Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!

May 12, 2025 by M S R

.

డిస్‌క్లెయిమర్… యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రతి పక్షమూ తాము ప్రత్యర్థిని ఇంత దెబ్బ తీశామని చెబుతుంది… ఎదుటోడు కూడా అలాగే చెప్పుకుంటాడు… అది సహజం… ఎలుక పిల్ల కూడా ఏనుగు తొండాన్ని ధ్వంసం చేశానని చెబుతుంది… కుందేలు సింహం మీసాలు గొరిగించాననీ చెబుతుంది…

సరే, పాకిస్థాన్ ఏదో చెబుతుంది, విజయం సాధించామని సంబరాలు చేయిస్తుంది వీథుల్లో… వాడు ఏమైనా చేయగలడు..? వాడికి పోయేదేముంది..? పోవడానికి సిగ్గూ లేదు, శరమూ లేదు… రాఫెల్ కూల్చేశాం తెలుసా అంటాడు… సో వాట్, రాఫెల్ ఓ యుద్ధ విమానం, నీ పరిధిలోకి ఎంటర్ అయినప్పుడు నీ క్షిపణికి దొరికి ఉంటుంది… అదేమైనా యుద్ధంలో అసాధారణమా..?

Ads

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి మాత్రమే కాదు… ఏకంగా పాకిస్థాన్‌లోకే మిసైళ్లను ప్రయోగించినట్టు మనమే అంగీకరిస్తున్నాం కదా…

కానీ బ్రహ్మోస్ కూల్చడం మాత్రం వాడి తరం కాదు… దాన్ని ఇంటర్‌సెప్ట్ చేయడం అసాధ్యం… వాడు ప్రయోగించే నాసిరకం టర్కీ డ్రోన్లు, చైనా మిసైళ్లు అన్నీ తుప్పాస్ కేటగిరీ… నాలుగైదు డ్రోన్లు బహుశా తప్పించుకోవచ్చునేమో గానీ మిగతావన్నీ మన ఎస్-400 కూల్చేసింది, అది పక్కా, నమ్మొచ్చు… ఎందుకు..?

పాకిస్థాన్ వాదనలకు ఫోటో ఆధారాలు లేవు, ఇండియా క్లెయిములకు ఫోటోలు, వీడియోలు ఆధారాలు చూపిస్తోంది… 9 కాదు, 21 ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేసేసింది… నిజం… అది వాడూ అంగీకరిస్తాడు… దాదాపు 11 ఎయిర్ బేసులను, రాడార్లను ధ్వంసం చేసింది… అదీ నిజం… వాడూ ఏడుస్తూ అంగీకరిస్తాడు…

ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలోకి దిగిన మాటా నిజం… రావల్పిండి తుక్కు రేగ్గొట్టింది అదే… ఎహె, ఇవన్నీ పక్కన పెడితే… రెండుసార్లు భూకంపం… ఈరోజు కూడా తాజాగా… అదే 4.6 సీస్మిక్ యూనిట్ల తీవ్రత… అది ప్రకృతి విపత్తు కాదని, పాక్ అణ్వస్త్రాల గోదాముకు ఇండియా తూట్లు పొడించిందనీ, అవి ఇక ప్రయోగానికి పనికిరావనీ, రేడియేషన్ కూడా లీక్ అవుతోందని కొన్ని వార్తలు…

అదే జరిగితే అద్భుతమైన విజయం కదా… యావత్ భారత జాతి దీపావళి చేసుకోవాలి కదా… మోడీ భాయ్ ఎందుకు చెప్పుకోవడం లేదు మరి అంటారా..? ఆ ఏడుపేదో వాడే ఏడవనీ అనుకున్నాడేమో… అమెరికా సైంటిస్టులు అర్జెంటుగా రేడియేషన్ కథేమిటో తేల్చడానికి వచ్చారనీ, బంకరులో దాక్కున్న ఆర్మీ చీఫ్ టన్నుల కొద్దీ బోరాన్ తెప్పిస్తున్నాడనీ బోలెడు కథనాలు…

ఎస్, ధ్రువీకరణ కష్టం… కానీ అర్జెంటుగా అమెరికా రంగప్రవేశానికి, రెండు భూకంపాలకు ఏదో లింక్ ఉంది… అది అణ్వస్త్రాల గోదాముకు పడిన తూట్లే కారణం కావచ్చు… అవునూ, ఐఎంఎఫ్ రుణం పక్కన పెడితే… ఏ స్థితిలోనూ అమెరికా ఇచ్చిన ఎఫ్-16 ఫైటర్లను ఇండియా మీద వాడొద్దు కదా, వాడాడు కదా… ఒకటి బ్లాస్ట్ చేశాం కదా… మరి అమెరికా ఏమీ అనదేమి..?

జరుగుతుంది… ఇండియా వైపున కూడా కొంత నష్టం జరుగుతుంది, యుద్ధం కాబట్టి… కానీ ఫుల్ అప్పర్ హ్యాండ్ సాధించే స్థితిలో ఈ యుద్దవిరమణ ఏమిటి..? ఈ ప్రశ్నకే ఇంకా జవాబు దొరకడం లేదు… బహుశా దొరకదేమో… రెండు దేశాల నడుమ మామూలు స్థితి నెలకొంటోంది… వాడి గాయాలు మానడానికే ఏళ్లు పడుతుంది…

అఫ్‌కోర్స్, ఆ తోక ఎప్పుడూ వంకరే, వాడు మారడు… ఎందుకంటే… ఆ ప్రభుత్వం సైన్యం చేతుల్లో… ఆ సైన్యం ఉగ్రవాదుల చేతుల్లో… ఆ ఉగ్రవాదుల మతం ఉన్మాదంలో… అవునూ, ఆ కొట్టిన దెబ్బలేమో మరో నాలుగు మరింత బలంగా కొడితే సరిపోయేదిగా అంటారా..? అవును, మోడీ ఎవరికీ అర్థం కాడు, అర్థమయ్యేలా ఎవరికీ ఏమీ చెప్పడు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీ రామజ్ఞానం ఎంత..? 108లో కనీసం 80 జవాబులు తెలిస్తే మీరు గొప్పే..!
  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions