.
ఒక చిన్న పేపర్ క్లిప్ ఆశ్చర్యాన్ని కలిగించింది… మన వాళ్లు భుజాలు చరుచుకోవడం, గొప్పలు చెప్పుకోవడం చివరకు బ్రిటన్ హౌజ్ ఆఫ్ కామన్స్ ,అంటే పార్లమెంటును కూడా ఎంబరాసింగుకు గురిచేసింది… అదీ పద్మవిభూషణ్ చిరంజీవి సన్మానానికి సంబంధించి…
మొన్నామధ్య చిరంజీవిని సన్మానించి, లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డు ఇచ్చారు కదా లండన్‌లో… అదీ ఓ స్కోచ్ బాపతు అవార్డు… దాని మీద తెలుగు సైట్లు, చానెళ్లు, మీడియా ఇంగ్లిషులో, తెలుగులో పలు భాషల్లో చిరంజీవికి అద్భుత పురస్కారం, బ్రిటన్ పార్లమెంటు సన్మానం అన్నట్టుగా ఎడాపెడా రాసేశాయి…
Ads
సరే, ఏ స్థాయి గుర్తింపైనా సంతోషించదగిందే… కానీ అది పార్లమెంటు చేసే సన్మానం కాదు బాబూ… అది పార్లమెంటులో సన్మానం తప్ప పార్లమెంటు చేసే సన్మానం కాదు, అది చిరు సత్కారమే తప్ప మెగా పురస్కారం కాదు అని ముచ్చట ఆనాడే చెప్పింది… ఇదీ లింక్…
పార్లమెంటులో ఓ హాల్ బుక్ చేసుకుని, ఏ ఎంపీ అయినా ఎవరినైనా సన్మానించొచ్చు… దానికీ పార్లమెంటుకూ సంబంధం ఉండదు.,. ఇది అలాగే జరిగింది… చివరకు చిరంజీవి పేరిట వసూళ్లు కూడా చేశారు అక్కడ… దీన్ని చిరంజీవే బయటపెట్టి, ప్లీజ్ ఆ డబ్బు వాపస్ ఇవ్వండి అని విజ్ఞప్తి చేశాడు… సరే, అవెలాగూ ఎవరూ వాపస్ చేయరు, అది వేరే సంగతి…
అందరూ పార్లమెంటు సన్మానం అని రాశారు సరే, చిరంజీవి తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం ఓ ట్వీట్‌లో అన్నను అభినందిస్తూ తనూ అలాగే రాశాడు… దాంతో హౌజ్ ఆఫ్ కామన్స్ మీడియా రిలేషన్స్ మేనేజర్ సిలాస్ స్కాట్ ఓ వివరణ పంపించాడు ఈ వార్త రాసిన ఓ పత్రికకు…
The Hindu 4 page right corner
ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా అందరికీ… అది జస్ట్, ఓ ప్రైవేటు కార్యక్రమం మాత్రమే… అధికారికం కాదు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ల ట్వీట్లు చివరకు ఎంబరాసింగు సిట్యుయేషన్‌లోకి నెట్టేయకూడదు… అదీ ఈ కార్యక్రమం చెబుతున్న నీతి పాఠం…
పర్లేదు, ప్రచారమైతే వచ్చింది కదా అంటారా..? ఒక పద్మవిభూషణుడు ఇలాంటి ప్రచారం కోరుకోకూడదు… ఇది మరో నీతిపాఠం..! కాలరెగరేసేలా ఉండాలి, కానీ… ఇలా అరెరె, ఇలా జరిగిందేమిటి అనుకునేలా ఉండకూడదు..!!
Share this Article