Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Guddi Gudda Boards… హిందీలో వోకే, తెలుగుకొచ్చేసరికి… Not Good…

October 12, 2024 by M S R

.

ఇంగ్లీషునే దేశ వ్యాప్తంగా అఫీషియల్‌గా ఉపయోగించాల్సిన అవసరం ఎందుకుందో.. ఇలాంటి బోర్డులే నిరూపిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ‘బేటీ బచావో బేటీ పడావో’ అనే స్కీమ్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ నెల ఆయా ప్రాంతంలో జన్మించిన బాలబాలికల జనాభాను తెలియజేస్తూ.. బోర్డుల మీద ప్రదర్శిస్తున్నారు.

ఇలా బాలబాలికల జనన రేటును జిల్లా స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు డిస్‌ప్లే చేస్తున్నారు. 2015లో తొలిసారి మహారాష్ట్రలోని జలగావ్‌ జిల్లాలో ఇలాంటి వివరాలను స్థానిక అధికారులు ప్రజలకు ప్రదర్శించారు. బాలబాలికల జనన సంఖ్యని ప్రదర్శించే బోర్డును స్థానిక భాషలో ‘గుడీ గుడా బోర్డ్’ అంటూ రాశారు. ఈ విధానం‌ నచ్చడంతో.. దేశమంతా ‘Guddi Gudda’ బోర్డు విధానాన్ని అమలు చేయాలని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ, ఆరోగ్య శాఖలు ఆదేశాలు జారీ చేశాయి.

Ads

gudda

ఇంకేముంది.. దేశమంతా Guddi Gudda పేరుతో అధికారులు బోర్డులు పెట్టేశారు. అది మన తెలుగు భాషలో బూతు టైప్‌లో ధ్వనిస్తోంది. బాలబాలికల జనన వివరాలు అని రాశారు. కానీ ఆ బోర్డుకు కేంద్ర ప్రభుత్వం పెట్టిన పేరునే కొనసాగిస్తున్నారు.

అయ్యా.. మోడీజీ.. విభిన్న భాషలు ఉన్న ఈ దేశంలో ఏదో ఒక భాషను దేశమంతా రుద్దితే ఇలాగే ఉంటది. అందుకే అందరికీ హాయిగా ఉండే ఇంగ్లీషు భాషలో బోర్డులు రాయించండి. ఇది హిందీ, ఇతర భాషలపై ద్వేషం కాదు. ఇలా Guddi Gudda తప్పులు జరగొద్దనే బాధ. అంతే..
PS : ఇవిగో కేంద్రం ఇచ్చిన ఆదేశాలు చూడొచ్చు……. జాన్ కోరా

beti

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వారసత్వమంటే బీజేపీకి పడదట… కానీ టీ-స్టేట్ కమిటీలో ఆరుగురు వాళ్లే..!!
  • కేసీయార్ స్కామ్స్ చూసీచూడనట్లు వదిలేయాలా… ఎందుకు..?!
  • నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఈ పచ్చి భారత వ్యతిరేకి పేరు వాపస్…
  • బరేలీ మార్కెట్‌లో పడిపోయిన ‘చెవికమ్మ’ దొరికింది… ఇదుగో ఇదే…
  • అప్పట్లో మహాబాహుబలి… ఆరుగురు ఎంపీలు… ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే…
  • పెద్ద దొరవారి ధరణి..! నిఖిల జగమూ నివ్వెరపోయే భారీ భూస్కాం..!!
  • 2 రోజుల్లో నలుగురు ప్రధానులు ఔట్… ఈసారి గ్రహణ బాధితుడు ఎవరు..?
  • శుభమాని ఇల్లు కొనాలంటే… ఈ బ్లూప్రింట్లు తగలేసే గోల ఏమిట్రా…
  • ఓరాకిల్ కాదు, మిరాకిల్..! ఒకే రోజులో 7.3 లక్షల కోట్లు పెరిగిన సంపద..!
  • నటన తెలియనివాళ్ల నుంచీ నటన పిండుకోవడం ఎలాగంటే..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions