నాని… నేచురల్ స్టార్ అని పిలిచినా, మరో పేరుతో పిలిచినా… తను సెన్స్ ఉన్న నటుడు… టైమింగ్, మెరిట్ ఉన్న నటుడు… తెలుగు హీరోల్లో చాలా అరుదు… బండ కొట్టుడు మొహాలే తప్ప బలంగా ఉద్వేగాల్ని పలికించే నటులెవరున్నారని… సో, నాని తెలుగు ఇండస్ట్రీకి ఓ అసెట్…
కాకపోతే ఎప్పుడైతే స్టార్ ఇమేజీ వచ్చిందో, ఇక తనూ దారితప్పి ఫాల్స్ ఇమేజీ బిల్డప్పుల బాటలోకి వెళ్లిపోయాడేమో అనిపించింది పలుసార్లు… టక్ జగదీష్ సినిమాలో చొక్కా వెనుక దాచిన పెద్ద కత్తిని తీస్తాడు, దాంతో భోజనం పళ్లెంలో పెట్టిన ఉల్లిపాయ పొట్టు తీసి, కట్ చేస్తాడు… నవ్వొచ్చింది… ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రస్థానం ప్రారంభించిన నాని ఇలాంటి సీన్లకు ఎలా ఒప్పుకున్నాడో…
ఆమధ్య వచ్చిన దసరా సినిమాలో కూడా తన కేరక్టరైజేషన్ బాగాలేదు… సరే, పాత్ర డిమాండ్ చేసిన నటన చూపించాడు, కానీ ప్చ్… వి, అంటే సుందరానికి ఎట్సెట్రా సినిమాలు జస్ట్, టైం పాస్ పల్లీ వ్యవహారం… ఇక నాని దారి తప్పినట్టేనా అనిపించే స్థితిలో… లేదు, నేను సరైన దారిలోనే ఉన్నానంటూ హాయ్ నాన్న సినిమా చేశాడు… అదీ ఓ కొత్త దర్శకుడు శౌర్యవ్‌తో…
Ads
మాస్ కాదు, క్లాస్… తల్లీకూతుళ్ల ప్రేమ, ప్రియురాళ్లతో ప్రేమ… ఆ షేడ్స్… నిరాశలు, నిట్టూర్పులు… మళ్లీ పాత నాని కనిపించాడు… ఇవే నానికి సరిగ్గా సరిపోయే రోల్స్… బలంగా పండించగలడు… అదే చేశాడు… ఇవే స్వామీ నాని నుంచి మేం కోరుకునే సినిమాలు… పిచ్చి ఫైటింగులు, ఇమేజీ బిల్డప్పులకు నాని దేనికి..? ఈరోజుకూ నటన తెలియని స్టార్ హీరోలు లేరా ఏం..?
కాకపోతే ఈ హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్‌తో తన కెమిస్ట్రీలో సరిగ్గా కుదిరినట్టు అనిపించదు… ఆమె కూడా తన పాత్రకు మంచిగా పోషించింది… అప్పట్లో సీతారామంతో వచ్చిన పేరు నిలబెట్టుకుంది… ఓ చిన్న పిల్ల, ఈ పెద్ద పిల్ల, నడుమ ఆ పెద్ద పిల్లాడు… సినిమాను ఆసక్తిదాయకంగా మార్చారు… పాటలు, బీజీఎం, ఎడిటింగ్ గట్రా వోకే… అక్కడక్కడా కొంత బోర్ అనిపించినా స్థూలంగా దర్శకుడు కూడా పాస్…
నిజానికి ఓ ఎమోషనల్ చిత్రం ఈరోజుల్లో సక్సెస్‌ఫుల్‌గా ప్రజెంట్ చేయడం చాలా కష్టం… నటన తెలియని మొహాలతో, మాస్ మసాలాలు లేని కథను ఆకట్టుకునేలా ప్రజెంట్ చేయాలంటే… అదీ ఓ కొత్త దర్శకుడికి ఎంత కష్టం..? కానీ ఈ దర్శకుడు చేసి చూపించాడు… పర్లేదు, తెలుగు సినిమా అనగానే నాటు కొట్టుడు, బండ కొట్టుడు, వీర కొట్టుడు మాత్రమే కాదు… అప్పుడప్పుడూ ఇలాంటి గుండె తట్టుడు కూడా…
చివరగా… హాయ్ నాన్న అనగానే, పోస్టర్లలో ఆ చిన్న పిల్ల బొమ్మ చూసేసి… పిల్లల సినిమా అనుకుని పోలోమంటూ తీసుకుపోతారేమో… అంత లేదు… ఇది ఓ ప్రేమకథ… పలు ట్విస్టుల ప్రేమకథ… కాకపోతే ఆ బిడ్డతో నాన్న ప్రేమానురాగాల నేపథ్యంలో వండబడిన ప్రేమకథ..!! ఇంతకీ ఈ సినిమా ఫస్ట్ క్లాసా..? డిస్టింక్షనా..? అంత కాదు… పాస్…!!
Share this Article