.
.
ముందుగా ఓ వార్త చదవండి…. ‘‘ప్రసిద్ధ తమిళ దర్శకుడు (నిజమే, జస్ట్, ఓ తమిళ దర్శకుడు మాత్రమే…) శంకర్‌కు ఈడీ షాక్ ఇచ్చింది… రోబో సినిమాకు సంబంధించి కాపీ రైట్ వివాదంలో ఈడీ తనకు సంబంధించిన 10 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది…
Ads
ఈనెల 17న మనీలాండరింగ్ చట్టానికి సంబంధించి ఈ చర్య తీసుకుంది… కాపీ రైట్ నిబంధనలను ఉల్లంఘించే కేసుల్లో స్థిరాస్తుల స్వాధీనం ఇదే మొదటిసారి అనీ ఈడీ ఓ ప్రకటనలో చెప్పుకుంది… అప్పట్లో రోబో అనే సినిమాలో హీరో రజినీకాంత్… సూపర్ హిట్ సినిమా…
కానీ యంథిరన్ పేరుతో తమిళంలో విడుదలైన ఈ సినిమా తన రచన జిగుబా అనే తన నవలకు కాపీ అని ఆరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి కోర్టుకెక్కాడు… అదీ 2011లో… అంటే 14 ఏళ్ల క్రితం… అసలే రజినీకాంత్, ఆపై శంకర్ కదా, ఎవడు పట్టించుకుంటాడులే అనుకున్నారు అందరూ…
కానీ, కోర్టు ఆదేశాల మేరకు ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఓ నివేదిక సమర్పిస్తూ… ఆ నవలకూ, ఈ సినిమా కథకూ అసలు తేడా లేదని పేర్కొంది… అంటే, పక్కా కాపీ సరుకు అని తేల్చి చెప్పింది… (కాపీ రైట్ చట్టం సెక్షన్ 63)…
300 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాకు గాను 11.5 కోట్ల పారితోషికం తీసుకున్నాడు దర్శకుడు శంకర్… పాపం పండింది… వరసగా సినిమాలు డిజాస్టర్లు… ఫాఫం చిరంజీవి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్… అసలు శంకర్‌లోని క్రియేటివిటీ ఎప్పుడో ఆరిపోయింది, అదేమంటే, అబ్బే 5 గంటల ఫీడ్ అది, 2.5 గంటల్లో కుదించలేకపోయాం అని దిక్కుమాలిన సమర్థన…
అంతగా దిగజారిపోయాడు శంకర్… ఇక ఇప్పట్లో కోలుకోడు తను… పాత పాపాలన్నీ చుట్టుముడుతున్నయ్… అందులో ఒకటి ఈ రోబో… ఇక్కడ నిజానికి శంకర్‌ను తప్పుపట్టడం వేస్టు… తెలుగులో పరమ స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్న ప్రతి వెధవ స్టార్ డైరెక్టరూ కాపీరాయుడే… కాకపోతే శంకర్ దొరికాడు, ఆ గాడిదలు దొరకడం లేదు… అంతే తేడా…
ఇక్కడ మెచ్చుకోవాల్సిన పాయింట్, చెప్పుకోదలిచిన పాయింట్ ఒకటి… ఇన్నేళ్లుగా తన క్రియేటివ్ హక్కుల మీద పోరాడుతున్న సదరు జిగుబా రచయిత ఆరూర్ తమిళనాథన్ గురించి… సదరు నిష్కళంక హీరో రజినీ కాంతుడు, ఆ సినిమా నిర్మాతలు, బయ్యర్లు ఏమైనా స్పందించారా..? భలేవారండీ… అందినకాడికి మింగారు, ఎవడూ శుద్ధ పూస కాదు… హిమాలయాల్లో రజినీకాంత్ ఫోటోలు చూసి శుద్ధ పూస అనుకున్నారా ఏంది..?!
అవునూ… అసలు కాపీ రైట్‌కూ ఈడీకి సంబంధం ఏమిటి..? అది ఆస్తుల్ని సీజ్ చేయడం ఏమిటి..? ఇదేనా డౌట్..? భలేవారండీ… అవన్నీ పట్టించుకుంటే దాన్ని ఈడీ అంటారా..? మోడీ అంటారా..?
Share this Article