నిజానికి సుమ, అనసూయలతో పోలిస్తే రష్మి కొంత డైనమిక్, ఫెయిర్, స్ట్రెయిట్… ఏదైనా మాట్లాడితే డొంకతిరుగుడు, దాపరికం, మార్మికం మన్నూమశానం ఏమీ ఉండవు… ఫటాఫట్ అనేస్తుంది… స్నాక్స్, మీల్స్ వివాదంలో మీడియాకు క్షమాపణ చెప్పకుండా ఉండాల్సింది సుమ… ఎవరో ఓ జర్నలిస్టు ఏదో అంటాడు, దాంతో భయపడిపోవడమేనా అంత సీనియర్ హోస్ట్… ఇలాగైతే ప్రతి మీడియా మీట్‌లో ఆడేసుకుంటారు…
ఇక అనసూయ మొత్తం టూమచ్… ఆంటీ అని పిలిచినా కేసులు పెట్టేస్తానని ఎగురుతుంది… మొగడితో మూతి ముద్దులు, బికినీ డ్రెస్సుల విహారాలు ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తే తప్పేమిటని ఈమధ్య ఎవరినో గద్దించింది… ఇన్‌స్టా అనేది పబ్లిక్ డొమెయిన్ అనే సోయి లేనట్టుంది ఆమెకు… సరే, తనకు ఏదో ఒక ప్రచారం కావాలి కాబట్టి ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని తనే గెలుక్కుంటుంది అనుకుందాం… కానీ రష్మి అలా కాదు…
ఆమె ఏమన్నది… అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఓ ట్వీట్ చేసింది… ‘‘సీతారాములు మళ్లీ వచ్చేస్తున్నారు, ఇక ఏటా రెండు దీపావళి పండుగలు… నేను ఓ కాషాయ చీరెతో పూజకు రెడీ అయిపోతున్నా, చలో దీపాలు వెలిగిద్దాం’’… కేరళలో సింగర్ చిత్ర మీద ఇదుగో ఇలాంటి పోస్టే పెట్టినందుకు భీకరంగా ట్రోల్ చేశారు… ఆమె తత్వాన్ని బట్టి ఆమె సైలెంటుగా ఉండిపోయింది, కానీ రష్మి అలా కాదు కదా… ఫటాఫట్ ఇచ్చి పడేసింది…
Ads
ఎవరో నెటిజన్ ‘కాషాయం చీరె కట్టుకుని అన్నీ లంగా పనులు చేయండి, తరువాత — అనండి, లంగా పనులన్నీ తుడిచి పెట్టుకుని పోతాయి’ అని కూశాడు… ఎవరో ట్రోలర్ ఏదో రాస్తే ఆమె పెద్దగా పట్టించుకోదు, కానీ ఆ కామెంట్ బాగా డిస్టర్బ్ చేసినట్టుంది… నిజంగానే అది ద్వేషం నిండిన కామెంట్…? అందుకే ఇక ఇచ్చి పడేసింది… ‘‘నేనేమైనా బిల్లులు ఎగ్గొట్టానా..? నా కుటుంబం బాధ్యత నుంచి పారిపోయానా..? మా పేరెంట్స్‌ను రోడ్లపై వదిలేశానా..? టాక్సులు ఎగ్గొట్టానా..? చట్టవ్యతిరేక పనులు చేస్తున్నానా..? నామీద ఏమైనా ఆరోపణలున్నాయా..? అసలు లంగాపనులు అంటే ఏమిటి..?
Have I not paid my bills or not taken responsibility of my family
Have I left my parents on the roads to fend for themselves
Have I not paid my taxes ?
Am I doing any illegal activities
Have I been charged for anything
What exactly is LANGA PANILU
I have been seeing these… https://t.co/Y0k5kv1AbQ— rashmi gautam (@rashmigautam27) January 23, 2024
సూటిగా అడిగింది తను… నేను ఏం తప్పుడు పనులు చేస్తున్నాను అని..? ఆమె చెప్పినవే నిజమైన లంగా పనులు అని తేల్చిపడేసింది… నిజంగానే ఆమె జంతుప్రేమికురాలు, దైవం పట్ల విశ్వాసి… ఆమె యాంకరింగ్ చేస్తున్న ఎక్సట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆమె వెకిలిగా ఏమీ వ్యవహరించదు… అఫ్‌కోర్స్, గతంలో కొన్ని బోల్డ్ సినిమాలు చేసి ఉండవచ్చు… అది ఆమె వృత్తి… ఒక పరిమితి మేరకు పర్మిషబులే… కరోనా లాక్ డౌన్ పీరియడ్ లో కూడా రోజూ స్ట్రీట్ డాగ్స్ కు ఆహారం పెట్టేది…
ట్రోలింగ్ స్టార్టయిందంటే ఇక కామెంట్లలో ఒక్కొక్కరు రెచ్చిపోతారు… ఇష్టారాజ్యంగా వ్యాఖ్యానాలకు దిగుతారు… పోస్టు సొంతదారు స్పందిస్తే ఇంకా ఎక్కువ అవుతుంది… ఇక్కడ ఆమె రాముడి పట్ల భక్తిని ప్రదర్శించింది కాబట్టి ఒక సెక్షన్ ఆమెకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుని ఇలా దాడికి దిగింది… కానీ ఆమె భక్తి, ఆమె విశ్వాసం ఆమె ఇష్టం… ఎవరికైనా ఆక్షేపణ ఎందుకు ఉండాలి..? పెద్ద పెద్ద సెలబ్రిటీలు, వీఐపీలు ఏకంగా అయోధ్య ప్రాణప్రతిష్ఠకే హాజరయ్యారు కదా… వాళ్ల ముందు రష్మి ఎంత..? పిచ్చుక మీద ఈ బ్రహ్మాస్త్రాలు ఏమిటి..?
Share this Article