Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వ్యాంప్ కాదు, హీరోయిన్ జ్యోతిలక్ష్మి… అదీ సూపర్‌స్టార్ కృష్ణ సరసన…

May 27, 2024 by M S R

Subramanyam Dogiparthi….   విఠలాచార్య- NTR కాంబినేషన్లో సినిమా ఎలా అయితే పరుగెత్తుతుందో , కృష్ణ- KSR దాస్ కాంబినేషన్లో సినిమా కూడా అంతే . NTR- విఠలాచార్య కాంబినేషన్లో 19 సినిమాలు వస్తే , కృష్ణ- దాస్ కాంబినేషన్లో ఏకంగా 30 సినిమాలు వచ్చాయి .

.

ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు కధ ఇది. తర్వాత కాలంలో 150 సినిమాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావు ఈ సినిమాకు డైలాగులు వ్రాసారు . 1972 లోనే అంటే ఈ హంతకులు దేవాంతకులు సినిమా వచ్చిన సంవత్సరం లోనే దాసరి డైలాగ్స్ రైటర్ అవతారం ఎత్తారు .

Ads

.

పుణ్యవతి సినిమా ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైన జ్యోతిలక్ష్మి మొదటిసారిగా హీరోయిన్ గా నటించింది ఈ సినిమాలోనే . జ్యోతిలక్ష్మి అనగానే మనకు ప్రధానంగా వ్యాంప్ డాన్సులు మాత్రమే కనిపిస్తుంటాయి కదా సినిమాల్లో… మొదట్లో అన్నిరకాల కేరక్టర్స్ చేసేది… ఆమెదే ఈ సినిమాలో ప్రధాన పాత్ర…

.

నాగేష్ కూడా ప్రధాన పాత్రలో కనిపిస్తాడు . ఇంకా కృష్ణంరాజు విలన్ గానే కొనసాగుతున్నాడు అప్పటికి . కాస్త మోసగాళ్ళకు మోసగాడు వాసన కనిపిస్తుంది . టైటిల్ డిజైనింగ్ స్టయిల్‌తో సహా… ఒక సినిమా సూపర్ బంపర్ హిట్ అవుతే దాన్ని అనుకరించే రొటీన్ సినిమాలు కొన్ని వరుసగా వస్తుంటాయి… అది ఆనాటి నుంచీ ఉన్నదే…

.

యల్ ఆర్ ఈశ్వరి మార్క్ పాటలు , జ్యోతిలక్ష్మి మార్క్ డాన్సులు , చేజింగులు , జ్యోతిలక్ష్మి ఫైటింగులు , మసాలా అంతా ఉంటుంది సినిమాలో . కృష్ణ , కృష్ణంరాజు ఇద్దరూ చాలా అందంగా కనిపిస్తారు . వాళ్ళిద్దరి ముందు నటీమణులే తేలిపోతారు .

.
సత్యం సంగీత దర్శకత్వంలో పాటలన్నీ థియేటర్లో శ్రావ్యంగానే ఉంటాయి . బయట హిట్ అయినట్లు లేదు . మూస సినిమాయే . ఓ రాజు గారి వద్ద కోట్లు చేసే కిరీటం ఉంటుంది . దానిని కాజేయటానికి కృష్ణంరాజు , సత్యనారాయణ , రాజసులోచన కష్టపడుతుంటారు .
.
ఆ రాజు గారికి ముగ్గురు కుమార్తెలు . ఫైటర్స్ కూడా . వారిలో హీరోయిన్ జ్యోతిలక్ష్మి , పాపులర్ డాన్సర్ జయకుమారి ఉంటారు . ఇద్దరికీ వారి మార్క్ డాన్సులు ఉన్నాయి . మన హీరో కృష్ణ CBI ఆఫీసర్ . ఇప్పటి CBI ఆఫీసర్ వంటి CBI ఆఫీసర్ కాదండోయ్ . ఎవరినయినా తన్ని , అరెస్ట్ చేసే CBI ఆఫీసర్ అన్న మాట .
.
వీరందరితో పాటు త్యాగరాజు , నిర్మల , ముక్కామల ప్రభృతులు నటించారు . కాలేజీ రోజుల్లో ఇలాంటి సినిమాలు ఎక్కువగా చూసే వాళ్ళం . ఏ థియేటర్లో చూసానో గుర్తు లేదు… ! సినిమా యూట్యూబులో ఉంది . కృష్ణ , జ్యోతిలక్ష్మి అభిమానులకు నచ్చుతుంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దిల్ కా దడ్‌కన్ రకుల్‌కు ఏమైంది..? మెడపై ఆ ప్యాచ్ ఏమిటి..?
  • మై డియర్ ఆర్కే… సలహాలు తీసుకునే స్థితిలో వాళ్లున్నారా అసలు..?!
  • మోకాలిలో బుర్ర కాదు గానీ…. మోకాలి కింద మాత్రం గుండె ఉంటుంది..!!
  • అవును, ఈ దర్శకుడు ఓ సూపర్ హీరోయిన్‌తో ఓ ‘కొత్తలోక’ చూపిస్తున్నాడు…
  • మంజువాణి ఇంటిలో మేజువాణీ… రాతిరంతా ఇక్కడే రాజధాని…
  • జూదం, మద్యం… వీటికన్నా రీల్స్, షార్ట్స్ డేంజరస్… ఇక మీ ఇష్టం…
  • రాజకుటుంబం… బోల్డ్ పాత్రలు, వివాదాలు… ఈమె కథే కాస్త డిఫరెంటు…
  • బ్లాస్టింగ్ కుట్ర కాదు… అసలు కాళేశ్వరం కుట్ర ఏమిటో బ్లాస్టింగ్ నిజాలు…
  • మోహన్‌ లాల్‌లోని ఆ నిజనటుడికి ‘హృదయపూర్వ’క అభినందన..!!
  • తెలుగు ఇండియన్ ఐడల్…! ఈ బుగ్గలు పిండే టాస్కులేంటి థమన్..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions