‘గురూజీ గురూజీ అని నెత్తిన పెట్టుకుని మోశాం కదా… తనే కుర్చీ మడతపెట్టీ… –డురా’ … ఇదీ ఓ సగటు మహేశ్ బ్యాబు ఫ్యాన్ బాధ… నిజమే, మరీ ఈబాపతు సినిమా వదులుతారని ఎవరూ ఊహించలేదు… తనొక మాటల మాంత్రికుడట… మహేశ్ బాబుకు అత్తారింటికి దారేది, అల వైకుంఠపురంలో రేంజును మించి హిట్ ఇస్తాడని బోలెడంత ప్రచారం జరిగింది… తీరా చూస్తే ఢమాల్…
ఇదే మహేశ్ బాబుతో ఇదే త్రివిక్రమ్ అతడు, ఖలేజా సినిమాలు చేశాడు.., జయాపజయాలు ఎలా ఉన్నా, ఈరోజుకూ టీవీల్లో ఆ సినిమాలు వస్తుంటే ప్రేక్షకులు చూస్తున్నారు… మీకొకటి గుర్తుందా..? చిరంజీవి తన తమ్ముడి బొడ్డు బాపతు సీన్‌ను ఈమధ్య ఏదో సినిమాలో మరీ శ్రీముఖితో స్పూఫ్ చేశాడు… చిరంజీవి వీరాభిమానులు కూడా ఛీకొట్టారు… సినిమా ఢమాల్… నిజానికి స్టార్ హీరోలు ట్రెండ్స్ సెట్ చేయాలి, వాళ్ల సినిమాల్లోని క్రియేటివ్ డైలాగులు, పాటలు, సీన్లు సోషల్ మీడియాలో వైరల్ అయిపోవాలి…
కానీ ఇప్పుడొచ్చిన గుంటూరుకారం సినిమాలో ఆ నెక్కిలెసు పాట, ఆ కుర్చీ మడతబెట్టి పాట… త్రివిక్రమ్ మీద, థమన్ మీద జాలి కలిగించాయి… సోషల్ మీడియాలో, ఇతర సినిమాల్లో వైరల్ అంశాల్ని వీళ్లు స్పూఫ్ చేసుకోవడం ఏమిటి..? అసలు సూపర్ కాంబినేషన్… థమన్, త్రివిక్రమ్, మహేశ్‌బాబు, రమ్యకృష్ణ, రావురమేష్, సునీల్, జగపతిబాబు, మురళీశర్మ, ఈశ్వరిరావు, ప్రకాష్‌రాజ్‌లతోపాటు రీసెంట్ సెన్సేషన్ శ్రీలీల, కొత్త పోరి మీనాక్షి… వీళ్లే కాదు, రాహుల్, రవీంద్రన్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్… ఇండస్ట్రీ మొత్తం ఉంది సినిమాలో… దర్శకుడి దోస్త్ కదా, సునీల్ కూడా ఉన్నాడు… జస్ట్, ఉన్నాడు… ఇందరుంటే, తీరా చూస్తే సినిమాలోనే దమ్ము ఏమీ లేదు… కథ, కథనం మొత్తం పూర్ ప్రజెంటేషన్…
Ads
అసలు తల్లితో ఎలాంటి సంబంధం లేదని కొడుకుతో బాండ్ పేపర్ రాయించడం అనేదే సిల్లీ స్టోరీ లైన్… పైగా ఫలానా తల్లి కొడుకు ఫలానా అబ్బాయి అని పొలిటికల్‌గా ప్రచారం చేస్తే పెద్దగా నష్టం ఏముంటుంది..? అది పర్సనల్… పైగా పరువు తీయాలని అనుకునేవాళ్లు బాండ్ పేపర్లు చూసి ప్రచారం ఆపేస్తారా..? దుష్ప్రచారాల్ని బాండ్ పేపర్లు ఆపుతాయా..? అసలు త్రివిక్రమ్ బుర్రకు ఏమైంది..? అసలు మహేశ్ బాబు ఈ కథకు ఎలా కన్విన్సయ్యాడు…?
ఓహో, ఈ సినిమా ఔట్‌పుట్ చూశాక నిర్మాతలకు, ఈ సినిమా పెద్దలకు ఇది సంక్రాంతి సినిమాయా అనే డౌట్ వాళ్లకే వచ్చినట్టుంది… ఎలాగూ సైంధవ్, నాసామిరంగ సినిమాలకు పెద్ద బజ్ లేదు, ప్రేక్షకుల్లో పెద్ద ఆసక్తే లేదు, ఆ హనుమాన్ సినిమా మీద బజ్ ఏర్పడింది… అందుకే దాన్ని తొక్కేసి, మూణ్నాలుగు రోజుల్లో పండుగ గిరాకీని సొమ్ము చేసుకుని బయటపడే ప్లాన్ వేశారు, థియేటర్లన్నీ కబ్జా చేశారు… కానీ ఈ సినిమా చూశాక ప్రేక్షకుడికే కుర్చీ మడతపెట్టాలన్న చిరాకెత్తుతోంది…
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ జస్ట్, మహేశ్ బాబు మాత్రమే… డాన్సుల్లో కష్టపడ్డాడు, కొత్త లుక్కు, కొత్త డిక్షన్… తన వరకూ ఏ ఢోకా లేదు… కాకపోతే శ్రీలీల డాన్సులు ఇరగదీసింది… మహేశే చెప్పినట్టు ఆమెతో కలిసి డాన్సులు చేయాలంటే హీరోల తాట తెగిపోద్ది… కానీ నటనలో ఆమెలో ఇంకా ఆ ఆకర్షణ లేదు, బహుశా పాత్ర అలా ఏడ్వడం వల్లనేమో… కేవలం డాన్సుల పాత్రలే అంగీకరిస్తూ పోతే త్వరలో ఫేడవుట్ ఖాయం… మరో హీరోయిన్ మీనాక్షి ఉన్నాలేనట్టే… వాళ్లే కాదు, అసలు రమ్యకృష్ణను తప్ప దర్శకుడు మరెవరినీ సరిగ్గా వాడుకోలేదు…
రమ్యకృష్ణకు కూడా ఇలాంటి పాత్రల మొనాటనీ వచ్చేస్తోంది… నదియా అత్తను చూసిన ఫీల్ ఈ తల్లి రమ్యను చూస్తే రాలేదు… థమన్ పాటలు కాపీ,.. త్రివిక్రమ్ కథ కాపీ.., మీరు ఏమైనా పిలవండి ఈ సినిమాను బ్రహ్మోత్సవం అంటారా…? అజ్ఙాతవాసి-2 అంటారా..? మీ ఇష్టం… ఇంతకుమించి రాయడానికి కూడా ఏమీ లేదు సినిమాలో… ఇది మహేశ్ బాబు సినిమా, ఇది త్రివిక్రమ్ సినిమా అంటేనే నమ్మబుల్‌గా లేదు… పోనీ ఆ త్రివిక్రమ్ మార్కు డైలాగులైనా పడ్డాయా అంటే… అవీ పెద్దగా కనెక్టయ్యేలా లేవు..!!
Share this Article