.
Subramanyam Dogiparthi ………. జయసుధే ఈ గృహప్రవేశం సినిమాకు షీరో . చాలా గొప్పగా నటించింది . ముఖ్యంగా తనను మానభంగం చేసిన దుర్మార్గుడు ఉన్న జైలుకు తీసుకుని వెళ్ళమని జడ్జి గారింటికి వెళ్ళి ఆయనతో మాట్లాడే సీన్ అద్భుతం .
అంతకన్నా అద్భుతం మోహన్ బాబుని పెళ్ళికి ఒప్పించే సీన్ ఇంకా అద్భుతం . ఐ డోంట్ కేర్ అనే కేర్లెస్ ఫెలోతో బతుకు బేరం అద్భుతంగా ఆడుతుంది . అతనిని ఒప్పిస్తుంది . హేట్సాఫ్ టు జయసుధ . సావిత్రి , వాణిశ్రీల తర్వాత అంతటి నటి జయసుధే .
Ads
వివాహం అయ్యాక భర్తను తన దారికి తెచ్చుకునే క్రమంలో ఆవిడ నటన , ఇంట్లో ఉన్న వారిని రిపేర్ చేసే క్రమంలో ఇంటి అల్లుడిని సైతం చెంప చెళ్ళుమనిపించే సీన్లో నటన , వెరశి సినిమా అంతా జయసుధే . ఇంత బిగువయిన కధను నేసిన ప్రభాకరరెడ్డిని ముందుగా అభినందించాలి .
ఇంత బిగువు కధకు బిర్రయిన స్క్రీన్ ప్లే తయారు చేసుకుని దర్శకత్వం వహించిన బైరిశెట్టి భాస్కరరావుని అభినందించాలి . ఈ సినిమా ఘన విజయానికి మరో ప్రధాన కారకుడు మద్దిపట్ల సూరి . జయసుధ ప్రతిభను చూపే ప్రతీ సన్నివేశంలో డైలాగ్స్ చురకత్తుల్లాగా పదునుగా ఉంటాయి .
సత్యం సంగీత దర్శకత్వం ఈ సినిమాను గొప్ప మ్యూజికల్ హిట్టుని చేసింది . సుశీలమ్మ పాడిన శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మ అనే పాట ఎంత హిట్టయిందంటే వ్రతం అయ్యాక హారతికి అందరూ ఈ పాటనే పాడుతుంటారు . ఇది సినిమాలోని పాట అని కూడా జనం మరచిపోయి ఉంటారు . అలాగే మరో పాట జేసుదాసు పాడిన దారి చూపిన దేవతా కూడా బాగా హిట్టయింది .
అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో డ్యూయెట్ , సిరిదేవి సింగారి సిలకా పాట చాలా శ్రావ్యంగా ఉంటాయి . చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది . ఒక నువ్వు ఒక నేను అంతా బొమ్మలం పాట బాగుంటుంది . శ్రావ్యమైన పాటల్ని వ్రాసిన గోపి , జాలాదిలు , పాడిన బాలసుబ్రమణ్యం , జేసుదాసు , సంశీలమ్మలు అభినందనీయులు .
జయసుధ తర్వాత పీట మోహన్ బాబుదే . పైలా పచ్చీసుగా , జల్సారాయుడిగా , స్త్రీలోలుడిగా , మదరాయుడిగా, ఆ తర్వాత మారిన భర్తగా చక్కగా నటించాడు . ఇలాంటి పాత్రలకు పెట్టింది పేరుగా మారాడు . ఈ రెండు పాత్రల తర్వాత నాకు బాగా నచ్చిన పాత్ర జడ్జి రంగనాధుది .
అతిధి పాత్రలో కాసేపే కనిపించేదయినా సినిమాను మలుపు తిప్పే సీనులో మై చైల్డ్ అంటూ ఎంతో ఉదాత్తంగా , ఓ తండ్రిలాగా , మానవీయ దృక్పథంతో కనిపించే పాత్ర . నాకు బాగా నచ్చింది .
ఇతర ప్రధాన పాత్రల్లో ప్రభాకరరెడ్డి , యస్ వరలక్ష్మి , గుమ్మడి , పండరీబాయి , గిరిబాబు , సిల్క్ స్మిత , కవిత , సంగీత , ఈశ్వరరావు , రమణమూర్తి , రాజా , పి జె శర్మ , ప్రభృతులు నటించారు . ఎవరికి వారు అందరూ గొప్పగా నటించారు . చక్కని కుటుంబ కధా చిత్రం .
ఒక స్త్రీ యుధ్ధాలను , వినాశాన్ని ఆపగలదు ; కోపమొస్తే విధ్వంసాన్నీ సృష్టించగలదు అనే గొప్ప సందేశాన్ని ఇచ్చే సినిమా . తరచూ టివిలో కూడా వస్తుంటుంది . కాసేపయినా చూస్తుంటా . A watchable , feel good , family-oriented , neat and musical hit movie . యూట్యూబులో ఉంది . తప్పక చూడండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article