Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహ్… నటుడు ప్రకాష్‌రాజ్‌లో ఈ కోణం కూడా ఉందా..? ఆశ్చర్యమే…!

July 20, 2023 by M S R

ప్రకాష్ రాజ్‌కు మొన్నామధ్య వచ్చిన ఏదో ఓ ఫ్లాప్ సినిమాలో బ్రహ్మానందం ఈడ్చి చెంప మీద కొట్టి ఇలా అంటాడు… ‘‘నువ్వొక చెత్తా నటుడివిరా… మనిషిగా అంతకుమించి నీచుడివిరా’’…. ఈ వీడియోను జాతీయవాదులు బాగా వైరల్ చేశారు… నిజంగానే కాషాయ క్యాంపుకి ప్రకాష్ రాజ్ అంటే అస్సలు నచ్చదు… ఆమధ్య కేసీయార్ ఆంతరంగిక బృందంలో ఒకడిగా తిరిగాడు కదా, ప్రకాష్ రాజ్ అంటే కోపం మరింత పెరిగింది రైటిస్టులకు… అఫ్‌కోర్స్, కేసీయార్ తనకు అలవాటైన రీతిలో ప్రకాష్‌రాజ్‌ను కూడా తన్ని తగలేశాడు, అది వేరే సంగతి…

చాలామంది సినిమావాళ్లలాగే బొచ్చెడు నీతులు చెబుతాడు… మహిళలు, హక్కులు, వివక్ష అని కూడా మాట్లాడతాడు… తను ఎన్ని పెళ్లిళ్లు చేసుకుని, ఎందరి జీవితాల్లో మన్ను పోసినా సరే..! నాస్తికత్వం, హేతువాదం మాటలు చెబుతుంటాడు… అందరు నాస్తిక మేధావుల్లాగే ఒక్క హిందూ మతాన్ని మాత్రమే వెక్కిరిస్తూ, ద్వేషిస్తూ, అవమానిస్తూ ఏవో వ్యాఖ్యలు చేస్తుంటాడు… ఇతరుల మనోభావాలను, మతభావాలను కించపరచొద్దు అనే సోయి పైసామందం కూడా లేని మనిషి…

సరే, అవన్నీ పక్కన పెడితే… ఈమధ్య విశ్వేశ్వర భట్ అనే ఓ ప్రసిద్ధ జర్నలిస్టు రాసిన ఓ పోస్టు ఆసక్తికరంగా అనిపించింది… నేను నాస్తికుడిని, నేను విప్లవకవిని అని ఘీంకరించిన ఓ పెద్దాయన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్నాడట, అదేమంటే భార్య మతవాది, ఆస్తికురాలు, అందుకే తప్పలేదు అన్నాడట… తిరుమల వెళ్లిన ఒక సీపీఐ నారాయణలాగా… పంతుళ్ల ముందు తువ్వాల చాపిన గద్దర్‌లాగా… ఇంతకీ ఈ విశ్వేశ్వర భట్ ఏం రాశాడో Chada Sastry  ఒక పోస్టులో రాసుకొచ్చాడు… ఆ పోస్టును కూడా కాస్త తెలుగీకరించి, మన భాషలో చెప్పుకోవాలంటే…

Ads



విశ్వేశ్వర భట్ విశ్వ వాణి అనే పేపర్‌కు చీఫ్ ఎడిటర్. ఈయన గతంలో విజయ కన్నడ, కన్నడ ప్రభ, సువర్ణ న్యూస్‌కి ఎడిటర్‌గా పని చేశారు. ఆయన ప్రకాష్‌రాజ్ గురించి ఏమన్నాడో ఆయన మాటల్లోనే చదువుదాం… కొన్నాళ్ల క్రితం ప్రకాష్‌రాజ్ నాకు ఫోన్ చేశారు. “నా రెండవ భార్య ఇంకా గర్భం దాల్చలేదు. ఆమెకు సర్పదోషం ఉందని ఎవరో చెప్పారు, అందుకే పరిహారం కోసం కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం వెళ్లాలని, అక్కడ పరిహారం తంతు చేయాలని నిర్ణయించుకుంది. అక్కడ ఆ పూజ చేసేంత వరకు ఆమె తనకు గర్భం రాదని నమ్ముతోంది… కుక్కే గుడిలో పూజ చేయవలసి ఉంది. మీకు ఎవరైనా తెలుసా? మీరు నాకు సహాయం చేయగలరా?”

