Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ పాత్రల పేర్లను దిల్‌రాజు కూడా చెప్పలేడు… ఇనుప గుగ్గిళ్లు…

September 26, 2022 by M S R

అదుగదుగో వచ్చేస్తోంది… మరో భారీ సినిమా… తమిళంలో, తమిళకోణంలో, తీయబడిన ఓ తమిళ చరిత్ర… పొన్నియిన్ సెల్వన్… ఈ సినిమా మీద కొన్ని ముచ్చట్లు చెప్పుకున్నాం కదా… ఇది పేరుకు తమిళకథే అయినా సరే, తెలుగు ప్రాంతాల్లో షూటింగ్ చేశాం కాబట్టి తెలుగు కథే, ఆదరించండి అని సుహాసిని అప్పీల్ చెప్పుకున్నాం… ఈ సినిమా దిల్ రాజు బిడ్డ అని అప్పగింతలు పెట్టిన తీరూ గమనించాం… అదేసమయంలో సినిమాలోని పాత్రల పేర్లు గనుక దిల్ రాజు చెప్పగలిగితే… సినిమా చూడకపోయినా సరే, టికెట్టు ధరను ఫోన్ పే చేయడంలోె తప్పేమీ లేదని కూడా సెటైర్లు వేసుకున్నాం కదా…

నిజం… ఆ పాత్రల పేర్లు తమిళులకేమోగానీ… తెలుగు, ఇతర భాషల ప్రేక్షకులకు ఇనుప గుగ్గిళ్లే… మనం కనిమొళి అని రాస్తున్నాం కదా… అందులో ళ అనేది నిజానికి కరెక్టు ఉచ్ఛారణ కాదు… తమిళులు దాన్ని ఉచ్ఛరించే రీతిలో రాయగలిగే అక్షరం తెలుగు వర్ణమాలలో లేదు… అలాగే Pukhazhenthi  పేరును మనం పుహళేందిగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాం… ఆ చర్చలోకి ఇక్కడ లోతుగా పోలేం గానీ… తమిళులకు ఇట్టే జీర్ణమయ్యే అక్షరాలు, పదాల్ని మణిరత్నం ఎలా పలికించాడో మరి…

Ads

ఈ సినిమాకు ఆధారమైన, కల్కి కృష్ణమూర్తి రాసిన అయిదు సంపుటాల మహాగ్రంథంలోని కీలకపాత్రల్ని ఒక్కసారి చూద్దామా… ఒకసారి మొత్తం చదివాక మీరు కాసేపు సుప్తచేతనావస్థలోకి జారిపోయే ప్రమాదం కూడా ఉంది… జాగ్రత్త… (వీటి సరైన ఉచ్ఛరణ మనకు తెలియదు… మనకు అలవాటైనట్టుగా తెలుగులోనే రాసుకుందాం… కనిమొళి, పుహళేందిలాగా…)

గండరాదిత్యుడు (సుందరచోళ చక్రవర్తికి పెదనాన్న), శెంబియన్ మహాదేవి (సుందర చోళుడి పెద్దమ్మ)
మధురాంతకుడు (సుందరచోళుడి పెదమ్మ, పెదనాన్నల కొడుకు, అంటే కజిన్)

 

సుందర చోళ చక్రవర్తి, వాణమహాదేవి, వీళ్ల పిల్లలు కుందవై, ఆదిత్య కరికాళన్, రాజరాజచోళుడు
చోళ సామ్రాజ్య ముఖ్యమంత్రి : అనిరుద్ధ బ్రహ్మరాయలు

 

చోళ సామ్రాజ్య సేనాధిపతి : కొడుంబాళూరుకి చెందిన పెద వేళార్

 

యువరాకుమారి కుందవై చెలికత్తె (సేనాధిపతి పెద వేళార్ తమ్ముడైన చిన వేళార్ కూతురు): వాణతి

 

చోళ సామ్రాజ్య కోశాధికారి : పెద పళువేట్టరయ్యర్

 

తంజావూరు కోట దళపతి :చిన పళువేట్టరయ్యర్

 

ముఖ్యమంత్రి గూఢచారి : ఆళ్వార్ కట్టియన్ నంబి (ఇంకొక పేరు తిరుమళై)

 

శంబువరయ్యర్ : కడంబూర్ నగరంలో ఒక చోళ రాజ్యపు ప్రముఖుడు

 

శంబువరయ్యర్ కొడుకు, కూతురు : గందమారన్, మణిమేఖల

ఇవైతే కథాగమనానికి కీలకపాత్రలు… ఏయే పాత్రలకు ఏయే ఆర్టిస్టుల్ని తీసుకున్నారో కూడా రాస్తే లంబాచోడా అయిపోతుంది, కాబట్టి ఇక్కడ ఆపేద్దాం… ఇంతకీ పొన్నియిన్ సెల్వన్ పేరుకు అర్థం తెలుసా మీకు..? పొన్ని అనేది కావేరీ నదికి మరోపేరు… సెల్వన్ అంటే కొడుకు… ఒకసారి సుందర చక్రవర్తి రెండో కొడుకు రాజరాజచోళుడు కావేరీ నదిలో పడి, మునిగిపోతుంటే, కావేరీ తల్లే అతడిని కాపాడిందని అంటారు… అందరూ అందుకే తనను పొన్నియిన్ సెల్వన్ అని పిలిచేవారు… తన కథే ఈ సినిమా…

Ads

(Quora నుండి సేకరణ… వాత్సల్య గుడిమళ్ళ సమాధానం ప్లస్ సమాచారం…)

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • పర్లేదు… బలమైన ఎమోషన్స్ పలికించే ఆ పాత నాని మళ్లీ కనిపించాడు…
  • సీఎం రేవంత్‌కు ఫామ్‌హౌజ్ పంపిస్తున్న ప్రమాదసంకేతాలు ఏమిటంటే..?
  • చలికాలంల సర్వపిండిదే సౌభాగ్యం… ఉల్లి కొత్తిమీర గుమగుమలతో ఊరిస్తది.
  • రేవంత్ టీంలో ఉంటాడో లేదో తెలియదు… కానీ ఐటీ మినిస్ట్రీకి ఆప్ట్ ఎమ్మెల్యే…
  • సాయిపల్లవి… ఆగీ ఆగీ… ఒకేసారి మూడు పాన్ ఇండియా మూవీస్…
  • టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్… నిజానికి రేవంత్‌రెడ్డి ఎవరి మనిషి..?!
  • నిజమే… అతడు ఓడిపోతున్నాడు… ఈ లోకం నుంచే వెళ్లిపోతున్నాడు…
  • హై హై నాయకా… మాయాబజార్ ఘటోత్కచుడిని చేసేశారా..?
  • తీరొక్క తీపి..! స్వీట్ల జాతర..! మధుమేహులు కుళ్లుకునే విందు…!
  • వచ్చిన రెడ్ల రాజ్యంలోనే వెలమ ఎమ్మెల్యేలు ఎక్కువ… 13 మంది…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions