ఈమధ్య ఆంధ్రజ్యోతి రాశిఫలాల మీదే కాదు, ఆధ్యాత్మిక వ్యాసాలను కూడా ఏది తోస్తే అది పబ్లిష్ చేస్తోంది… ఈమధ్య కొన్ని ఉదాహరణలూ చెప్పుకున్నాం కదా… ఈరోజు నవ్య పేజీలోని నివేదన వ్యాసాల్లో మరొకటి కనిపించింది… కరోనా తరువాత వచ్చిన తెలుగు సంవత్సరాల పేర్లు శుభకృత్, శోభకృత్… సో, శుభాలు కలిగాయట, కరోనా నుంచి ఉపశమనం లభించిందట…
సరే, పేర్లను బట్టి సంవత్సర శుభాశుభాలే ఉంటాయనే అనుకుందాం… మరి ఇప్పుడు వచ్చేది క్రోధి,., అంటే నెగెటివ్ పేరు… క్రోధం, కోపం, ఆగ్రహం, అశాంతి, అసహనం, అరాచకం ఎట్సెట్రా… అంటే ఈ సంవత్సరం ఏమైనా నెగెటివిటీని మనం భరించాల్సి వస్తుందా..? చాలామంది అలాగే చెబుతున్నారు, బేస్ లెస్… అసలు సంవత్సరాల పేర్లను బట్టి ఫలితాలు అని చెప్పుకోవడమే కరెక్టు కాదు… కాదంటే గరికపాటిని అడగండి… ఆయనైతే అసలు వాస్తు, వ్యక్తిగత జాతకఫలాలు, గ్రహచారాలే అబ్సర్డ్ అని కొట్టిపారేస్తాడు…
Ads
ఆంధ్రజ్యోతి ఏం రాసుకొచ్చిందంటే… క్రోధిని నెగెటివ్ కోణంలో చూడొద్దు… క్రోధి అంటే మహా శివతత్వం… శివుడంటేనే శుభుడు, భక్త వత్సలుడు, శుభకరుడు, శివుడి విభూది సర్వసంపత్కరం, ఈశ్వరతత్వం క్రోధి, ఈ తత్వమే భగవంతుడి కారుణ్యానికి మరో పేరు… ఇలా రాసుకుంటూ పోయింది… క్రోధిని మహాశివతత్వంగా పరిగణిద్దాం సరే, ఆయనకున్న అనేకానేక పేర్లలో క్రోధి కూడా ఉందనే అనుకుందాం కాసేపు… సో, ఆయన పేరుంది కాబట్టి అంతా శుభమేనా..? ఏం చెప్పారు స్వామీ..?!
ఇంకా విచిత్ర బాష్యాల్లోకి వెళ్లిపోయింది పత్రిక… బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజు ప్రభవ, ఉత్తరాయణం, రుతువుల్లో మొదటి రుతువు వసంతం… అందులోనూ చైత్రమాసం తొలి మాసం, పక్షాలలో మొదటిదైన శుక్లపక్షం, పాడ్యమి తొలి తిథి, అంటే ఉగాదిన అన్నీ తొలి విశేషాలే కాబట్టి ఏ నామ సంవత్సరమైనా సరే తేడా ఉండదట… విజ్ఞానశాస్త్రపరంగా మన పూర్వ రుషుల ఔన్నత్యం అట… ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్లిపోయారు… హేమిటో… పత్రిక దయ, పాఠకుడి ప్రాప్తం అన్నట్టుగా ఉంది ఈ వ్యవహార ధోరణి…
గ్రహసంచారాలు, మనిషి జీవితాలపై ఖగోళ ప్రభావం, జాతకాలు గట్రా నమ్మేవాళ్ల ఇష్టం… నమ్మనివాడికి ఏ బాధా లేదు… ఐతే వాటి గురించి వివరణలు, ప్రవచనాల సమయంలో జాగ్రత్తలు అవసరం… పత్రికల్లో ప్రచురించే రోజువారీ రాశిఫలాల్లాగే డొల్ల బాష్యాలకు దిగితే పోయేది అంతిమంగా పత్రిక పరువే…!
Share this Article