ ఆ స్పందనే అక్కర్లేదు… ఇలాంటివి జరిగినప్పుడు సంయమనం పాటించాలి… ఒకవైపు కాపునాడు వంటి సంస్థల నుంచి ఒత్తిళ్లు, వ్యతిరేక వ్యాఖ్యలు వస్తున్నా సరే, రంగారావు మనమళ్లు సరైన రీతిలో స్పందించారు… బాలకృష్ణ మాటల కాంటెక్స్ట్ అర్థం చేసుకున్నారు… మాకేమీ సమస్య లేదు, ఇష్యూను పెద్దది చేయవద్దంటూ మీడియాకు, సోషల్ మీడియాకు అసలు చురకలు తగిలించారు…
నాగార్జున గానీ, తన కొడుకులు గానీ ఇలాగే మాట్లాడి ఉంటే సరిపోయేది… బాలకృష్ణ మాటలకు అసలు వాల్యూయే ఉండదు… అలాంటిది ఇలా స్పందించేసరికి వాటికి నెగెటివో, పాజిటివో ఓ వాల్యూ క్రియేషన్ జరుగుతోంది… అదే జరగొద్దు… పైగా ఫ్యాన్స్ నడుమ గొడవలు… సమాజానికి వీసమెత్తు ప్రయోజనం లేని వివాదమిది… అవసరమా..? ఇండస్ట్రీకి కూడా ఏమీ నష్టం లేదు… పిల్లాడి మనస్తత్వం అంటారో, మూర్ఖత్వం అంటారో మీ ఇష్టం, కానీ బాలకృష్ణ మాటలకూ ఈ వివాదం వల్ల ఓ వాల్యూ యాడిషన్ జరగడం మాత్రం శుద్ధ దండుగ…
తనకు ఎలాగూ పొలిటికల్ మెచ్యూరిటీ లేదు… వర్తమాన పాలనకు సంబంధించిన ఏ సబ్జెక్టు మీద అవగాహన లేదు… మంచి వక్త కాదు… అఖండ గనుక సక్సెస్ కాకపోతే ఎక్కడో ఉండిపోయేవాడు… జనం క్రమేపీ మరిచిపోయేవాళ్లు… అన్ని ఘోరమైన వరుస ఫ్లాపులు ఇచ్చాడు… ఇప్పుడు కూడా వీరసింహారెడ్డి అనుకున్నంత సక్సెసేమీ కాదు… బ్రేక్ ఈవెన్‌కే తిప్పలు… గత రెండుమూడు రోజుల్లో కొన్నిచోట్ల జీరో షేర్… నాగార్జున పరిస్థితి కూడా భిన్నమేమీ కాదు… మరి వాళ్ల గురించి ఫ్యాన్స్ తన్నుకోవడం దేనికి..?!
Share this Article