Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అన్నదాతకు సంకెళ్లు… ఖచ్చితంగా ప్రభుత్వానికి మరక, మచ్చ..!!

June 19, 2025 by M S R

.

కొన్ని విషయాల్లో దిగువ స్థాయి అధికారులు, ప్రభుత్వ సిబ్బంది దాకా… పాలకుడి నుంచి స్పష్టమైన సందేశాలు, సంకేతాలు అందాలి… లేకపోతే ప్రభుత్వమే బదనాం అవుతుంది… ప్రత్యేకించి బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు…

నో డౌట్, రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ ముప్పేట దాడి చేస్తోంది… కేసీయార్ బయటికి రాకపోయినా, ప్రజాజీవితంలో లేకపోయినా… కేటీయార్, హరీష్‌రావు ఇద్దరూ ఆ గ్యాప్ ఫిలప్ చేస్తున్నారు… కవిత పక్కకు జరిగిపోయింది…

Ads

ఈ స్థితిలో రైతులకు సంకెళ్లు వేయడం అనేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరక, మచ్చ… ఎందుకంటే..? ఆల్రెడీ లగచర్ల, మూసీ కూల్చివేతలు వంటి అంశాల్లో బదనాం అయ్యింది… ఇప్పుడయితే ఏకంగా రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకుపోయారు…

ఎవరికైనా చివుక్కుమనిపించే ఫోటోలే అవి…

farmers వాళ్లు టెర్రరిస్టులా..? స్మగ్లర్లా..? కరడుగట్టిన నేరస్తులా..? మాయగాళ్లా..? ఎందుకు ఆ సంకెళ్లు… ఆల్రెడీ బెయిల్ వచ్చిందనీ ఓ సమాచారం… వాళ్లు పోరాటం చేస్తున్నారు… ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అని… ఆ నిరసన వాళ్ల హక్కు… వాళ్ల ఆందోళన… వాళ్ల వెనుక ఏ రాజకీయ పార్టీ మద్దతు ఉన్నా సరే, వాళ్లకు సంకెళ్లు వేయడం రైతాంగాన్ని అవమానించడమే…

రైతు భరోసా ఇస్తున్నావు, రైతు రుణ మాఫీ చేస్తున్నావు, సన్నాలకు బోనస్ ధర ఇస్తున్నావు… అప్పు పుట్టకపోయినా హామీలు నెరవేర్చుకోవడానికి నానా తిప్పలూ పడుతున్న ఈ దశలో ఇలాంటి తప్పులు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మైనస్…

farmers

ఉద్దేశపూర్వకంగా సహాయ నిరాకరణ చేసే ఉన్నతాధికారులపై, ఈరోజుకూ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నట్టుగా ఫీలయ్యే కీలకాధికారులపై కొరడా ఎత్తక ఉపేక్షించడం కూడా ఓ కారణమేనేమో… తప్పు చేస్తే వేటు పడుతుంది అనే బలమైన హెచ్చరిక ఏది..?

అఫ్‌కోర్స్, కేసీయార్ హయాంలో మిర్చి రైతులకు అవమానం జరగలేదా..? చంద్రబాబు హయాంలో అంగన్‌వాడీ మహిళల్ని గుర్రాలతో తొక్కించలేదా..? వంటి వాదనలు సమర్థనకు నిలవలేవు… అవీ తప్పే, ఇదీ తప్పే…

ఓ ఆర్ఎస్ఐ, మరో ఇద్దరు ఏఆర్ఎస్ఐలను సస్పెండ్ చేశామని ఎస్పీ చెబుతున్నాడు… కంటితుడుపు… ఏమీ ఒరగదు, జరగదు, నాలుగు రోజులకు మళ్లీ డ్యూటీ ఎక్కుతారు… అసలు ఆ సంకెళ్ల నిర్ణయం తీసుకున్న పెద్ద తలకాయ ఎవరిది..? తనను శిక్షించండి… ఇలాంటి సున్నితమైన విషయాల్లో ఆటోమేటిక్‌గా కొంతైనా సున్నితత్వం వస్తుంది…

ఎహె, పోలీసుల్లో సున్నితత్వం ఏమిటీ అంటారా..? అవసరమైన విషయాల్లో సున్నితత్వం లేకపోతే మీరే అనుభవిస్తారు అని చెప్పాలి కదా… చేతల్లో…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం జగన్… ఈ రఫారఫా నరుకుడు భాషేమిటో, ఈ సమర్థనేమిటో…
  • కేంద్ర సాహిత్య అకాడమీ యువ, బాల సాహిత్య పురస్కారాలు వీళ్లకు…
  • వర్తమాన సినిమా ప్రపంచంలో నిజంగానే ఇది ‘అరుదైన సరుకు’…
  • అక్కినేని అలా… కాంతారావు ఇలా… కాంట్రాస్టు జీవితాలు… డెస్టినీ…!!
  • అసలే చిరంజీవి… ఆపై రాఘవేంద్రరావు… ఆవేశంతో శారద… ఇంకేం..?!
  • అన్నదాతకు సంకెళ్లు… ఖచ్చితంగా ప్రభుత్వానికి మరక, మచ్చ..!!
  • దేనికీ టైమ్ లేదా…? పరుగు తీస్తున్నావా..? టైమ్ మింగేస్తుంది జాగ్రత్త..!!
  • గోదావరి- బనకచర్ల ఇష్యూ రాజకీయంగా రేవంత్‌రెడ్డికి కలిసి వస్తోంది..!!
  • పచ్చిపులుసు అంటేనే పచ్చిదనం… దాన్నలా పెంటదనం చేయకండి…
  • బంగారు బప్పీ…! సినీసంగీతంలో ‘గ్యాంగ్‌లీడర్’… ఆ ట్యూన్లంటే ఓ వెర్రి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions