“ నేను భారత దేశ ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నాను… కుదరక పొతే ఖలిస్ధాన్ కి ప్రధాన మంత్రి అవుతాను” ……….. కేజ్రీవాల్ ! – ఇలా తనతో అన్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ సంస్థాపక సభ్యులలో ఒకరు అయిన కుమార్ విశ్వాస్ బయట పెట్టాడు!
*********
కుటుంబ పార్టీ అని AAP ను అనలేము కానీ త్వరలో కుటుంబ పార్టీ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు! అసలు కథనంలోకి వెళ్ళే ముందు AAP కోసం ఎవరెవరు కష్టపడ్డారో తెలుసుకోవాలి!
1. షజియ ఇల్మి ( Shazia Ilmi ) ఆప్ వ్యవస్థాపక సభ్యురాలు కానీ 2014 లో aap కి రాజీనామా చేసింది. అవినీతి వ్యతిరేక దిశలో ఉండాల్సిన AAP తన లక్ష్యం నుండి పక్కదారి పట్టింది అంటూ రాజీనామా లేఖలో పేర్కొంది ILMI…! తరువాత బీజేపీలో చేరింది.
Ads
2. యోగేంద్ర యాదవ్ కూడా వ్యవస్థాపక సభ్యుడే! కానీ 2015 లో యోగేంద్ర యాదవ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు అని కేజ్రీవాల్ పార్టీ నుండి బహిష్కరించాడు!
3. ప్రశాంత్ భూషణ్, సీనియర్ అడ్వకేట్, సుప్రీం కోర్టు! 2012 లో aap లో చేరాడు. ప్రశాంత్ భూషణ్ లాంటి వారు తన పార్టీలో ఉంటే తన పప్పులు ఉడకవు అని యోగేంద్ర యాదవ్ తో పాటు పార్టీ నుండి బహిష్కరించాడు కేజ్రీవాల్ 2015 లో!
4.ఒక టీవీ చానెల్ లో జర్నలిస్టు గా పనిచేస్తున్న అశుతోష్ రాజీనామ చేసి AAP లో చేరాడు కానీ కొద్ది కాలమే ఉన్నాడు, తరువాత వ్యక్తిగత కారణాలతో AAP కి రాజీనామా చేశాడు! అశుతోష్ రాజ్యసభ సీటు కోసం అడిగాడు కానీ కేజ్రీవాల్ తిరస్కరించాడు!
5. కపిల్ మిశ్రా… ఆప్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) కపిల్ మిశ్రా ను సస్పెండ్ చేసింది. కపిల్ మిశ్రా ఆప్ లో జరుగుతున్న అవినీతి మీద మాట్లాడడమే అతని సస్పెన్షన్ కి కారణం! కపిల్ మిశ్రా నేరుగా కేజ్రీవాల్, సత్యేందర్ జైన్ మీద అవినీతి ఆరోపణలు చేశాడు. తరువాత బీజేపీలో చేరాడు.
6. అంజలీ దామానియ సీనియర్ ఆప్ నాయకురాలు మహారాష్ట్ర. కాంగ్రెస్ MLA లని డబ్బు పెట్టి కొనడానికి ప్రయత్నిస్తున్నాడు అని పార్టీకి రాజీనామా చేసింది.
7. కుమార్ విశ్వాస్, కవి, రాజకీయ నాయకుడు ఆప్ పార్టీ. ఇదే కుమార్ విశ్వాస్ కేజ్రీవాల్ ఖలిస్తాన్ ప్రధాన మంత్రి అవుతానని నాతో అన్నాడు అని బయటపెట్టి మరీ ఆప్ నుండి బయటకి వచ్చేసాడు.
8. అల్కా లాంబ, ఆప్ ఎంఎల్ఏ. 2023 సెప్టెంబర్ లో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఖాస్ ఆద్మీ పార్టీగా మారిపోయింది అని ఆరోపించింది అల్క లాంబా!
9. సుశీల్ కుమార్ రింకు ఆప్ కి ఉన్న ఒకే ఒక్క లోక్ సభ సభ్యుడు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి ప్రస్తుతం జలంధర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ టికెట్ మీద పోటీ చేస్తున్నాడు.
10. ఆప్ పార్టీ మరో ఎంఎల్ఏ, మినిస్టర్ అయిన రాజ్ కుమార్ ఆనంద్ కూడా రాజీనామా చేశాడు కేజ్రీవాల్ అరెస్ట్ అవగానే!
11. ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డా, క్రికెటర్ హర్భజన్ సింగ్ లు కూడా కేజ్రీవాల్ అరెస్ట్ మీద ఒక్క కామెంట్ కూడా చేయకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు.
12. మరో ఆప్ ఎంఎల్ఏ, మంత్రి కైలాష్ గెహ్లాట్ కూడా కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుండి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు బహుశా ఎన్నికల ఫలితాలు రాగానే రాజీనామా చేయవచ్చు.
*******
స్వాతీ మాలీవాల్ ! బహుశా స్వాతీ మాలీవాల్ మరియు రాఘవ్ ఛడ్డాలు ఆమ్ ఆద్మీ పార్టీ చావుకి మరణ శాసనం వ్రాయబోతున్నారా ?
13. కేజ్రీవాల్ అరెస్ట్ అవకముందే రాఘవ్ చడ్డా లండన్ వెళ్ళాడు భార్యతో కలిసి. కేజ్రీవాల్ అరెస్ట్ అవగానే కంటి ఆపరేషన్ కోసం లండన్ వచ్చాను అని చెప్పుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఇప్పటికే దాదాపుగా రెండు నెలలుగా అక్కడే ఉన్నాడు.
14. కేజ్రీవాల్ అరెస్ట్ అవగానే స్వాతీ మాలీవాల్ అమెరికా వెళ్ళింది. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో స్వాతీ సోదరి ప్రొఫెసర్ గా పనిచేస్తున్నది. సదరు ప్రొఫెసర్ కరుడు గట్టిన కమ్యూనిస్టు, యాక్టివిస్ట్ కూడా!
15. స్వాతికి ఖలిస్తాన్ గ్రూపుల నుండి కేజ్రీవాల్ కి నిధులు ఎలా వస్తున్నాయో తెలుసు. కానీ కేజ్రీవాల్ అరెస్ట్ అవగానే నిధులు రావడం ఆగిపోయింది. కాబట్టి నిధులు లండన్ నుండి రావడం ఆగిపోయినందువల్ల లండన్ నుండి అమెరికాకి అక్కడి నుండి పంజాబ్ ద్వారా నిధులు వచ్చేట్లుగా చేయాలని తన సోదరితో మాట్లాడడానికి వెళ్ళింది!
16. మరో వైపు రాఘవ్ ఛడ్డా కూడా కంటి ఆపరేషన్ నెపంతో ఖలిస్తానీ గ్రూపులతో చర్చలు చేస్తున్నాడు లండన్ లో! ఇప్పటికే చాలా పెద్ద మొత్తంలో నిధులు లండన్ లోని బ్యాంకులలో ఉన్నట్లు తెలుసుకున్న రాఘవ్ చడ్డా ఆ నిధులను తన పేరు మీదకి మార్చుకోవాడానికి ప్రయత్నిస్తున్నట్లు భోగట్టా!
17. స్వాతి మాలీవాల్ అమెరికా నుండి వచ్చిన తరువాత వెంటనే కేజ్రీవాల్ ను కలవలేదు. అసలు కేజ్రీవాల్ కి బెయిల్ వస్తుందని ఊహించని స్వాతి అమెరికా నుండి హడావుడిగా వచ్చింది ఢిల్లీకి.
18. నిధుల సేకరణ, మళ్ళింపు కోసం స్వాతి అమెరికా వెళ్ళేముందు కేజ్రీవాల్ కి సమాచారం ఇవ్వలేదు. కేజ్రీవాల్ కి కోపం రావడానికి ఇది ప్రధాన కారణం
.
19.అమెరికాలో స్వాతి ఏం మాట్లాడింది? నిధుల మళ్ళింపు ఎలా జరుగుతుంది? ఇవి కేజ్రీవాల్ స్వాతిని అడిగిన ప్రశ్నలు. కానీ స్వాతి అమెరికాలో ఏం జరిగిందో చెప్పడానికి నిరాకరించింది. దాంతో డౌటొచ్చి స్వాతి మీద దాడి చేయమని తన PA ను ఆదేశించాడు కేజ్రీ వాల్!
20. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ ( బిట్ కాయిన్) ద్వారా డబ్బులు లండన్ నుండి వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవి ఎవరి అకౌంట్ లోకి వస్తున్నాయి, తరువాత వాటిని అమ్మి భారత్ లో ఎవరికి పంపిస్తున్నారో స్వాతికి తెలుసు. ఇప్పుడు అమెరికా నుండి భారత్ లో ఎవరికి పంపిస్తున్నారు అనేది స్వాతీ కి మాత్రమే తెలుసు. ఎటూ జూన్ 2 న కేజ్రీవాల్ జైలుకి వెళితే మళ్ళీ బయటికి రాడు అని స్వాతికి తెలుసు కాబట్టి వివరాలు వెల్లడించాలని వొత్తిడి తెచ్చినా చెప్పడానికి నిరాకరించింది !
********
స్వాతీ మాలీవాల్, కేజ్రీవాల్ లు ఒకరిని ఒకరు బ్లాక్ మెయిల్ చేసుకుంటున్నారు! స్వాతీ మాలీవాల్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు కాబట్టి మొదటి నుండీ పార్టీలో ఏం జరిగిందో మొత్తం తెలుసు. ముఖ్యంగా విదేశీ విరాళాల వివరాలు స్వాతీకి తెలుసు మరియు కొన్ని లావాదేవీలు స్వాతి ద్వారా జరిగినట్లుగా తెలుస్తోంది!
మరీ ఒక మహిళ అని కూడా చూడకుండా బిబవ్ కుమార్ స్వాతి కడుపు మీద పిడి గుద్దులు గుద్దాడు అంటే ఎంత కోపంతో ఉన్నాడో తెలుసుకోవచ్చు! అఫ్కోర్స్! స్వాతి దగ్గర చాలా పెద్ద మొత్తానికీ సంబంధించి వివరాలు ఉన్నాయి అమెరికా నుండి వచ్చిన తరువాత !
ముందు స్వాతిని రాజ్యసభ సభ్యురాలుగా ఉంచకూడదు అని భావించి రాజీనామా చేయమని కేజ్రీవాల్ ఒత్తిడి తెచ్చిన్నట్లుగా తెలుస్తున్నది. ఎందుకంటే ఒక రాజ్యసభ MP గా చట్టపరమైన రక్షణ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి స్వాతి చేత రాజీనామా చేయించి, ఆ సీటు తన కేసు వాదించి తనకి బెయిల్ వచ్చేట్లుగా చేసిన అభిషేక్ మను సింఘ్వీకి ఇవ్వాలని కేజ్రీవాల్ ప్లాన్!
బెయిల్ రాకముందే కేజ్రీవాల్ అభిషేక్ మను సింఘ్వీ కి వాగ్దానం చేశాడు రాజ్యసభ సీటు ఇస్తానని! మరో తన అనుచరుడు అయిన సంజయ్ సింగ్ ను రాజీనామా చేయమని అడగలేడు కేజ్రీవాల్, ఎందుకంటే సినిమా బ్లాక్ టికెట్లు అమ్మడంతో జీవితం మొదలు పెట్టి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఎదిగాడు గూండా అయిన సంజయ్ సింగ్! తిరిగి కేజ్రీవాల్ ను కొట్టడానికి వెనుకాడడు సంజయ్ సింగ్!
*********
పంజాబ్ రైతుల ధర్నా! స్వాతీ మాలీవాల్ కి రైతు ఉద్యమం తాలూకూ అన్ని వివరాలు తెలుసు, అలాగే పంజాబ్ రైతుల ధర్నా తరువాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ ఎలా గెలిచింది తెలుసు! పంజాబ్ రైతుల ధర్నాకి ముందు కేజ్రీవాల్ లండన్ వెళ్ళాడు. అక్కడ ఖలిస్తాన్ గ్రూపులతో చర్చలు జరిపారు.
ఢిల్లీలో రైతు ధర్నాకి సహకరిస్తే బదులుగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీకి గెలుపును ఇస్తామని హామీ తీసుకొని తిరిగి ఢిల్లీకి వచ్చాడు కేజ్రీవాల్! పంజాబ్ ఢిల్లీ సరిహద్దుల దగ్గర పంజాబ్ రైతుల శిబిరాలకు ఢిల్లీ నుండి ఆహారం, మందులు, డీజిల్, పెట్రోల్ సరఫరా చేశాడు కేజ్రీవాల్. ఇది మనకి తెలిసిన విషయమే!
తరువాత జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలిచిన సంగతి తెలిసిందే! ముఖ్యంగా పాకిస్థాన్ తో పంజాబ్ సరిహద్దు ఉన్న జిల్లాలలో మరియు రాజస్థాన్ తో పంజాబ్ కి ఉన్న సరిహద్దు ప్రాంతంలో ఆప్ అభ్యర్ధులు భారీ మెజారిటీ తో గెలిచారు.
So! చాప కింద నీరులా ఖలిస్థానీ ఉద్యమం పాక్ సరిహద్దు ప్రాంతంలో బలంగా విస్తరిస్తున్నది అన్నది స్పష్టం! ISI తన సర్వ శక్తులూ కూడగట్టుకొని ఖలిస్థాన్ ఉద్యమం కోసం పనిచేస్తున్నది. లండన్, అమెరికాల నుండి అక్రమ మార్గాలలో నిధులు వస్తున్నాయి. FATF నిబంధనలు ఈ రెండు దేశాలకి వర్తించవు!
********
స్వాతీ మాలీవాల్ మీద దాడి చేసిన కేజ్రీ వాల్ PA బిబవ్ కుమార్ విషయంలో పెద్ద డ్రామా నడిచింది. మొదట ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పడానికి ప్రయత్నించిన స్వాతీ మాలివాల్ ను ఒక పెద్ద తలకాయ నచ్చచెప్పడంతో వెనక్కి తగ్గింది. కానీ స్వాతిని రెచ్చగొట్టే విధంగా కేజ్రీవాల్ బిబవ్ కుమార్ ను తనతో పాటు బహిరంగ సభలో పక్కనే కూర్చోపెట్టుకోవడం జరిగింది. దాంతో నేరుగా ప్రెస్ మీట్ పెట్టి మరీ తన మీద దాడి ఎలా జరిగిందో వివరంగా చెప్పింది! అలాగే నేరుగా AIIMS (ఎయిమ్స్) కి వెళ్లి మెడికల్ చెక్ అప్ చేయించుకుంది!
21. AIIMS లో డాక్టర్లు సర్టిఫై చేసిన తరువాత స్వాతి మాలివాల్ ముఖం మీద కొట్టిన దెబ్బల వలన లోపలి భాగంలో గాయం అయ్యింది. కడుపు మీద కొట్టడం వలన లోపల గాయం అయ్యింది!
22. మెడికల్ రిపోర్ట్ ఆధారంగా ఢిల్లీ పోలీసులు బిబవ్ కుమార్ మీద FIR నమోదు చేశారు. నిన్న బిబవ్ కుమార్ ని అరెస్ట్ చేశారు!
23. బిబవ్ కుమార్ మీద ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలు :
IPC Sec. 354 Assault or Criminal force to women, intent to outrage modesty.
IPC Sec.506 Criminal Intimidation.
IPC Sec.509 Words, Gestures or acts intended to insult the modesty of a woman.
IPC Sec 309 Voluntarily causing hurt.
AIIMS లో మెడికల్ చెకప్ ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ DCW కి చెందిన మహిళా సభ్యుల సమక్షంలో జరిగింది.
DCW లో ఆప్ మహిళా సభ్యుల నియామకం చేసింది స్వాతి మాలివాల్ DCW కి అధ్యక్షురాలిగా పనిచేసిన కాలంలో. కానీ గత ఫిబ్రవరిలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ DCW పాత సభ్యులని తీసివేసి కొత్త వాళ్ళని నియమించాడు. అదే ఆప్ మహిళా సభ్యులు కనుక ఉంటే మొన్న రాత్రి మెడికల్ చెకప్ సమయంలో సహకరించి ఉండే వాళ్ళు కాదు!
******
ఎవరీ బిబవ్ కుమార్? కేజ్రీవాల్ మిషన్ ఆఫ్ చారిటీ (మదర్ థెరిస్సా) ల వెంట తిరుగుతున్న రోజుల నుండి (25 ఏళ్ల క్రితం) బిబవ్ కుమార్ వెంట ఉండేవాడు. అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం సమయంలో కూడా బిబవ్ కుమార్ కేజ్రీవాల్ తో ఉన్నాడు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాక తన వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నాడు.
