.
కల్నల్ సోఫియా ఖురేషి… ఆపరేషన్ సిందూర్‌లో చరిత్ర సృష్టించిన వీర మహిళ… అంటూ దేశం యావత్తూ ఓ మహిళకు సెల్యూట్ చేస్తోంది… ఎవరామె..?
భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేపట్టి, కేవలం 25 నిమిషాల్లో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది తెలుసు కదా…
Ads
ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ప్రెస్ బ్రీఫింగ్‌లో ఇద్దరు మహిళా అధికారులు అందరి దృష్టిని ఆకర్షించారు… కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్…
సోఫియా ఖురేషి… ఒక సాహసవంతమైన జీవన యాత్ర
1981లో గుజరాత్‌లోని వడోదరలో జన్మించిన సోఫియా ఖురేషి, చిన్నప్పటి నుండే దేశ సేవ పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించింది. ఆమె తాత ఇండియన్ ఆర్మీలో సేవలందించగా, తండ్రి కూడా కొన్ని సంవత్సరాలు సైన్యంలో పనిచేశాడు… ఈ సైనిక నేపథ్యం సోఫియా జీవితంపై గాఢమైన ప్రభావం చూపింది.
బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సోఫియా, విద్యా రంగంలో ఉన్నత స్థాయి నైపుణ్యాలతో సైన్యంలో చేరే నిర్ణయం తీసుకున్నారు. సోఫియా వ్యక్తిగత జీవితం కూడా ఆసక్తికరం. ఆమె భర్త భారత సైన్యంలోని మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నట్లు ఇంగ్లీష్ మీడియా నివేదికలు తెలిపాయి… సైనిక కుటుంబం నుండి వచ్చిన సోఫియా, తన వృత్తిలోనూ అదే క్రమశిక్షణ మరియు అంకితభావాన్ని ప్రదర్శించింది…
సోఫియా ఖురేషి 1999లో భారత సైన్యంలో చేరింది… ప్రస్తుతం ఆమె సిగ్నల్స్ కార్ప్స్‌లో లెఫ్టినెంట్ కల్నల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సిగ్నల్స్ కార్ప్స్‌లో ఆమె పాత్ర కమ్యూనికేషన్ వ్యవస్థలను నిర్వహించడం, సైనిక ఆపరేషన్లలో కీలకమైన సమాచార వినిమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం…
సోఫియా కెరియర్‌లో అనేక మైలురాళ్లు ఉన్నాయి. 2006లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో ఆమె ఆరు సంవత్సరాల పాటు సేవలందించింది… ముఖ్యంగా కాంగోలో జరిగిన మిషన్‌లో ఆమె కీలక పాత్ర పోషించింది…
2016లో పూణేలో జరిగిన ‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18’ అనే అంతర్జాతీయ సైనిక విన్యాసంలో సోఫియా చరిత్ర సృష్టించింది… ఈ కార్యక్రమంలో 18 దేశాల సైనిక బృందాలు పాల్గొనగా, సోఫియా భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారి కావడం విశేషం. ఈ విన్యాసంలో ఆమె ఒక్కరే మహిళా నాయకురాలు కావడం ఆమె సామర్థ్యానికి నిదర్శనం…
సామాజిక ప్రభావం, ప్రేరణ…
కల్నల్ సోఫియా ఖురేషి కేవలం ఒక సైనిక అధికారి మాత్రమే కాదు, ఆమె ఒక స్ఫూర్తి… సైన్యంలో మహిళలు అత్యంత సవాళ్లను ఎదుర్కొని ఉన్నత స్థానాలకు చేరుకోగలరని ఆమె నిరూపించింది… ఖురేషి ఒక సాధారణ సైనికురాలు కాదు; ఆమె ధైర్యం, నాయకత్వం, అంకితభావానికి ప్రతీక… ఎ ట్రూ ఇండియన్ సోల్జర్…
ఇప్పుడు జాతికి కావల్సింది ఇలాంటి నిజమైన భారత మహిళలు… అంతేతప్ప ఉగ్రవాదానికి సపోర్టుగా నిలిచే కుళ్లిన మెదళ్లు కాదు…!!
Share this Article