Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ధైర్యం చెప్పేవాళ్లే కాదు… మంచి వైద్యసలహాలు కావాలిప్పుడు… ఇది అదే…

January 24, 2022 by M S R

అధికశాతం ఒమిక్రాన్ కేసులే… దాదాపు 5 శాతంలోపే డెల్టా కావచ్చు… అది చాలు కార్పొరేట్ మాఫియాకు… అది డెల్టాయా, ఒమిక్రానా తేల్చే పరీక్ష చేయించాలి అంటూ హాస్పిటల్స్‌కు వచ్చే రోగులతో నిర్బంధంగా చేయిస్తున్నారు… దానికీ 5 వేల నుంచి 10 వేల చార్జ్ చేస్తున్నారు… మనం అనుకుంటున్నాం కదా, ఒమిక్రాన్ చాలా మైల్డ్… ఇప్పుడది జలుబుతో సమానమే అని… చాలా దేశాలు ఆంక్షల్ని కూడా ఎత్తేశాయి… డెల్టా నాటి చికిత్స ప్రోటోకాల్ కూడా ఇప్పుడు లేదు… విచ్చలవిడిగా స్టెరాయిడ్స్, విపరీతమైన ఖరీదున్న మందుల్ని ఎడాపెడా వాడి బ్లాక్ ఫంగస్ వంటి కొత్త ముప్పును రుద్దింది హాస్పిటల్సే…

ఇప్పుడు హాస్పిటల్ వెళ్లే స్థితి తలుచుకుంటేనే… ఒక్కొక్కరికీ వణికిపోతోంది… ఐనా ఫార్మా మాఫియా వదలడం లేదు… ఇప్పటికీ కొందరికి ఎలా ప్రిస్క్రిప్షన్లు ఇస్తున్నారో ఒక్కసారి చూడండి… రాబోయే రోజుల్లో ఇంకా కార్పొరేట్ మెడికల్ మాఫియా ఈ ప్రపంచాన్ని ఎంత గుల్ల చేయబోతున్నదో అంచనాకు కూడా అందడం లేదు…

corona

Ads

వీటిలో కొన్ని అవాయిడ్ చేయాలని నిపుణులే చెబుతున్నారు… కానీ గుచ్చేస్తున్నారు, మింగిస్తున్నారు… సిటీల్లో మామూలు వైద్యులు దొరకరు… జనరల్ ఫిజిషియన్లది ఖరీదైన కన్సల్టేషన్, ఐనా అపాయింట్‌మెంట్ దొరకదు… పెద్ద హాస్పిటళ్లు వెళ్లడానికి భయం… మరెలా..? కరోనాకు గతంలో మెడికల్ షాపుల్లో మందులు కూడా ఇవ్వనివ్వలేదు… ఇప్పుడు నయం… మెడికల్ షాపులు ప్రాథమిక కరోనా చికిత్స కేంద్రాలు అయిపోయాయి… ఐనాసరే, మంచి సలహా, మంచి చికిత్స సూచనలు ఇవ్వగలిగే నైపుణ్యం ఉన్న, అనుభవం ఉన్న హ్యాండ్స్ కావాలి…

కొందరు మాత్రమే ఈ విషమ స్థితిలో జనం కోణంలో ఆలోచిస్తున్నారు… సలహాలు ఇస్తున్నారు… గైడ్ చేస్తున్నారు… సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటూ ఫలానా మందులు వాడండి అని చెబుతున్నారు… ఫోన్ నంబర్లు కూడా ఇచ్చి, కాల్స్ అటెండ్ చేస్తున్నారు… హేట్సాఫ్… ఆ కొందరికి వందనం… కాకినాడకు చెందిన వైద్యుడు యనమదల మురళీకృష్ణ నిన్న ఒక పోస్ట్ పెడితే 12 వేలకు పైగా షేర్లున్నయ్… లైకుల సంగతి వదిలేయండి… అంటే అర్థమవుతోందిగా జనం మంచి సూచనల కోసం ఎలా వేచి ఉన్నారో… వాళ్లకు ఇప్పుడు ఏం కావాలో… దిగువ ఆ పోస్టు యథాతథంగా ఇచ్చాను, చదవండి…