22. కేజ్రీవాల్ బిబవ్ కుమార్ కి టైప్ 6 బంగ్లా కేటాయించాడు, అదీ ఢిల్లీ ప్రభుత్వ కాబినెట్ మంత్రులకి మాత్రమే కేటాయిస్తారు కానీ వ్యక్తిగత కార్యదర్శులకు కాదు.
23. వ్యక్తిగత కార్యదర్శికి టైప్ 3 క్వార్టర్ ఇవ్వాలి కానీ కేజ్రీవాల్ టైప్ 6 బంగాళా, అదీ తన నివాసం అయిన శీష్ మహల్ కి ఆనుకుని ఉండే బంగ్లా కేటాయించాడు
So! తన ఎంఎల్ఏ లు, మంత్రులు, పార్లమెంట్ సభ్యుల కంటే కేజ్రీవాల్ కి బిబవ్ కుమార్ చాలా ఎక్కువ అన్నమాట…
24. బిబవ్ కుమార్ ను ఢిల్లీ పోలీసులు విచారించడానికి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళినప్పుడు కేజ్రీవాల్ తన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీలకి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని ఆదేశించాడు!
25. కేజ్రీవాల్ కి ఎంత తెలుసో అంతకంటే ఎక్కువ తెలుసు బిబవ్ కుమార్ కి. అంటే లిక్కర్ గేట్, విదేశీ విరాళాలు, ఎక్కడెక్కడ ఏ దేశంలో ఏ పేరుతో బ్యాంక్ ఎకౌంట్లు ఉన్నాయో అన్నీ బిబవ్ కుమార్ దగ్గర వివరాలు ఉన్నాయి.
**********
స్వాతి మాలివాల్ ను కొట్టడం మంచిదే అయ్యింది దేశానికి. ఇక ముందు పోలీసుల విచారణలో దిగ్భ్రాంతి గొలిపే విషయాలు బయటపడతాయి బిబవ్ కుమార్ నోటీ నుంచి! అందుకే కేజ్రీవాల్ ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో ధర్నా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బహుశా రేపు ఇది జరగవచ్చు.
సంజయ్ సింగ్ ED ముందు నోరు విప్పాడు కనుకనే బెయిల్ మీద అభ్యంతరం లేదని ED అన్నది. ఇక లండన్ నుండి రాఘవ్ చడ్డా ఢిల్లీ వచ్చేసాడు. రేపో మాపో రాజ్యసభకు రాజీనామా చేయమని కేజ్రీవాల్ అడగవచ్చు. అదే సమయంలో నిధుల విషయంలో మరో సీన్ క్రియేట్ అవవచ్చు. కానీ బిబవ్ కుమార్ ఉండడు ఈసారి.
*******
ఆమ్ ఆద్మీ పార్టీ చీలిపోతుంది అని కొందరు అంటుంటే అసలు గుర్తింపు రద్దు అవ్వవచ్చు అని అంటున్నారు. ఏ కుంభకోణంలోనూ నాకు సంబంధం లేదు, నేను సంతకం పెట్టలేదు కాబట్టి నన్ను అరెస్ట్ చేయడం చెల్లదు అని కదా కోర్టులో వాదిస్తున్నది. ED ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తాన్ని బాధ్యురాలిగా చేస్తూ పిటిషన్ వేసింది. సుప్రీం కోర్టు కనుక ED వాదనలు, సాక్ష్యాలు పరిగణనలోకి తీసుకుంటే గుర్తింపు రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వవచ్చు!
అసలు బిబవ్ కుమార్ మీద ఉత్తరప్రదేశ్ లో హత్యా ప్రయత్నం చేశాడు మరియు హర్యానాకి చెందిన బిజినెస్ మేన్ ను బెదిరించాడు అనే కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ విజిలెన్స్ సెల్ బిబవ్ కుమార్ కి అధికారిక బంగ్లా కేటాయించవద్దని, అలాగే అతనిని వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకోవద్దనీ సిఫారసు చేసింది కానీ కేజ్రీవాల్ లెక్క చేయలేదు. SO! బిబవ్ కుమార్ కి బెయిల్ దొరకడం దుర్లభం!
Share this Article