జగన్ వర్సెస్ నిమ్మగడ్డ… కథ రోజుకు ఒక ట్విస్టు కాదు, గంటకో ట్విస్టు అన్నట్టుగా మారుతోంది… రక్తికడుతోంది… మనం మునుపెన్నడూ చూడని ఓ కొత్త కథను చూపిస్తున్నారు… మొన్నటిదాకా జరిగిన కథను నెమరేసుకోవడం వేస్టు గానీ… నిన్న, ఈరోజు ఏమిటి..? రెండు వైపులా కనిపిస్తున్న కసి ఏమిటి..? నిమ్మగడ్డ వారు తిరుమల వెళ్లి దర్శనాలు చేసుకున్నారు కదా, అక్కడ జేఈవో ఉంటాడు ఓ ఐఏఎస్… పేరు బసంత్‌కుమార్… రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కదా, రిటైర్డ్ ఐఏఎస్ కదా అనుకున్నాడో… ఈయనకు కోపమొస్తే నామీద కూడా చర్య తీసుకుంటాడని భ్రమపడ్డాడో గానీ దగ్గరుండి మర్యాదలు చూసుకున్నట్టున్నాడు… ‘‘పెద్ద పెద్ద దేవుళ్లు’ వచ్చినప్పుడు అక్కడి అధికారులు గౌరవమర్యాదలు, భక్తిప్రపత్తులు చూపించడం సాధారణమే… పైగా తనను నిమ్మగడ్డ కలెక్టర్‌గా సెలెక్ట్ చేయడం జగన్ సర్కారుకు నచ్చలేదు… చర్రుమంది.,. వెంటనే సదరు అధికారిని అక్కడి నుంచి తీసిపారేసింది… నిమ్మగడ్డకు అనవసర గౌరవాన్ని ఎవరు ఇచ్చినా సహించేది లేదు అని ఓ సంకేతం ఇచ్చింది అధికారగణానికి… ఈయన గారి అధికారప్రభ రెండు నెలల్లో పూర్తయితే, తరువాత పరిస్థితేమిటి..? అదుగో, ఆ భయాన్ని నెలకొల్పడమే ప్రభుత్వ ఉద్దేశం…
ఆయనేదో ఈ-వాచ్ పేరిట యాప్ తయారు చేయించాడు కదా… అదీ కోర్టుకెక్కింది… అది తెలుగుదేశం కనుసన్నల్లో, దాని కోసమే, దానివల్లే రూపొందించబడిన యాప్ అని వైసీపీ ఆరోపణ… కోర్టు 9 దాకా స్టే ఇచ్చింది… అసలు ఇష్యూ ఏకగ్రీవాలు… గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏకగ్రీవాలన్నీ వైసీపీ బెదిరించి చేయించినవే అనే ఆరోపణ టీడీపీ, మిగతా పార్టీల నుంచి వినిపించింది… అది అలా సందిగ్ధంలోనే ఉంది… అసలు ఏకగ్రీవాలు కరెక్టు కాదని మన ప్రజాస్వామిక చరిత్రలో ఎవరూ అభిప్రాయపడినట్టు లేదు… మొదటిసారి ఏపీలో వింటున్నాం… సాక్షాత్తూ ఎన్నికలు నిర్వహించే కమిషనర్ ఏకగ్రీవం అనే పదం వింటేనే మండిపడుతున్నాడు… ఏకగ్రీవం అంటే జగన్ బ్యాచ్ బెదిరించి చేయించిందే అనే నిర్వచనాన్ని మొదటిసారి తెర మీద చూస్తున్నాం…
Ads
ఏకగ్రీవాలు కొత్త కాదు… 1964 నుంచీ ఉన్నవే అని వైసీపీ తెర మీదకు పలు ఉదాహరణలు, క్లిప్పింగులను మోసుకొస్తోంది… అది నిజమే… ఏకగ్రీవాలు కూడా ఓ డెమొక్రటిక్ స్పిరిట్… పోటీలు పడి, తన్నుకుని, గెలిస్తేనే ఎన్నికల అనేది ఓ దురభిప్రాయం… నిజానికి పంచాయతీ ఎన్నికల్లో వేడి, సవాళ్లు గట్రా ఎక్కువ… నిజంగా టెంపర్మెంట్ ఉన్న వర్గాలు ఉంటే జగన్ కాదు కదా, మోడీ చెప్పినా వినరు… పోటీలోకి దిగుతారు… ఒకవేళ ఏకగ్రీవం జరిగితే మెచ్చుకోవాలి… కానీ ఇవి ఏపీ పాలిటిక్స్ కదా… అంతా రివర్స్… మొదటి దశలో ఏకంగా 523 వరకూ ఏకగ్రీవాలు జరిగినట్టు ఓ రఫ్ లెక్క… దాంతో ఎన్నికల సంఘానికి కోపమొచ్చింది… అవన్నీ సరైనవి కావని సందేహమొచ్చింది… ఛస్, నేనొప్పుకోను అన్నట్టుగా… ఎక్కువ ఏకగ్రీవాలు జరిగిన రెండు జిల్లాల్లో మొత్తం ఏకగ్రీవాల్ని హోల్డ్ చేసి పారేసింది…
చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాల ప్రకటన ఆపేయండి అని కలెక్టర్లను ఆదేశించారు… అంటే జగన్ ఆ రెండు జిల్లాల్లోనే బెదిరించి ఏకగ్రీవాలు చేశాడు గానీ, మిగతా జిల్లాల్లో ఏకగ్రీవాలు జెన్యూన్ అన్నట్టేనా..? పోనీ, ఈ రెండు జిల్లాల్లోనూ అన్నీ జెన్యూన్ కానట్టేనా..? పోనీ, ఇది మొదటి దశే కదా… మరి మిగతా దశల్లోనూ ఏకగ్రీవాలు ఎడాపెడా జరిగితే అప్పుడెలా..? మీ ఏకగ్రీవ స్పూర్తికి అభినందనలు అంటూ జగన్ పార్టీ, ప్రభుత్వం ఇంకా విజృంభించి ఏకగ్రీవాలు చేయిస్తే అప్పుడెలా..? పోనీ, ఎన్నికలు జరిగాక వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తే, అదీ సందేహిద్దామా..? మరి అప్పుడేం చేద్దాం..? ఈలోపు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ గిల్లే యవ్వారాన్ని స్పీడప్ చేస్తుందా..? మనం వెండితెర మీద చూస్తేనే ఉండాలన్నమాట… గంటలవారీ ట్విస్టులు…!!
Share this Article