home care

తను వృత్తిరీత్యా వైద్యుడే కాబట్టి, ఆ మందులు వాడొచ్చు… ఇవేమీ ప్రమాదకరమైన మందులు కావు… అయితే ఈ ప్రిస్క్రిప్షన్ మైల్డ్ లక్షణాలున్నవారికి మాత్రమే… హోం కేర్ సరిపోయేవాళ్లకే…! ఆక్సిజన్ అవసరపడేవాళ్లు, తీవ్ర లక్షణాలున్నవాళ్లు, ఇమ్యూనిటీ తక్కువున్నవాళ్లు, హోం కేర్‌తో తగ్గనివాళ్లు దగ్గరలోని వైద్యుల దగ్గరకు వెళ్లాల్సిందే… తెలంగాణ ప్రభుత్వం కోటి హోం కిట్స్ కొనుగోలు చేసింది… ఏ గోళీ ఎలా వాడాలో, అదేమిటో, దేనికో కూడా క్లియర్‌గా రాసిన పత్రం ఉంటుంది అందులో…  మురళీకృష్ణ ఇదే పని చాన్నాళ్లుగా సోషల్ మీడియాలో చేస్తున్నారు… తను సూచించే ప్రోటోకాల్‌కు సరైన శాస్త్రీయ వివరణతో సహా…! ఉదాహరణకు… చాలామందికి ఓ డౌట్ ఉంటుంది… యాంటీ బయాటిక్స్ వైరస్ మీద పనిచేయవు కదా, మరెందుకు ఈ డ్రగ్ అవసరం అనేది డౌట్… దానికీ వివరణ ఉంది ఈ ప్రోటోకాల్‌లో…


omicron


Yanamadala Murali Krishna……………   #ఒమిక్రాన్ కోవిడ్ తేలికపాటి జబ్బుకి హోమ్ కేర్ కిట్…. ఒమిక్రాన్ రకం కొరోనావైరస్ కేవలం గొంతు, ముక్కుకి పరిమితమైన తేలికపాటి జబ్బులో ఇంటి దగ్గరే, విడిగా ఉండి ఈ మందులు వాడుకోవాలి:

1. లెవోసెటిరిజిన్ 5 మిల్లీ గ్రాములు + మాంటెలుకస్ట్ 10 మిల్లీ గ్రాములు (Monticope) సాయంత్రం పది రోజులు ; 2. ఎజిత్రోమైసిన్ 250 మిగ్రా (Azithral) ఉదయం రాత్రి ఐదు రోజుల పాటు; 3. ఎక్స్ పెక్టోరెంట్ దగ్గు సిరప్ Ascoril-LS, Brozeet లేదా BroZedex వంటివి 5ml ఉదయం రాత్రి ; 4. ఎసెక్లోఫినాక్ 100 ( Zerodol) మిల్లీగ్రాములు ఉదయం రాత్రి ఐదు లేదా వారం రోజులు; 5. రానిటిడిన్ 150 మిల్లీ గ్రాములు + డోంపెరిడాన్ 10 ( Rantac-D) సాయంత్రం ఉదయం పది రోజులు; 6. బి కంప్లెక్స్, సి విటమిన్, జింక్ కలిగిన సప్లిమెంట్ (Becozinc) రోజుకి ఒకటి పది రోజులు. ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించడానికి స్టెరాయిడ్ బదులు కొద్దిపాటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎఫెక్ట్ గల ఎసెక్లోఫినాక్ 100 మిల్లీగ్రాములు చేర్చాను. పారాసిటమాల్ కి గల శరీర ఉష్ణమును తగ్గించడం, ఒంటి నొప్పులు తగ్గించడంతో పాటు ఏంటీ ఇన్‌ఫ్లమేటరీగా కూడా ఎసెక్లోఫినాక్ పనిచేస్తుంది. అత్యధిక మందిలో కేవలం ముక్కు, గొంతుకి మాత్రమే పరిమితం అవుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ చికిత్సలో… అందరికీ ఏస్పిరిన్ అవసరం లేదు.

ఈ మందులు ఇతర అనారోగ్యాలు లేని పెద్దవారికి… కేవలం గొంతు వరకు పరిమితం అయిన మైల్డ్ ఒమిక్రాన్ కొరోనా వైరస్ జబ్బుకి… అయితే ఆక్సిజన్ సాచురేషన్ 93 కంటే దిగువకు పడిపోతూ ఉన్నా, ఆయాసం, జ్వరం, దగ్గు పెరుగుతూ ఉన్నా వైద్యుని సంప్రదించాలి…. (- డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండి, సాంక్రమిక వ్యాధుల నిపుణులు, కాకినాడ)



Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions