పోస్టుల పేర్లు వేరు… చేసిన కొలువుల హోదాలు వేర్వేరు… వర్తమాన హోదాలు వేర్వేరు… కానీ పాకిస్థానీ కొత్త ఆర్మీ చీఫ్ సయ్యద్ ఆసిం మునీర్ ఆ దేశానికి ఓ అజిత్ ధోవల్… రెండు దేశాల సైనిక, రక్షణ విధానాలకు సంబంధించి వాళ్లిద్దరి గ్రిప్ తిరుగులేనిది… 29న పదవీ విరమణ చేయబోతున్న ఆర్మీ చీఫ్ బజ్వా ఒకందుకు కొంత సాఫ్ట్… ఆర్మీని రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడం వంటి విషయాల్లోనూ పెద్దగా కంట్రవర్సీల్లోకి పోలేదు… ఇండియా పట్ల విపరీతమైన ద్వేషాన్ని కూడా పెద్దగా కనబర్చలేదు… కానీ…
ఆ బజ్వాకు అత్యంత ప్రీతిపాత్రుడైన మిలిటరీ ఆఫీసర్ ఆసిం మునీర్ అలా కాదు… హార్డ్ కోర్ మెంటాలిటీ… ప్రపంచంలోకెల్లా ఆరో అతిపెద్ద సైనిక విభాగం, 6 లక్షల మంది సైనికులకు చీఫ్ ఇప్పుడు… మిగతా రక్షణ సంబంధ అనుబంధ విభాగాలు పేరుకు వేర్వేరు… కానీ పాకిస్థాన్‌లో ఆర్మీ చీఫే పవర్ ఫుల్… ఈ ఆసిం ఇండియాకు ఖతర్నాక్ ఎనిమీ…
అసలే అమెరికా, దాని మిత్రదేశాలు డబుల్ గేమ్ ఆడుతూ మళ్లీ పాకిస్థాన్‌ను ఎంకరేజ్ చేసే పనిలో పడ్డాయి… ఆర్థిక ఆంక్షల నుంచి, అంటే ఎఫ్ఏటీఎఫ్ ఆంక్షల చట్రం నుంచి బయటపడేశాయి… మళ్లీ యుద్ధవిమానాలు ఇస్తున్నాయి… ఇంకోవైపు పాకిస్థాన్‌లో రాజకీయ అస్థిరత అలాగే ఉంది… ఈ స్థితిలో ఈ ఆర్మీ చీఫ్ వ్యవహార ధోరణి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది…
Ads
పుల్వామా దాడికి తనే సూత్రధారి… అది తరువాత పాకిస్థాన్- ఇండియా నడుమ ఎంతటి ఉద్రిక్తతల్ని క్రియేట్ చేసిందో తెలిసిందే కదా… ఇండియా సంగతేమో గానీ, ఇమ్రాన్ ఖాన్ పని చాలా ఇరకాటంలో పడ్డట్టే… గతంలో ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బూబీ ఫ్యామిలీ అవినీతి వ్యవహారాలను ఇమ్రాన్ ఖాన్‌కే రిపోర్ట్ చేశాడట… దాంతో తను పట్టుబట్టి, బజ్వాపై ఒత్తిడి తెచ్చి, అసిం మునీర్‌ను ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి తొలగించేలా చేశాడు… ఇప్పుడు తను ఏకంగా ఆర్మీ చీఫ్ అయ్యాడు…
చాలా అరుదు… పాకిస్థాన్‌లో ఒకేసారి మిలిటరీ ఇంటలిజెన్స్ ఛీప్, ఐఎస్ఐ చీఫ్ పోస్టులో ఒకే అధికారి ఉండటం… మునీర్ ఆ పోస్టుల్లో ఒకేసారి పనిచేశాడు… సరికదా, ఐఎస్ఐలో చేశాక ఆర్మీ చీఫ్ కావడం కూడా అరుదే… మునీర్ విషయంలో ఇదీ సాధ్యమైంది… తను బలోపేతమైన స్థానంలో ఉన్నాడు… ఇమ్రాన్ అన్నీ కోల్పోయి ఉన్నాడు… మునీర్ కన్నెర్ర చేస్తే..? ఇమ్రాన్ పని పొయ్యిలో పడ్డట్టే… అందుకని త్వరలో ఇమ్రాన్ ప్రవాసంలోకి వెళ్లవచ్చునని అంటున్నారు…
మరి ఇండియా పరిస్థితి…? ఏముంది… పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అనే పదవిలోకి ఎవరు వచ్చినా వాళ్లు ఇండియా పట్ల వ్యతిరేకతను, విషాన్ని గుమ్మరించేవాళ్లే… అలా ఉన్నవాళ్లే శక్తిమంతులు అక్కడ… ఈయనేమో సహజంగానే ఇండియా అంటే ఎనిమిటీని డెవలప్ చేసుకున్న మనిషి… సో, చైనా సరిహద్దుల్లో ఉన్న అప్రమత్తతే పాకిస్థాన్ సరిహద్దుల్లోనూ అవసరం… ప్రస్తుత సంబంధాలు మరీ దిగజారకపోవచ్చు… కానీ పెద్దగా మెరుగుపడే చాన్స్ కూడా లేదు…!!
Share this Article