.
HMPV… Human metapneumo virus… ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన వైరస్… మరో కరోనా… నాశనం చేయబోతోంది జాగ్రత్త అనే హెచ్చరికలు…
ఎక్కడ… చైనా..? ప్రపంచం ఏమాత్రం విశ్వసించదగని ధూర్త దేశం అది… మనం పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్ అంటుంటాం కానీ… మోస్ట్ డేంజరస్ కంట్రీ చైనా…
Ads
ఖగోళం, అంతరిక్షం, సముద్రం, వాతావరణం, జీవాయుధాలు ఎట్సెట్రా ఏదైనా ప్రయోగించగలదు… ప్రపంచానికి మోస్ట్ డేంజరస్ వైరస్, ఏదీ కాదు, జస్ట్ వైరస్…
ఈ హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి వార్తలు ప్రబలుతున్నాయి… చైనాలోని హాస్పిటల్స్, స్మశానవాటికల్లో రద్దీ పెరిగింది అని వార్తలు సోషల్ మీడియాలో… కరోనా సమయంలోనే చైనా అనుకూలంగా చెత్తా ప్రకటనలతో క్రెడిబులిటీ కోల్పోయిన WHO ఇంకా స్పందించలేదు… అదేం చెప్పినా దానికి విశ్వసనీయత లేదు…
చైనా అసలే స్పందించదు… ఈరోజుకూ ఒక్కటంటే ఒక్క అంతర్జాతీయ ప్రకటన లేదు… మేం క్రియేట్ చేస్తాం, మీ ఖర్మ మీరు అనుభవించండి అనేదే దాని పాలసీ…
పైపైన వార్తలు చదివితే… అది జస్ట్ కోల్డ్ తరహా ఎఫెక్ట్ అని కనిపిస్తుంది… కాదు, గతంలో కూడా అమెరికా ఇతర దేశాల్లో ఈ వైరస్ ఉనికి కనిపించింది… ఇదే చైనాలో 20 ఏళ్ల క్రితం నుంచీ ఉంది… ది మోస్ట్ వరస్ట్ వైరాలజీ సెంటర్ వుహాన్‌లో ఇదే వైరస్ కొత్త వేరియంట్ డెవలప్ చేశారా..?
తెలియదు… ప్రస్తుతానికి మరణాల సంఖ్య కూడా తెలియదు… మెడికల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారనే అనధికార వార్తలు… ఎప్పటిలాగే మోడీ ప్రభుత్వానికి ఏమీ పట్టలేదు, పట్టదు… మోస్ట్ ఇనెఫియెంట్ మెడికల్ యంత్రాంగం మనది…
మోడీ చదువుకు, తెలివికి అవేమీ అర్థం కావు… కనీసం దేశోపయోగ వ్యక్తులతో ఓ మంచి టీం ఉందాంటే అదీ గతి లేదు… కరోనా సమయంలో చూసిందే కదా… కనీసం అంతర్జాతీయ ఫ్లయిట్లను సకాలంలో బ్యాన్ చేయలేకపోయింది… అసమర్థ, అనాలోచిత ప్రభుత్వం…
చాలా కరోనా తాలూకు వేరియంట్లలాగే ఇది కూడా ఉపిరి తిత్తుల్ని టార్గెట్ చేస్తుందట… అంటే జలుబు, దగ్గు, శ్లేష్మం, జ్వరం… అసలే మన దేశ మొత్తం జనాభా కరోనాతో ఎఫెక్లయి ఊపిరితిత్తులు పూర్తిగా బలహీనపడ్డాయి… అందుకే టీబీ వంటివి ప్రబలాయి…
ఇప్పుడు మళ్లీ ఇదీ మన రెస్పిరేటరీ సిస్టంను దెబ్బతీస్తే..? ఇదీ ఆందోళనకరం… ఎస్, చైనా అంటేనే ఓ దిక్కుమాలిన దేశం… దాన్ని కంట్రోల్ చేయలేం… (మన చెత్తా కమ్యూనిస్టులు మాత్రం సమర్థిస్తూనే ఉంటారు… తిన్న తిండికి విశ్వాసం)… కనీసం డిఫెన్స్ మెకానిజం అయినా బాగుండాలి కదా,.,.
అబ్బే, ఇవన్నీ ఫేక్ న్యూస్ అంటున్నారు కొందరు… సరే, కానీ ఇదొక అలర్ట్ కాల్ అనుకుందాం… ఏదీ, ఈ సమయానికి కూడా భారత ప్రభుత్వం నుంచి స్పందన లేదు…
అప్పట్లో మంచి నీళ్ల సీసా ధరతో కరోనా వేక్సిన్ ఇస్తామని అడ్డగోలుగా వేల కోట్లు సంపాదించాడు ఓ ప్రఖ్యాత వేక్సిన్ల వ్యాపారి… తెలుసు కదా… యెల్లా కృష్ణ… మోడీ చేతులెత్తేశాడు… దరిద్రపు పాలన… మరి ఇప్పుడు..?
ఒక్క మాట చెప్పేయండి, కరోనా వేక్సిన్ దీనికి పనిచేయదు అని… కొత్తగా ఓ వేక్సిన్ వదలండి… సర్, యెల్లా కృష్ణ గారూ… ఈసారి కుమ్మేయండి… దెబ్బకు బిల్ గేట్స్, ఎలన్ మస్క్‌ను దాటేయాలి… అసలే మన గురుశిష్యుల పాలనలు రెండు రాష్ట్రాల్లోనూ…!!
Share this Article