.
కేసీయార్ ఇంట్లో పడుకున్నా సరే… కవిత సమూలంగా పార్టీ ఇజ్జత్‌ను దేవుతున్నా సరే… అనవసరంగా కేటీయార్, హరీష్ ఆరాటపడిపోయి, ఆత్రపడిపోయి, ఏవేవో పిచ్చి విమర్శలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, తన మీద ఏవేవో అవాకులు చవాకులు, అబద్దాలు మాట్లాడుతూ ఉండవచ్చుగాక…
ఎస్, అనవసరం… ఈ తొందరే అనర్థం… కేసీయార్ ఆలోచనే కరెక్టు, ఇంటికాడ పండుకుందాం… కాంగ్రెసోళ్లు వాళ్లంతట వాళ్లే అధికారాన్ని మనకు తీసుకొచ్చి వెండి పళ్లెంలో పెట్టి అందిస్తారు అనేదే కదా తను ఇంటికాడ పండుకునే మార్మిక ఆలోచన…
Ads
అవును, నిజమే…, కేసీయార్ ఆలోచనే నిజం… వందల కోట్లతో బీఆర్ఎస్ అబద్ధాల ప్రాపగాండా కూడా అవసరం లేదు… హరీష్, కేటీయార్ అంగీలు చింపుకునే పని కూడా లేదు… కాంగ్రెసోళ్లది హరాకిరి బ్యాచ్ో… అంటే, వాళ్లంతట వాళ్లే సూసైడ్ చేసుకుంటారు, వేరే ఎవడికీ హతమార్చే చాన్సే ఇవ్వరు…
హైకమాండ్ దగ్గర నుంచి దిగువ చిన్న కార్యకర్త దాకా సేమ్ సేమ్… మొత్తం హరాకిరీ బ్యాచ్… ఏయ్, సీఎం పోస్టు ఇస్తున్నాం గానీ ఫలానా సీనియర్ మంత్రుల శాఖల జోలికి వెళ్తే మర్యాద దక్కదు అని హుకుం జారీ చేస్తుంది… మరి సీఎం పోస్టు దేనికి..? హైకమాండ్ అవసరాలు తీర్చడానికా..? సీఎం పోస్టును అవమానించడం కాదా..? చివరకు మంత్రుల శాఖల్ని కూడా ఢిల్లీయే చూడాలా..?
ఆహా… ఈ సోకాల్డ్ హైకమాండ్‌ను నోట్ల కట్టలతో కొట్టి, వంగబెట్టిన వైఎస్ గ్రేట్ అనిపిస్తోంది… ఆమె మీనాక్షి నటరాజన్… తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జే గానీ… హైకమాండ్ అనే అనుకుని ఆదేశాలు జారీ చేస్తుంది… అధికారిక సమావేశాల్లో కూర్చుకుంటుంది… అధికారిక సమావేశాలు కండక్ట్ చేస్తుంది… సమీక్షలు చేస్తుంది… చివరకు తనకు ఎవరో వోటు వేసినట్టు, తనను తెలంగాణ సమాజం గుర్తించినట్టు… పాదయాత్రలు… పరమ వికారం… అచ్చం మీనాక్షి షర్మిల అనుకునేట్టు..!
అయిపోలేదు… సమంత, నాగార్జున, నాగచైతన్య ఫోన్ ట్యాపింగ్ విషయంలో కొండా సురేఖ మాటలేమిటి..? ఆ సంస్కారం చూసి తెలంగాణ సమాజమే విస్తుపోయింది… ఇంకా వైసీపీలో ఉన్నాను అనుకుంటున్నట్టుంది ఫాఫం… జనంలో పార్టీ ప్రతిష్ట పలుచన అయిపోయింది…
https://www.facebook.com/reel/24680280074967001
తాజాగా పొన్నం ప్రభాకర్ తన సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీద చేసిన కించపరిచే వ్యాఖ్యలు మరీ దారుణం… పొన్నం నిజానికి మరీ దిగువ స్థాయి ఎన్ఎస్‌యూఐ నుంచి ఎదిగిన కేరక్టర్, తనకు ఎస్టీ కులాల నేతలపై ఈ చిల్లర వ్యాఖ్యలేమిటి..? (ఇంకెవరో కాంగ్రెస్ నాయకుడు నిన్నో మొన్నోొ పొన్నం ఏమైనా హైకమాండ్ అనుకుంటున్నాడా అని విరుచుకుపడ్డాడు జుబిలీ హిల్స్ టికెట్టు విషయంలో…)
అన్నింటికన్నా దుర్మార్దం, తను ఈ తిక్క వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మరో ఎస్సీ మంత్రి తన పక్కనే ఉన్నాడు… అభ్యంతరపెట్టలేదు… పొన్నంకు, అడ్లూరికి సాన్నిహిత్యం ఏందేమోలో అనుకున్నారు మొదట్లో జనం… కానీ ఇప్పుడు అడ్లూరే పొన్నం వ్యాఖ్యలకు తీవ్ర అభ్యంతరం చెబుతున్నాడు… పొన్నం క్షమాపణ చెప్పడం బెటర్… (ఇది రాసే సమయానికి అదేమీ లేదు)…
ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే…. అనవసరంగా బీఆర్ఎస్ క్యాంపు వందల కోట్లు ఖర్చు పెడుతూ ప్రయాస పడనక్కర్లేదు… కాంగ్రెస్ పార్టీ అంటేనే అదొక హరాకిరీ బ్యాచ్… వాళ్ల పతనాన్ని వాళ్లే శాసించుకుంటారు… ఫాఫం, పొన్నం వర్సెస్ అడ్లూరి వంటివి మీనాక్షికి కనిపించవు.,.. ఆమె కళ్లు మూసుకునే రాష్ట్రంలో తిరుగుతూ ఉంటుంది ఫాఫం..!!
Share this Article