.
హరీష్ రావు అంటే నాకు కాస్తో కూస్తో పాజిటివ్ ఫీలింగ్ ఉండేది… రబ్బర్ చెప్పులు వేసుకునే సిట్యుయేషన్ నుంచి వందల కోట్లకు ఎదిగిన ఓ సక్సెస్ స్టోరీ అని, ఎంత దండుకున్నాసరే, ఆ సోకాల్డ్ బీఆర్ఎస్ పార్టీలో … ఓ క్రైసిస్ మేనేజర్ అని… కాస్త పార్టీ కేడర్ ఆమోదం ఉన్న లీడర్ అని…
ఏమో, సంపాదన వేల కోట్లేమో… ఎక్కడి నుంచి వచ్చాయీ అనే ప్రశ్న, జవాబులు, వివరణలు కాసేపు పక్కన పెడదాం… అన్నా, హరీషన్నా… నువ్వు కేటీయార్ కాదు, వారసుడివీ కాదు, ఎన్నడూ కాలేవు… దాస్యం తప్ప నీకేమీ దిక్కు కాదు…
Ads
పార్టీ మొత్తం నిన్ను కోరుకున్నా సరే నువ్వు బీఆర్ఎస్ వారస అధ్యక్షుడివీ కాలేవు… ముఖ్యమంత్రివీ కాలేవు… నీ సన్నిహితురాలు, సాక్షాత్తూ కేసీయార్ బిడ్డ కవితకే దిక్కతోచక కిందామీదా పడుతోంది… నువ్వెంత..?
కానీ ఎందుకలా ఓవరాక్షన్..? ఏం ఇస్తాడు నీకు నీ మామ..? నాలుగుసార్లు పక్కన పెట్టాడు… ఇప్పుడూ పాశమైలారం విషాద దుర్ఘటనపై అంత ఆగమేఘాలపై అక్కడికి వెళ్లి… ఛట్, ప్రభుత్వ వైఫల్యం అంటున్నావు…
నిజానికి విపత్తులు, దుర్ఘటనల వేళల్లో దిక్కుమాలిన నేతలు అక్కడికి వెళ్లడం అంటేనే దుర్మార్గం… ఆ దుర్ఘటనలను మించిన వైపరీత్యం… ఏం చేస్తారు మీరు అక్కడ..? సహాయక చర్యల్లో అధికారులకు అడ్డుపడటం తప్ప… పరమ దుర్మార్గం… ఆ సోయి, ఆ పరిణతి లేదం హరీషూ…
ఎక్కడ హరీష్ రాజకీయంగా వాడుకుంటాడో అని హరీష్‌కన్నా ముందే మంత్రులు వివేక్, రాజనర్సింహ అర్జెంటుగా వెళ్లారు… చివరకు రేవంత్ రెడ్డీ వెళ్లాడు… కోటి రూపాయల పరిహారం ప్రకటించాడు కూడా… హరీష్ ఒక్క సమాధానం కావాలి నీ నుంచి…
ఏం సంపాదించావ్, ఎలా సంపాదించావ్ అనే కోణంలో కాదు… కొండగట్టు బస్సు ప్రమాదంలో 50 పైచిలుకు మంది దుర్మరణం పాలైతే… నీ మామ… కేసీయార్ పరామర్శ లేదు, పరిహారం లేదు… అత్యంత దుర్మార్గపు సీఎం అనిపించుకున్నాడు కదా… నువ్వూ కిక్కుమనలేదు కదా…
ఇప్పుడు స్పందించు ఈ కోటి రూపాయల పరిహారం మీద… నీ మామ కేసీయార్‌కన్నా రేవంత్ బెటరా కదా… సిద్దిపేట ప్రజల మీద, పోనీ, వోటర్ల మీద వొట్టేసి చెప్పు హరీషూ… డొంకతిరుగుడు మాటలు, పిచ్చి వక్ర బాష్యాలు కాదు… ఇంకా ఇంకా మీ మామ కేసీయార్ పాదసేవ కాదు… మనిషిగా… ఓ ప్రజానాయకుడిగా స్పందించు హరీషూ..!!
కేటీయార్‌ను వదిలెయ్, తను పీపుల్స్ లీడర్ కాడు, రియాలిటీలో నీకు పోటీ కూడా కాదు… నిన్ను నీ పార్టీ కేడర్, తెలంగాణ జనం కాస్త భిన్నంగా, కాస్త రీజనబుల్ కేరక్టర్‌గా చూస్తోంది కాబట్టి…!! చివరగా… నువ్వు పాలించిన నీ పాత మెదక్ జిల్లాలోనే కదా పాశమైలారం ఉన్నది… పదేళ్లు ఏం చేశావు హరీషూ..!! నువ్వూ, నీ మామ కేసీయారూ కొండగట్టు బస్సు ప్రమాద పరిహారాలు ఏమిచ్చారో ఓసారి గుర్తుకుచేసుకో… జీవితమంటే రాజకీయమే కాదు, కాసింత మానవత్వం కూడా..!!
Share this Article