నేను నా మంగళూరు కరస్పాండెంట్ జితేంద్ర కుందేశ్వర్‌ని సంప్రదించాను. దానికి సంబంధించిన పూజకు అన్నీ సమకూర్చాడు. ప్రకాష్‌రాజ్ భార్య ఆ ఆలయాన్ని సందర్శించి పూజలు చేసి తిరిగి వెళ్లిపోయారు. తరువాత అతని భార్య ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. దంపతులిద్దరూ నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు… కుక్కే గుడికి వెళ్లి పూజలు చేయడం నిజం కాదా..? ప్రకాష్ రాజ్ తండ్రి కావడం నిజం కాదా..? అతను దీన్ని కాదనగలడా, జస్ట్, ఊరికే అడుగుతున్నాను…

కొందరు తమను తాము మేధావులుగా, నాస్తికులుగా, అభ్యుదయవాదులుగా బహిరంగంగా ప్రదర్శించుకుంటారు, కానీ వాస్తవానికి వారు అది కాదు. ప్రకాష్‌రాజ్ స్వచ్ఛమైన కపటి, అది మనందరం విస్మరించాల్సిన అవసరం లేదు. అతను ద్వంద్వ ప్రమాణాలు మరియు వైరుధ్యాలకు పర్యాయపదం… ఒకరిని ‘విష సర్పం’ అని నిందించాడు. అయితే అదే ‘విషసర్పం’ అతనికి ఒక వరం…

ఇటీవల చంద్రయాన్-3 ప్రయోగానికి రెండ్రోజుల ముందు ఇస్రో శాస్త్రవేత్తలు తిరుపతికి వెళ్లినప్పుడు కొందరు ప్రగతిశీల ఆలోచనాపరులు ‘స్వశక్తిపై ఆధారపడలేని వారు దేవుడిని ఆశ్రయిస్తారు’ అని ఎగతాళి చేశారు. అయితే, ఈ ఘటనకు ప్రకాష్ రాజ్ కుక్కే ఘటనకు ఎలాంటి సంబంధం లేదు.

డిస్‌క్లయిమర్: ఇటువంటి వ్యక్తిగత విషయాలను బహిరంగంగా చర్చించడం నాకు ఇష్టం లేదు. నాకు నా స్వంత పేపర్ ఉంది, నా స్వంత కాలమ్స్ ఉన్నాయి. కానీ, ఇలాంటి కథలు రాయడం వల్ల ఆ పేజీల పవిత్రత దెబ్బతినకూడదనుకుంటున్నాను. అతి పెద్ద సమస్య ఏమిటంటే… కొన్ని నిజాలు చెబితే తప్ప వారి “నిజస్వరూపం” బయటపడదు… జస్ట్, ఊరికే చెపుతున్నా…

PRAKASH RAJ
మొదటి ఫోటోలో కనిపిస్తున్నది మా రిపోర్టర్ జితేంద్ర కుందేశ్వర్, ప్రకాష్ రాజ్ రెండవ భార్య కుక్కే గుడి ఎదురుగా దిగిన ఫోటో…. రెండవ చిత్రం, కుక్కే ఆలయ ప్రాంగణంలో ప్రకాష్ రాజ్ తన కుమారుడిని ఎత్తుకున్న దృశ్యం…

PRAKASH RAJ

అన్నట్టు తన కొడుకును తీసుకుని మళ్లీ కుక్కే వెళ్లాడు… గుడి ఎదురుగా ఫోటో దిగాడు… పేరు ఏం పెట్టుకున్నాడో తెలుసా… వేదాంత్…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions