ముందుగా ఓ చిన్న డిస్‌క్లెయిమర్…. నిర్మల సీతారామన్ మోడీ కేబినెట్‌లో నెంబర్ వన్ వేస్ట్,.. వేస్టున్నర… పైగా ఆర్థికశాఖ ఇవ్వడం మోడీ ఆలోచనారాహిత్యం… ఆమె అడుగులు మోడీ ప్రభుత్వ విధానాలకు అనుగుణమే అయినా, ఎక్కడా మంచి ప్రసంగం, మంచి వ్యాఖ్య, మంచి డెసిషన్, మంచి సమర్థన ఉండవు… బీజేపికి పెద్ద మైనస్… దేశప్రజలకు మైనసున్నర…
నిన్న ఆమె రేవంత్ భాషను ఉద్దేశించి అవహేళనగా మాట్లాడిందనీ, ఆమెకు ఎంత అహంకారం అనీ విమర్శలు నిన్నటి నుంచీ జోరుగా వస్తున్నయ్… దానికి తగ్గట్టే ఆంధ్రజ్యోతి రిపోర్టింగ్ కూడా రేవంత్ కోణంలో సాగింది… రాధాకృష్ణకు, చంద్రబాబుకు ఇష్టుడు కదా… కానీ ఈనాడు రిపోర్ట్ చదివితే దానికి పూర్తి భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది… నిజానికి హిందీ భాష గురించిన ప్రస్తావన ఆమె తీసుకురాలేదు…
రేవంత్ మాట్లాడుతూ రూపాయి విలువ ఐసీయూలో పడిపోయిందని వ్యాఖ్యానించాడు… కాంగ్రెస్ ఎంపీగా ఆ విమర్శను ఎవరూ తప్పుపట్టడానికి లేదు… అది నిజం కూడా… అయితే స్పీకర్ ఎందుకో బ్రేక్ వేశాడు, మీరు నన్ను అడ్డుకోకూడదు అని రేవంతే స్పీకర్ పట్ల దురుసుగా బదులిచ్చాడు… దాంతో స్పీకర్ లోకసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరికి ‘మీ సభ్యుడికి చెప్పండి, అలా మాట్లాడకూడదని’ అంటూ సూచించాడు…
Ads
దాంతో అధీర్ రంజన్ చౌదరి ‘రేవంత్ హిందీ దుర్బలంగా ఉంటుంది, ఐనా తనను మాట్లాడనివ్వండి’ అని కోరాడు… స్పీకర్ సరే అన్నట్టుగా సైలెంటుగా ఉండిపోయాడు… రేవంత్ మాట్లాడుతూ పోయాడు… ఇక్కడ రేవంత్ భాష గురించి మొదట ప్రస్తావించింది కాంగ్రెస్ పక్ష నాయకుడే… అంతేకాదు, రేవంత్ భాషను తను హేళన చేశాడు అనుకోవాలా మరి..?
తరువాత నిర్మల సీతారామన్ దానికి సమాధానమిస్తూ… ‘‘తెలంగాణ సభ్యులు తమ హిందీ బలహీనంగా ఉందని చెబుతున్నారు, నా హిందీ కూడా అలాంటిదే… సో, ఆ భాషలో బదులిస్తాను’’ అని ఏదో సమాధానం చెప్పింది… ఇక్కడ ఆమె ఉద్దేశపూర్వకంగా రేవంత్ భాషను హేళన చేసింది ఎక్కడ..? కాకపోతే స్ట్రెయిట్‌గా తన జవాబు ఇవ్వకుండా మళ్లీ ఒక సభ్యుడి భాషను ఆమె ప్రస్తావించడం నాన్సెన్స్…
రేవంత్ కూడా ఇక్కడ సైలెంటుగా ఉంటే సరిపోయేది… హుందాగా ఉండేది… కానీ అనవసరంగా, అసందర్భంగా కులాల ప్రస్తావన తీసుకొచ్చాడు… నేను శూద్రుడిని కాబట్టి ప్యూర్ హిందీ రాదు, మంత్రి బ్రాహ్మణవాది కాబట్టి ఆమెకు మంచి భాష రావొచ్చునన్నాడు… శూద్రులకు హిందీ సరిగ్గా రాదా..? బ్రాహ్మలయితే హిందీ బాగా వస్తుందా..? ఇదెక్కడి సూత్రీకరణ..? మొత్తం ఎపిసోడ్‌లో రేవంత్ తొందరపాటుతనమే కనిపిస్తోంది… మరీ తెలంగాణ మీడియా ముందు, వీథుల్లో మాట్లాడినట్టే పార్లమెంటులో కూడా మాట్లాడితే ఎలా నాయకా..?!
ఆంధ్రజ్యోతి రిపోర్టింగును బట్టి ఇక సోషల్ మీడియాలో నిర్మల మీద విపరీతమైన ట్రోలింగు సాగుతోంది… విశేషమేమిటంటే… బీజేపీ అభిమాన శ్రేణులు సైతం ఆమెను తప్పుపడుతున్నారు… అంటే, ఆమె పట్ల బీజేపీలోనే ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు… మోడీకి మాత్రం ఆమె వైఖరి, పనితీరు బాగా నచ్చుతుంది… పిచ్చి సమర్థకుడు..!!
Share this Article