కామెడీ స్టార్స్ ప్రోగ్రాం ప్రోమో వీడియో కామెంట్లలో ఒకటి… ‘‘ఈటీవీ వదిలేసిన చెత్త అంతా ఇక్కడ చేరింది… అందుకే రేటింగ్స్‌లో లేవడం లేదు’’… ఈటీవీ వదిలేసిన చెత్త అనే వాక్యం అభ్యంతరకరం… కరెక్టు కూడా కాదు… కాకపోతే రేటింగ్స్‌లో మాత్రం లేవడం లేదు… నిజం చెప్పాలంటే ఇప్పుడు జబర్దస్త్ షోలకన్నా చాలాచాలా బెటర్… కానీ రేటింగ్స్ సాధించడంలో మాత్రం బాగా ఫెయిలైపోతోంది…
వాస్తవంగా కామెడీ స్టార్స్‌లో బూతు తక్కువ… జబర్దస్త్ మరీ నాసిరకంగా మారింది… హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ వెళ్లిపోయాక అసలు ఆ షోల అట్రాక్షనే తగ్గిపోయింది… ఏదో అలా అలా నడిపించేస్తున్నారు కానీ పంచ్ ఉండటం లేదు… కానీ మాటీవీలో వచ్చే కామెడీ స్టార్స్‌లో ఈమధ్య డిఫరెంట్ కంటెంట్ ట్రై చేస్తున్నారు… ఆర్పీ, హరి కాకిగోల తగ్గితే ఇంకాస్త బాగుండేది… సరే, మనం చెప్పుకునేది ఇక్కడ ఓ పర్టిక్యులర్ స్కిట్ గురించి…
వర్తమానంలో వార్తల్లో ఉండే వ్యక్తులను అనుకరిస్తూ వాళ్ల మీద పంచులు వేసి, రక్తికట్టించడం చాలా పెద్ద టాస్క్… ఎంతసేపూ మన టీవీ కామెడీ క్రియేటర్స్‌కు బూతులు, అక్రమ సంబంధాలు తప్ప ఇంకేమీ కంటెంటు దొరకదు… అదే సొల్లు… కానీ కరెంటు టాపిక్స్ మీద బ్యాలెన్స్‌డ్‌గా స్కిట్స్ చేయడం వాళ్లకు చేతకావడం లేదు… స్క్రిప్ట్ జాగ్రత్తగా రాసుకోవాలి… ఒక సైడ్ తీసుకోవద్దు… అదేసమయంలో పంచ్ బలంగా పడాలి…
Ads
అవినాష్ చేసిన ఓ స్కిట్ బాగున్నట్టనిపించింది… నిజానికి కేఏపాల్ చాలా ప్రసిద్ధి పొందిన మతప్రబోధకుడు, మనలో చాలామందికి తన ప్రవర్తన, తన మాటతీరు, తన చేష్టలతో జోకర్‌గా కనిపిస్తుండవచ్చుగాక… అలాగే రామగోపాలవర్మ… మంచి క్రియేటివ్, థింకర్… కానీ బుర్రలో ఇన్‌ఫెక్షన్ పర్వర్షన్‌లోకి దారితీసి, తన చేష్టలతో, తన మాటలతో, తన సినిమాలతో తనూ ఓ జోకర్ అయిపోయాడు ఈమధ్య… వాళ్లిద్దరిని పాత్రలుగా చేసి ఓ స్కిట్ చేశారు… (వర్మ మీద, వర్మ ఎదుటే స్కిట్ చేసినవాళ్లున్నారు…)
ఎవరో ఒకరిని టార్గెట్ చేసి, వెక్కిరిస్తున్నట్టుగా లేదు… (జబర్దస్త్‌లో కావాలని, సర్కాస్టిక్‌గా, ఓ లైన్ తీసుకుని పంచులు వేయడం హైపర్ ఆది స్కిట్లలో కనిపించేది… ఆమధ్య మంచు విష్ణు మీద సెటైర్స్ వేస్తే, అది కాస్తా మిస్‌ఫైర్ అయిపోయింది… అంతకుముందు కూడా నాగబాబు మెప్పు కోసం యాంటీ-పవన్ కేరక్టర్ల మీద పంచులు వేసేవాడు…) ఈ స్కిట్‌లో ‘‘రాజమౌళి ఫోన్ చేశాడయ్యా… ఈసారి నాలుగు ఆర్లు తీస్తాడట… రష్యా, చైనా, ఉత్తర కొరియా ప్రధానులను తీసుకో అని చెప్పాను… నాలుగో ఆర్‌గా నేను చేస్తానన్నాను..’’ అని పాల్ వర్మతో చెబుతుంటాడు…
‘‘ఓహో… నాలుగు రాడ్లు అన్నమాట..’’ అని పంచ్ వేస్తాడు వర్మ… ‘‘పోనీ, నువ్వూ యాక్ట్ చేయి’’ అంటాడు పాల్… వెంటనే ఆ పక్కనున్నతను ‘‘అప్పుడిక అయిదు రాడ్లు అవుతాయన్నమాట’’ అంటాడు… హీరోయిన్ వచ్చి, హీరో (పాల్)ను పరిచయం చేసుకుని హాయ్ సార్ అంటూ హగ్ చేసుకోవాలని అనుకుంటుంది… పాల్ చేతులు జోడించి, నమస్తే పెట్టి ‘‘ఏదైనా అధికారంలోకి వచ్చాకే…’’ అంటాడు… హిలేరియస్… పాల్, వర్మలకు నచ్చకపోతే ఏ టీవీ షోలోనో ప్రస్తావించి, లేదా ట్విట్టర్ ద్వారా సుబ్బరంగా కడిగేస్తారు… ఐనా పర్లేదు…
కరెంట్ టాపిక్స్, వార్తల్లో వ్యక్తుల మీద సెటైర్స్, పంచులు కొన్నిసార్లు ఓవర్ అనిపించవచ్చుగాక… కానీ తెలుగు టీవీల్లో, సినిమాల్లో ఆ కామెడీ కనిపించకుండానే పోతోంది… కంట్రవర్సీల మీద భయం… ఈ దిశలో కామెడీ స్టార్స్‌లో ఈ స్కిట్ అభినందనీయం… కనీసం ప్రతి ఎపిసోడ్‌లో ఒక్కటి కరెంట్ టాపిక్ మీద ఉంటే… ప్రోగ్రాం క్వాలిటీ బాగుంటుంది… ఎలాగూ జబర్దస్త్ తరహాలో వెకిలి బూతును, వెగటు కంటెంట్‌ను నమ్ముకోవడం లేదు గనుక…!!
Share this Article